SHORT TERM HOLIDAYS SUFFIX – PREFIX పై వివరణ
15 రోజులు మించిన సెలవు కాలాన్ని *వెకేషన్* అంటారు.
15 రోజుల లోపు సెలవులను మిడ్ టర్మ్ హాలిడేస్ అంటారు.
10 రోజులకు పైబడి 15 రోజులకు మించని మిడ్ టర్మ్ సెలవుల సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున, తెరిచే రోజున తప్పక హాజరుకావాలి.
(Rc .No.10324/E4-2/69,Dt :7-11-1969)
మిడ్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల లోపు ఉన్న సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున లేదా తెరిచే రోజున* గైర్హాజరు అయిన సందర్భం లో సాధారణ సెలవు(CL) పెట్టుకొనవచ్చును.
పబ్లిక్ సెలవులు అనుసంధానం (SUFFIX)
ఒక ఉద్యోగికి మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా 20-11-2015 నుండి 13-12-2015 వరకు సెలవు.ఆ వెంటనే వచ్చిన 14-12-2015,15-12-2015 పబ్లిక్ సెలవులు వినియోగించుకుటకు అనుమతించనైనది.ఆ ఉద్యోగి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ జతపరుస్తూ 16-12-2015 తేదీన డ్యూటీలో చేరాడు.
అట్టి సందర్భoలో:
a) డాక్టర్ జారీచేసిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ 16-12-2015 తేదీన జారీచేసిన యెడల 14-12-2015 మరియు 15-12-2015 తేదిలలో వున్న పబ్లిక్ హాలిడేస్ సెలవుకు అనుసంధానం (suffix) చేయుటకు వీలులేదు.
b) ఒకవేళ డాక్టర్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ 13-12-2015 తేదీన జారీచేసిన యెడల పబ్లిక్ హాలిడేస్ అయిన 14-12-2015 మరియు 15-12-2015 రెండు రోజులు సెలవుకు అనుసంధానం(suffix) చేసుకొనవచ్చును.
c) ఒకవేళ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ 14-12-2015 తేదీన గానీ లేక 15-12-2015 తేదీన గాని జారీచేసిన యెడల ఆ రెండు రోజులు సెలవుగా పరిగణించాలి.
వేసవిలో సంపాదిత సెలవులు పొందడం
పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను "సంపాదిత సెలవులు" అందురు.
15 రొజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b) ప్రకారం ఇటువంటి సెలవులు మంజూరు చేస్తారు.
వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు ఎన్నికలు,జనాభా గణన, జనాభా ఓట్ల జాబిత తయారీ,పరీక్షలు మొదలగు విధులు నిర్వర్తించినపుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.35 Dt:16-1-1981)
(G.O.Ms.No.151 Dt:14-11-2000)
(G.O.Ms.No.174 Dt:19-12-2000)
వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా పద్దతిలో మాత్రమే సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.114 Dt:28-4-2005)
సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు,ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి సర్వీసు పుస్తకములో నమోదుచేస్తారు.
(Rc.No.362 Dt:16-11-2013)
వేసవి సెలవులు 49
రోజులు ప్రకటించిన సందర్భంలో సంపాదిత సెలవులు మంజూరుచేయు విధానం:
సూత్రం:
డ్యూటీ కాలము x 1/11-(365x1)/11-(27xవాడుకున్న వేసవి సెలవులు /మొత్తం వేసవి సెలవులు)-6
పనిచేసిన రోజులు-సంపాదిత సెలవులు
>1-1
>2-1
>3-2
>4-2
>5-3
>6-3
>7-4
>8-5
>9-5
>10-6
>11-6
>12-7
>13-7
>14-8
>15-8
>16-9
>17-10
>18-10
>19-11
>20-11
>21-12
>22-12
>23-13
>24-13
>25-14
>26-15
>27-15
>28-16
>29-16
>30-17
>31-17
>32-18
>33-18
>34-19
>35-19
>36-20
>37-21
>38-21
>39-22
>40-22
>41-23
>42-23
>43,44,45,46,47,48,49-24 రోజులు
child care leave
LEAVE RULES...
LEAVE RULES -TELUGU (from praful)
surrenderleave encashment 2011-2012, MEMO. NO 14781
SURRENDER LEAVE 2010-11 MEMO NO. 15744
Rc.No222 dt.15.9.11Engaging of V.V in place of Meternity Leave.
Leave Rules