ఈ పేజీలో మీకు ఈ క్రిందివాని సమాచారం సమగ్రంగా దొరుకుతుంది
30 సం౹౹ల స్కేల్(SPP II B) అమలుపై వివరణ
దశాబ్దాల నాటి 10 సర్టిఫికెట్ అయినా స్థానికంగా పొందే వెసులుబాటు
సాధారణ ఆకస్మిక సెలవు
EWF :-
సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్:-
30 సం౹౹ల స్కేల్(SPP II B) అమలుపై వివరణ
పదోన్నతి లేక ఒకే క్యాడర్ లో కొనసాగుతున్న ఉద్యోగులకు 2022 పీఆర్సీలో కొత్తగా 30 సం౹౹ల స్కేల్ మంజూరు చేస్తు GO Ms No. 1 Finance (PC-TA) dept dt. 17.01.2022 ఉత్తర్వులు ఇచ్చారు. అయితేఈ 30 సం౹౹ల స్కేల్ అమలుపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా డిటిఏ గారు Lr No. FIN02-18069/ 65/2022-H SEC-DTA dt.02.09.2022 లేఖ ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. అందులో 2011 లో కొత్తగా మంజూరు చేసిన 18 సం౹౹ల స్కేల్ అమలుపై ఇచ్చిన Cir. 020091ని అనుసరించాలని సూచించారు.
2010 పీఆర్సీకి మునుపు 8/16/24 సం౹౹ల స్కేల్స్ అమలులో ఉండగా GO 96 తేదీ 20.05.2011 మేరకు 8/16/24కు బదులుగా 6/12/24 స్కేల్స్ గా మారుస్తు కొత్తగా 18 స్కేల్ మంజూరు చేయడం జరిగింది. 18 స్కేల్ అమలుపై ఆనాడు 11 అంశాలపై వివరణలు ఇస్తు Cir.Memo No.020091/ 125/PC.II/2011 Finance dept dt.17.08.2011 ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వివరణలు 30సం౹౹ల స్కేల్ అమలుకు అన్వయించుకోవాలి. అందులోని వివరణల మేరకు
1) 01.07.2018నాటి కన్నా ముందు ఒకే క్యాడర్ లో 30సం౹౹ల సర్వీస్ పూర్తి చేసుకుని 01.07.2018 నాటికి అదే క్యాడర్ లో కొనసాగుతున్న ఆ ఉద్యోగికి 1.7.2018 నుండి మాత్రమే 30సం౹౹ల స్కేల్ మంజూరు చేయవచ్చు.
2) 01.07.2018 తేదీ నాటి కన్నా ముందు 30స౹౹ల సర్వీసు పూర్తయి 01.07.2018 నాటికి క్యాడర్ మారిన వారికి ఈస్కేల్ వర్తించదు.
3) 01.07.2018 తర్వాత 30 సం౹౹ల సర్వీసు పూర్తయి తర్వాత పదోన్నతి పొందిన వారికి కూడా 30 సం౹౹ల స్కేల్ వర్తిస్తుంది.
4) 24/30 సం౹౹ల స్కేల్స్(SPP II) పొందిన తర్వాత పదోన్నతి పొందిన వారికి FR22(B) వర్తించదు. అనగా FR 22(a)(1) మేరకు ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే మంజూరు చేస్తారు.
5) 24/30 సం౹౹ల స్కేల్ పొందిన తర్వాత పదోన్నతి పొందిన క్యాడర్ లో AAS వర్తించదు.
6) 30 సం౹౹ల స్కేల్ వేతన స్థిరీకరణ 01.01.2022 నుండి మాత్రమే నగదుగా చెల్లిస్తారు.
దశాబ్దాల నాటి 10th సర్టిఫికెట్ అయినా స్థానికంగా పొందే వెసులుబాటు
దశాబ్దాల నాటి సర్టిఫికెట్ అయినా స్థానికంగా పొందే వెసులుబాటు
మీ సేవతో ఎస్ఎస్సి బోర్డు ఒప్పందం
నాలుగున్నర దశాబ్దాల క్రితం నాటి 10వ తరగతి సర్టి ఫికెట్ ఇప్పుడు మీకు అవసరం అయిందా? సర్టిఫికెట్ లేకపోవడం, ఒక వేళ ఉన్నా చిరిగిపోవడం, నలిగిపోయిందన్న బాధ ఉందా? ఈ సమస్యలకు పరి ష్కారంగా ఎస్ఎస్ సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 1969 నుంచి 2013వ సంవత్సరం వరకు 10 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు పాస్ లేదా ఫెయిల్ సర్టిఫికెట్లను తాజాగా పొందేందుకు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెసులు బాటు కల్పించింది. సమీపంలోని మీ సేవ కేంద్రంలో నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోగా సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఇతర రాష్ట్రాలకు విద్య, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళే అభ్యర్థులకు తప్పనిసరిగా అవసరమైన మైగ్రేషన్, వయసు ధృవీకరణ పత్రాలను మాత్రం టెన్ ఉత్తీర్ణత సాధించిన వారికే జారీ చేస్తారు. అభ్యర్థి 10వ తరగతి పరీక్ష రోల్ నెంబరు, పాసైన సంవత్సరం ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానం ప్రకారం ఈ సర్టిఫికెట్లను పొందాలంటే హైదరాబాద్ వెళ్ళి ఎఎస్సి బోర్డులో దరఖాస్తు చేసుకుని నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. దీని వల్ల అభ్యర్థులకు ఖర్చు, కాలయాపన జరిగేది. తాజూగా మీ- సేవ కేంద్రాల్లో ఆన్లైన్ సర్వీసు ద్వారా సర్టిఫికెట్ల జారీకి ఎస్ఎస్ సీ బోర్డు ఒప్పందం చేసుకోవడంతో కీలకమైన ఈ సమస్యకు స్థానికంగానే పరిష్కారం లభించినట్లయింది. ధృవపత్రాలను ఎస్ఎస్ సీ బోర్డు అదనపు సంయుక్త కార్యదర్శి
,సంతకంతో జారీ చేస్తారు.
Information for Female teachers leave management
1.EARNED LEAVE
(ఇవి సంవత్సర సర్వీస్ కి 6 వస్తాయి.సర్వీస్ ని బట్టి లెక్కించవలెను. ఏమైనా earned లీవ్స్ క్యాష్ చేసుకున్నట్లైతే availed దగ్గర చూపించాలి..ex-15/30/60...)
2.Extraordinary Leave-1461days
(ఇవి జీత నష్టపు సెలవులు ....app లో 1461 maximum తీసుకుంటుంది.ఏమైనా వాడుకొనినచో ఆ నెంబర్ availed దగ్గర ఎంటర్ చేయండి)
3.HALF PAY LEAVE*(commutation)
(ఇవి సంవత్సర సర్వీస్ కి 20 వస్తాయి.no. of days column లో మీ సర్వీస్ బట్టి నమోదు చేసుకొనవలెను.)
హాఫ్ పే లీవ్ పెట్టుకొని ఫుల్ శాలరీ draw చేసినట్లయితే ఈ commutation దగ్గర availed column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు double చేసి నమోదు చెయ్యాలి.
4.HALF PAY LEAVE*(private affairs)
(ఇక్కడ కూడా no. of. days column దగ్గర అదే నెంబర్ ఎంటర్ చేయాలి)
హాఫ్ పే లీవ్ పెట్టుకొని సగం శాలరీ draw చేసినట్లయితే ఈ private affairs దగ్గర availed column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు నమోదు చెయ్యాలి.
5.SPECIAL CASUAL LEAVES-7days
6.Special casual leave on spl occasions (national/state events)
ఏమైనా తీసుకుంటే నెంబర్ వెయ్యండి లేకపోతే సున్నా పెట్టండి
7.Special casual leave on spl occasions-21 days
(Representing Recognised unions)
8.Special casual leave on spl occasions
(Participating in scouts/guides camps)
ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే సున్నా పెట్టండి.
9.Special casual leave on spl occasions-14days (Tubectomy)
10.Special casual leave on spl occasions-21days
(Recanalization of tubectomy operation)
11.CASUAL LEAVE-15 days
12.STUDY LEAVE-1825 days
13.Maternity leave-360days
14.Child care leave-180 days
15.Abortion leave-42 days
16.Special disability leave-730 days
17.Casual leave(Additional for women)-5days
CHAILD CARE LEAVE
మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు ఇప్పటి వరకు సంచల యొక్క ప్రాతినిధ్యంతో క్రింద తెలుప బడిన ప్రత్యేక సెలవులు(సి.యల్స్ & స్పెషల్ సీ.యల్స్ (15+7)కాకుండా) సాధించుకొని వినియోగించు కొనుచున్నాము.
1. ప్రసూతి సెలవులు ......180 రోజులు (జి.ఓ..యం.యస్.నెం.152, తేదీ.04/05/2010)
2.అబార్షన్ సెలవులు ......42 రోజులు (జి.ఓ.యం.యస్.నెం.219, తేది.25/06/1984)
3.ట్యూబెక్టమీ ఆపరేషన్ సెలవులు ......14 రోజులు (జి.ఓ.యం.యస్.నెం.1415, తేది.10/06/1968)
4. కానలైజేషన్ ఆపరేషన్ సెలవులు21 రోజులు (జి.ఓ.యం.యస్.నెం.102, తేది.19/02/1981)
5.గర్భనిరోధక సాధనం(లూప్ అమర్చుటకు ...... 01రోజు (జి.ఓ యం.యస్.నెం.102, తేది.19/02/1981)
6.గర్భసంచి తొలగింపు హిస్టారెక్టమీ ఆపరేషన్ సెలవులు--.... 45 రోజులు (జి.ఓ.యం.యస్.నెం.152, తేది.31/04/2011)
7. మహిళా దినోత్సవము (మార్చి, 8)................ 01 రోజు (జి.ఓ యం.యస్.నెం.433, తేదీ.04/08/2010)
8.మహిళా ఉపాధ్యాయినీలకు ప్రత్యేక సెలవులు.... 5 రోజులు( జి.ఓ యం.యస్.నెం.374, తేది.16/03/1998).
పై విధంగా ప్రత్యేక సెలవులతో పాటుగా ప్రస్తుత 10వ పి.ఆర్.సి. ప్రతిపాదనలు అనుగుణంగా సర్వీసు మొత్తములో పిల్లలను పెంచు నిమిత్తము లేక పాఠశాల&కాలేజి స్థాయి పరీక్షల సమయంలోనూ,వారి అనారోగ్య సమయంలలో, వగైరాలకు 2నెలలు (60రోజులు) వరకు శిశు సంరక్షణ సెలవులు క్రింద తెలుపబడిన నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకొనుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినది. ఈ సదుపాయము మహిళా ఉద్యోగులకు ఒక వరంగా భావించుటలో అతిశయోక్తి లేదు.
1. సెలవులను 3సారు తగ్గకుండా ఇద్దరి పిల్లల యొక్క వయస్సు 18సంIIల లోపు వరకు మరియు అశక్తులైనపిల్లల యొక్క (మానసిక , శారీరక వికలాంగులు) వయస్సు 22 సంIIలలోపు వరకు ఎన్నిసార్లు అయిననూ వినియోగించు కొనవచ్చు.
2. ఈ సెలవులను LTC . నిమిత్తంగా వాడుకోనుకు అవకాశము లేదు.
3. ఈ సెలవులు వినియోగించుకొనిన వివరాలు జి.ఓ నందు పొందు పరచబడిన సంబంధిత ప్రొఫార్మా ప్రకారంగా ఇ.యల్స్
మరియు అర్ధజీతపు సెలవుల అకౌంటు మాదిరిగా సర్వసు రిజిస్టరు నందు నమోదు పరచుకొనవలెను.
4. ఈ సెలవులు ఇ.యల్స్ మరియు ఆర్టజీతపు సెలవుల అకౌంటు నుండి తగ్గించబడవు.
5. ఈ సెలవులు కార్యాలయము/సంస్థ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందు లేకుండా మాత్రమే వినియోగించుకొనవలెను.
6. ఈ సెలవులు వినియోగించుకొనుట హాక్కుగా భావించరాదు. మంజూరు చేయు అధికారిని ముందుగానే అనుమతి తీసుకొని మాత్రమే వినియోగించుకోనవలెను.
7. ఈ సెలవులు సంపాదిత సెలవులుగానే పరిగణించాలి.
8. ఈ సెలవులు ప్రసూతి సెలవులు మరియు ఇతర సెలవులతో కలుపుకొని అనగా స్.యల్స్ & స్పెషల్ స్.యల్స్ కాకుండా వినియోగించుకొనవచ్చు.
9. ఉద్యోగిని యొక్క ప్రొబేషన్ కాలము నందుకూడా వినియోగించుకొనవచ్చు కాని సదరు కాలము వరకు ప్రొబేషన్ కాలము పొడిగించబడును.
10. ఈ సెలవులను లీవ్ - నాట్ - డ్యూ గా అవకాశము కలదు.
Leave Not Due - సంపాదించని సెలవు
AP Leave Rules 1933 మరియు 15C, 18C మరియు 25 ను అనుసరించి ప్రొటేషన్ కాలము సంతృప్తికరంగా పూర్తిచేసిన సుపీరియరు మరియు నాల్గవ తరగతీ సర్వీసులకు చెందిన ఉద్యోగులందరూ ఈ సెలవు పొందుటకు అర్హులు .
సంపాదించని సెలవు మెడికల్ సర్టిఫికెట్ పై మాత్రమే,సగం జీతం సెలవు ఖాతాలో నిల్వలేనపుడు భవిష్యత్ లో ఆర్జించిబోవు సగం జీతపు సెలవును వినియోగించుటకు ఈ సెలవు మంజూరు చేయవచ్చును. *[Rule 15(c) & 18(C)]* *(G.O.Ms.No.543 F&P Dt:07-12-1977)
మొత్తం సర్వీసులో 180 రోజులకు మించకుండా ఈ సెలవు మంజూరు చేయవచ్చును. ఈ విధంగా మంజూరైన సంపాదించని సెలవు సగం జీతం సెలవు ఖాతాలో (-) గా నమోదుచేయాలి.
భవిష్యత్తు లో ఆ ఉద్యోగి సంపాదించుకోగలిగిన సగం జీతం సెలవుకు మించి ఇట్టి సెలవును మంజూరు చేయకూడదు.
ఉద్యోగి భవిష్యత్తు లో సగం జీతం సెలవు సంపాదించుకోగలడనీ, అంతేకాకుండా మంజూరైన సెలవు తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరుతాడని విశ్వసించినపుడు మాత్రమే సెలవు మంజూరు చేయాలి.
ఒకవేళ సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగి ఏ కారణం చేతనైనా స్వచ్ఛంద పదవీ విరమణ చేయదలచుకున్న అంతకు ముందు మంజూరు చేసిన సెలవు ఉత్తర్వులను రద్దుపరచాలి.అట్టి సందర్భాలలో సెలవు ఎప్పటినుండి ప్రారంభమయ్యిందో అప్పటి నుండి స్వచ్ఛంద పదవీ విరమణ అమలులోకి వస్తుంది.
అనారోగ్య కారణంగా ఉద్యోగంలో కొనసాగుటకు అశక్తుడై పదవీ విరమణ చేసినా గాని,క్రమశిక్షణా చర్యల ప్రకారం నిర్భంద పదవీ విరమణ చేయబడినా గాని,లేక మరణించినా గాని ఆ ఉద్యోగికిచ్చిన సంపాదించని సెలవు జీతాన్ని వసూలు చేయనవసరం లేదు. *(G.O.Ms.No.290 F&P Dt:19-11-1981)*
సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగులకు సగం జీతం సెలవులో పొందే సెలవు జీతం మరియు భత్యం చెల్లిస్తారు.
స్టెప్అప్, ప్రీ పోస్మేంట్ ఆఫ్ ఇంక్రిమెంటు
నియమనిబంధనలు :
9వ వేతన సవరణ సంఘం చేసిన సానుకూలమైన సిఫారసులలో ముఖ్యమైనది స్టెప్అప్, ప్రీపొన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంటు సౌకర్యాలను పునరుద్ధరించటం. ఆర్పిఎస్-93కి ముందు ఇవి అమలులో ఉన్నాయి. 31.07.93 నుండి (93,98,2005 పీఆర్సీలలో) వీటి అమలును నిలిపి వేశారు. ఆ కారణంగా ఏర్పడిన వేతన వ్యత్యాసాల వల్ల పలువురు సీనియర్ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు నష్టం జరిగింది. ఈ నష్టాలను 9వ వేతన సవరణ కమీషన్ దృష్టికి తీసుకువచ్చి, స్టెప్అప్, ప్రీపోన్మెంటు సౌకర్యాలను పునరుద్ధరించాలని యుటియఫ్ చేసిన వాదనను అంగీకరించిన పీఆర్సీ ఆసౌకర్యాలను పునరుద్ధ-రించింది.అంతే కాకుండా గత పీఆర్సీలలో ఏర్పడిన అసమానతలను సవరించిన అనంతరమే 2010 వేతన స్థిరీకరణ నిర్వహించాలని సిఫారసు చేసింది. 17 ఏళ్ళ అనంతరం పునరుజ్జీవం పొందిన స్టెప్అప్, ప్రీపోన్మెంటు ఆఫ్ ఇంక్రిమెంట్ గురించి తెలుసుకుందాము..
స్టెప్ అప్:
సీనియర్ ఉపాధ్యాయులు తన కంటే జూనియర్ అయిన ఉపాధ్యాయుని కంటే తక్కువ వేతనము పొందుతుంటే అట్టి వ్యత్యాసమును ఎఫ్ఆర్ 27 ప్రకారం సవరించబడుటను స్టెప్అప్ అంటారు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్‌లో 10-15 సంవత్సరాల స్కేళ్ళఅమలు వలన వచ్చిన వ్యత్యాసమును సవరించుటకు ప్రభుత్వం జి.ఓ.ఎంఎస్.నం. 297 ఆర్థిక & ప్రణాళిక, తేది. 25.10.1983 ద్వారా స్టెప్అప్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఎఎఎస్లో 10/15/22 సం||ల స్కేళ్ళ అమలు, పదోన్నతి సందర్భములో ఎఫ్ఆర్ 22(బి) అమలు తదితర కారణాలవలన వచ్చిన వ్యత్యాసమును సవరించుటకు ప్రభుత్వం జి.ఓ.ఎంఎస్.నం. 75 ఆర్థిక & ప్రణాళికా శాఖ, తేది. 22.02.94 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. పై రెండు ఉత్తర్వులను ఉపాధ్యాయులకు కూడా వర్తింప చేస్తూ ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్.నం. 475 విద్య, తేది. 02.11.98 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
పై ఉత్తర్వులు 93 పీఆర్సీ స్కేళ్ళ అమలుకు ముందు వరకు అనగా 31.07.93 వరకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. తదుపరి 93,99 పీఆర్సీల్లో ఎఎ స్కీము స్కేళ్ళు పొందినవారికి ఎఫ్ఆర్ 22బి ప్రయోజనం నిరాకరించబడి ఆర్పిఎస్ 2005లో పునరుద్ధరించ బడింది. ఆ కారణంగా ఏర్పడిన వేతన వ్యత్యాసాలను సవరించటానికి వీల్లేదని ప్రభుత్వం మెమో నం. 2620-ఎ/65/ఎఫ్ఆర్-11/07, తేదీ. 20.02.2007 ద్వారా ఆదేశించింది. అందువలన అనేకమంది సీనియర్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ జూనియర్లకంటే తక్కువ వేతనం పొందుతున్నారు. అటువంటి వారందరికీ ఇప్పుడు ప్రయోజనం కలుగుతుంది. పైన పేర్కొన్న ప్రభుత్వ ఉత్తర్వులలో స్టెప్అప్ ఉత్తర్వులు అమలు చేయుటకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను నిర్ధేశించింది. ఈ నిబంధనల పరిధిలోనే స్టెప్అప్ అమలు చేయబడుతుంది.
నిబంధనలు :
1. సీనియర్, జూనియర్ ఉపాధ్యాయుని నియామకం ఒకే యూనిట్లో జరిగి ఉండాలి. అనగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్‌లలో పని చేసే వారికి అదే యూనిట్లో పని చేసే వారితో పోల్చుకోవాలి.
2. సీనియర్, జూనియర్లు ఒకే పే స్కేలు కలిగి ఉండాలి.
3. సీనియర్, జూనియర్లు ఇద్దరూ ఒకే పే స్కేలు, ఒకే సబ్జెక్టు మరియు ఒకే ప్రమోషన్ ఛానల్ కలిగిన కేటగిరీలోనికి పదోన్నతి పొంది ఉండాలి.
4. పదోన్నతి పొందుటకు ముందు క్రింది కేడరు పోస్టులో జూనియర్ యొక్క వేతనం సీనియర్ వేతనముకంటే తక్కువగా గాని లేక సమానముగా గాని ఉండాలి.
5. ఎఫ్ఆర్ 27 ప్రకారము సీనియర్ వేతనమును జూనియర్ వేతనముతో సమానము (స్టెప్అప్) చేసిన తదుపరి సీనియర్ ఉపాధ్యాయునికి వార్షిక ఇంక్రిమెంట్ స్టెప్అప్ జరిగిన తేదీనుండి ఒక సంవత్సరమునకు మంజూరు చేయబడుతుంది. ఒక వేళ జూనియర్ వేతనము ఎఫ్ఆర్ 31(2) ప్రకారం ఇంక్రిమెంటు తేదీకి రీ ఫిక్స్ చేయబడియుంటే సీనియర్ వేతనము కూడా అదే విధంగా సదరు తేదీకి జూనియర్‌తో సమానంగా స్టెప్అప్ చేయబడును.
6. సీనియర్ పదోన్నతి పొందిన తదుపరి జూనియర్ దిగువ క్యాడరులోనే 8/16/24 సం||ల స్కేలులో వేతన నిర్ణయం పొంది తదుపరి పదోన్నతి పొందిన సందర్భములో జూనియర్ వేతనముతో సీనియర్ వేతనం స్టెప్అప్ చేయబడును.
7. సీనియర్ పదోన్నతి పొందినప్పుడు ఎఫ్ఆర్ 22(ఎ)(1) ప్రకారం వేతన నిర్ణయం జరిగి, జూనియర్ పదోన్నతి పొందినప్పుడు ఎఫ్ఆర్ 22బి ప్రకారం వేతన నిర్ణయం జరిగిన సందర్భములో వీరి వేతనంలో కలిగే అసమానతను స్టెప్అప్తో సరి చేస్తారు.
8. సీనియర్ వేతనముకంటే జూనియర్ వేతనము (ఎ) అదనపు అర్హతలకు మంజూరు చేయబడిన అదనపు ఇంక్రిమెంట్ల వల్ల కానీ (బి) కుటుంబ నియంత్రణ అమలుకు జారీ చేయబడిన వ్యక్తి గత వేతనము వలన గాని (సి) జూనియర్‌కు మంజూరు చేయబడిన ప్రొత్సహక ఇంక్రిమెంట్లు వలనగాని పెరిగినట్లైతే, వీరి వేతనములో వచ్చిన వ్యత్యాసమును ఈ ఉత్తర్వుల ప్రకారం స్టెప్అప్ చేయు అవకాశము లేదు.
9. పీఆర్సీ 2010 సిఫారసు మేరకు పీఆర్సీ అమలు తేది. 01.07.2008 నాటికి పై నిబంధనల మేరకు జూనియర్ ఉపాధ్యాయుని కంటే సీనియర్ ఉపాధ్యాయుడు తక్కువ వేతనం పొందుతుంటే ఆ తేడాను సవరించిన తదుపరి ఆర్పిఎస్ 2010 స్కేళ్ళలో వేతన నిర్ణయం చేయబడుతుంది.
ఉదాహరణ : 89 డిఎస్సిలో 17.07.89న 1010-1800/1010 వేతనంతో నియామకమైన ఏ,బి అనే ఇరువురు ఎస్జిటిలలో సెలక్షన్ లిస్ట్ ప్రకారం సీనియర్ అయిన (ఎ) అనే ఉపాధ్యాయుడు ప్రథమ నియామకం తేదీకే, బిఎస్సీ, బిఇడి (మాథ్స్) అర్హతలు కలిగి, ఎఎ స్కీములో 8 సం||ల స్కేలు తీసుకున్న అనంతరం 12.09.98న ఎస్ఏ (మాథ్స్) ప్రమోషన్ పొందినందున ఎఫ్ఆర్ 22 (బి)(రి) ప్రకారం వేతనం స్థిరీకరణ జరిగింది. (బి) అనే ఉపాధ్యాయుడు ఇంటర్, టిటిసి అర్హతలతో ఉద్యోగంలో చేరి తరువాత కాలంలో బిఎస్సీ, బిఇడి అర్హతలు సంపాదించి, 8/16 సం||ల స్కేళ్ళు తీసుకున్న అనంతరం 1.03.2006న స్కూల్ అసిస్టెంట్ మాథ్స్గా ప్రమోషన్ పొందాడు. అతని వేతనం ఎఫ్ఆర్ 22 బి ప్రకారం స్థిరీకరించ బడింది. ఆ కారణంగా (బి) అనే ఉపాధ్యాయుడు (ఎ) కంటే 1 లేదా 2 ఇంక్రిమెంట్లు అదనంగా వేతనం పొందే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో (ఎ) వేతనాన్ని (బి)కి ప్రమోషన్ పోస్టులో వేతన స్థిరీకరణ జరిగిన (1.03.06 / 01.07.06) తేదీ నాడు స్టెప్అప్ ద్వారా సమానం చేస్తారు. ఆ తదుపరి ఒక సంవత్సరం తర్వాత వార్షిక ఇంక్రిమెంటు ఇస్తారు. అటు పిమ్మట 01.07.08 నాటి వేతనం ఆధారంగా ఆర్పిఎస్ 2010లో వేతన స్థిరీకరణ జరుగుతుంది
1.ప్రశ్న : (i) నేను 2002 డిఎస్పీలో స్పెషల్ వి.వి.గా ఎంపికై డిసెంబర్ 2005 లో రెగ్యులర్ ఎస్.జి.టి. గా నియామకమయ్యాను. 1.7.08 నాడు RPS- 2010 నందు నా వేతనం రు.1 1,530/- గా ఉన్నది. అయితే 2003 డిఎస్పీ లో ఎంపీకై 7.12.2005 న అఫ్రంటీస్ ఎస్ జి టి గా చేరిన ఒక ఉపాధ్యాయుడు ఆరు నెలలు ఇ.ఓ.ఎల్ కారణంగా 14.7.08 న రెగ్యులర్ స్కేల్ పొందాడు. ఆయనకు ఆర్.పీ.ఎస్ 2010 స్కేళ్ళలో 2 నేషనల్ ఇంక్రిమెంట్ లతో కలుపుకుని వేతనం 12190అవుతున్నది. ఆతను నాకంటే జూనియర్ అయినందున నాకు స్టెప్ అప్ వర్తిస్తుందా?
(ii) 2001,2002 DSC స్కూల్ అసిస్టెంట్ లు 1.7.08 నాడు ఆర్.పీ.ఎస్-10 లో రు. 14860/- వేతనం పొందుతూ ఉంటుండగా, 2003 డిఎస్పీ వారు 1.10.08 నాడు 2 నేషనల్ ఇంక్రిమెంట్ కలుపుకుని రు. 15700/- వేతనం పొందుతున్నారు. ఈ వ్యత్యాసం సవరించేందుకు పరిష్కారం ఏమిటి?
జవాబు: ప్రస్తుతం అమలులో ఉన్న స్టెప్ అప్ నిబంధనల ప్రకారం ఈ వ్యత్యాసం సవరించడానికి అవకాసం లేదు కానీ ఎఫ్ఆర్ 27 ప్రకారం ప్రత్యేక సందర్భాలలో ప్రీమేచుర్ ఇంక్రిమెంట్ మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. కనుక మీరు మీ జూనియర్ వేతన వివరాలతో కంపారిటివ్ స్టేట్మెంట్ తయారు చేసి డిఇవో ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోండి.
2.ప్రశ్న: నేను 2002 జనవరిలో ఎస్.జి.టి గా నియామకమయ్యాను. మా డి.ఎస్.సి లోనే ఎంపికైన నా జూనియర్ ఆరు నెలల ఇ.వీ.ఎల్ కారణంగా ఇంక్రిమెంట్ తేది పోస్ట్ పోన్ అయింది. ఆర్.పి.ఎస్. 200 ఫిక్సేషన్ లో ఇరువురి వేతనం ఒకే స్టేజి లో స్త్రీకరించబడినది అతనికి జూలై లోనే ఇంక్రిమెంట్ వస్తుంది నేను జనవరి వరకు ఆగాల్సి వస్తుంది ప్రేపొంమేంట్ కు STO ఒప్పుకోవడం లేదు. జీత నష్టపు సెలవు వాడుకున్న వారితో ప్రేపొంమేంట్ కుదరదంటున్నారు. సమంజసమేనా?
జవాబు: సమంజసం కాదు. జూనియర్ ఇంక్రిమెంట్ ఏ కారణం చేత వెనుకకు జరిగినప్పటికీ ఆర్ పీ.ఎస్.201 ఫిక్సేషన్ తదుపరి మీకంటే ముందే ఇంక్రిమెంట్ పొందుతున్నందున జి.వో.52 తేది 252,201 లోని రూల్ 7(i) ప్రకారం మీరు ప్రేపొంమేంట్ కు అర్హులు.
3.ప్రశ్న: నేను Untrained గా 19.1.2002 న జాయిన్ అయి శిక్షణ అనంతరం 1.5.06 నుండి నుండి వార్షిక ఇంక్రిమెంట్లు పొందుతున్నాను మరొకరు 2002 డి.ఎస్.సి లో స్పెషల్ వి.వి. గా ఎంపికై 26.10.05 న రెగ్యులర్ స్కేల్ పొంది 1.10.06 నుండి ఇంక్రిమెంట్లు పొందుతున్నారు 1.7.08 న ఆర్.పీ.ఎస్-10 సందు ఇరువురి వేతనం ఒకే స్టేజి (Rs. 10,900 వద్ద ఫిక్స్ అయింది. నాకంటే జునియర్ ఐన అతనికి 2008 అక్టోబర్ లోనే ఇంక్రిమెంట్ వస్తుండగా నేను 2009 మే వరకు ఆగవలసి వస్తుంది నా వేతనం అతనితో సమానం చేసుకొనే అవకాసం ఉన్నదా?
జవాబు: ఉన్నది, జి.వో.నెం.52, ఆర్ధిక, తేది 25.2.10, లోని రూల్ 7(ii) ప్రకారం మీ ఇంక్రిమెంట్ తేదిని మీ జూనియర్ తేదికి ప్రీపోన్ చేసి అక్టోబర్ లోనే వార్షిక ఇంక్రిమెంట్ విడుదల చేస్తారు మీ వేతనం వివరాలు, మీ జూనియర్ వివరాలతో కంపారిటివ్ స్టేట్ మెంట్ తయారు చేసి ఇంక్రిమెంట్ తేది ప్రీ పోస్మేంట్ కొకరు ఉడి.వో కు దరఖాస్తు చేసుకోండి
4.ప్రశ్న: నేను నవంబర్ 96 లోను, నా మిత్రుడు జూలై 97 లోను ఎస్.జి.టీ గా చేరాము. నేను 2002 నవంబర్‌లో ఎస్ఎ(ఏ.ఎస్) గాను, అతను 2006 మార్చ్ లో ఎస్.ఎ(ఇంగ్లీష్) గాను పదోన్నతి పొందాము.1.7.08 నాడు నా వేతనం రు.8170, అతని వేలనం రు. 1770. ఇద్దరి వేతనం ఆర్.పీ.ఎస్. 10 నందు రు.14860 గా స్థిరీకరించారు వార్షిక ఇంక్రిమెంట్ తేది జులై లోనే ఉన్నందున అతను నా కంటే 4 నెలలు ముందుగా ఇంక్రిమెంట్ పొందుతున్నారు. నాకు అతనితో ప్రీ పోస్మేంట్ కు అవకాశం ఉన్నదా? సబ్జెక్ట్ వేరనే కారణంతో మా ప్రధానోపాధ్యాయులు ప్రీపోస్మేంట్ చేయటానికి నిరాకరిస్తున్నారు సమంజసమేనా?
జవాబు: ప్రధానోపాధ్యాయుని అభ్యంతరం సమంజసం కాదు. ప్రీ పోస్మేంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ కు ఒకే సబ్జెక్టు నిబంధన వర్తించదుజీ.వో.52, తేది 25.2.10 లోని రూల్ . 7(ii) సందు ఒకే కేడర్ అనే పదాన్ని ఉపయోగించారు కాగా అదే జి.వీ. లోని రూల్ 6{1}{b} స్టెప్ అప్ నిబంధనలలో ఒకే కేటగిరి అనే పదాన్ని ఉపయోగించారు. ఈ రెండింటి మధ్య తేడాను గమనించాలి.
5.ప్రశ్న: నేను 1994 డి.ఎస్.సి. లో ఎస్.జి.టి. గా ఎంపికై 5.1.96 న duty లోచేరాను. నాకు నవంబర్ 2002 స ఎస్.ఎ.పీ.ఎస్.) ప్రమోషన్ వచ్చింది. కాగా అదే డి.ఎస్.సి. లో ఎంపికై 21.12.95 న చేరిన ఒక ఉపాద్యాయునికి 31.1.2009 న ఎస్.ఎ. పి.ఎస్.) ప్రమోషన్ వచ్చింది. ఆమె వేతనం నా వేతలసం కంటే ఎక్కువగా ఉన్నది. ఆమె వేతనం తో సమంగా , నా వేతనాన్ని స్టెప్ అప్ చేసుకోవచ్చా? ఆమె ఎస్.జి.టి. గా నాకంటే ముందే జాయిన్ అయ్యారు కనుక నాకు స్టెప్ అప్ వర్తించదు అంటున్నారు సమంజసమేనా ?
జవాబు: ఒకే డి.ఎస్.సి కి చెందిన ఒకే కేటగిరి ఉపాధ్యాయులు సీనియారిటీ వారి డిఎస్.సి. మెరిట్ కం రోస్టర్ ర్యాంక్ ను బట్టి నిర్ణయించబడుతుంది చేరిన తేదిని బట్టి కాదు, మీరు 15 రోజులు ఆలస్యంగా చేరినప్పటికి డిఎస్.సీ మెరిట్ కం రోస్టర్ ర్యాంక్ లో ముందుగా చేరిన ఉపాధ్యాయుని కంటే ముందుఉన్నట్లయితే మీరే సీనియర్ గా పరిగనించబడుతారు. అప్పుడు ఆమె వేతనంతో సమానంగా స్టెప్ లప్ తీసుకోవడానికి వీలుపడుతుంది
6.ప్రశ్న: నేను 14.2.79 స ఎస్.జి.టి.గా చేరి 1.11.2002 న ఎస్.ఎ. (సోషల్) గా ప్రమోషన్ పొందాను. నా జూనియర్ 16.2.79 నాడు ఎస్.జి.టి గా చేరి 16.2.2003 న 24 సం|| లకు ఒక ఇంక్రిమెంట్ తీసుకుని జూన్ 2003 న ఎస్.ఎ (సోషల్) గా ప్రమోషన్ పొందాడు. 1.7.08 నాటికి అతను నాకంటే ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ పొందుతున్నాడు అతనితో నాకు స్టెప్ అప్ అర్హత ఉన్నదా?
జవాబు: అర్హత ఉన్నది. జి.వో నం.2, ఆర్ధిక, తేది 25.2.10 లోని రూల్ 6B{1} ప్రకారం మీరు 1.7.08 నాడు మీ జూనియర్ వేతనం తో సమానం గా స్టెప్ అప్ తీసుకోవచ్చు .
7.ప్రశ్న: 18.1.2002 స సర్వీసులో చేరిన ఎస్జి.టి. 1.1.11 న రు.12910 వేతనం పొందుతూ ఉండగా, 19.10.02 న చేరిన ఎస్.జి.టి 19.10.2010 నుండే 12910! - వేతనం పొందుతున్నాడు. ఈ తేడాను ప్రీపోన్ మెంట్ ద్వారా సవరించావచ్చా?
జవాబు: సవరించవచ్చు. 2001,2002 డిఎస్సీ లలో నియామకమైన వారి మధ్య ప్రీ పోన్ మెంట్ కు అర్హత అవకాసం ఉన్నది. 1.7.08 న ఆర్.పీ.ఎస్.2010 స్కేళ్ళలో సీనియర్ జూనియర్ ఒకే స్టేజి లో ఫిక్స్ ఐన తదుపరి జూనియర్ తన ఇంక్రిమెంట్ తేది 1.10.08 నాడే పొందుచున్నాడు. అందువల్ల సీనియర్ ఇంక్రిమెంట్ తేదిని ప్రీ పోన్ చేసి 1.10.08 నాడే ఇంక్రిమెంట్ విడుదల చేయాలి
8.ప్రశ్న: నేను సెప్టెంబర్ 89 లో ఎస్.జి.టి.గా నియామకమై 2001 డిసెంబర్ లో ఎస్.ఎ ప్రమోషన్ పొందాను.01.07.08 న జూనియర్ స్టెప్ అప్ తీసుకున్నాను తదుపరి నా వార్షిక ఇంక్రిమెంట్ తేది సెప్టెంబర్ 2008 నాడు యధావిధిగా ఇంక్రిమెంట్ పొందాను. ఇది సరియైనదేనా.
జవాబు: సమంజసం కాదు. జి.వో 52, లోని రూల్ 7(iv) ప్రకారం మీరు సేప్పింగ్ లప్ పొందిన జూనియర్ ఆర్.పి.ఎస్ -10స్కళ్ళలో ఎప్పడు ఇంక్రిమెంట్ పొందుతాడో మీరు కూడా అదే తేదికి ఇంక్రిమెంట్ పొందాల్సి ఉంటుంది
9.ప్రశ్న: నా వార్షిక ఇంక్రిమెంట్ తేది ఏప్రిల్ నా జూనియర్ తేది నవంబర్. ఆర్.పీ.ఎస్ -10 ప్రకారం ఒకే స్టేజి లో ఫిక్స్ అయ్యాము ప్రీ పోన్ మెంట్ పెట్టుకోవచ్చా? నాకు ఏప్రిల్ 2011 కు 8 సం||ల సర్వీసు పూర్తి అవుతుంది. ప్రీ పోస్మంట్ తీసుకుంటే 8 సంవత్సరాల స్పెషల్ గ్రేడ్ స్కేల్ ఎప్పుడు మంజూరు చేస్తారు ?
జవాబు: జి.వో 52 ఆర్ధిక తేది 25.2.10 లోని రూల్ 7(ii) ప్రకారం మీరు మీ జూనియర్ తో సమానంగా ఇంక్రిమెంట్ తేదిని నవంబర్ 2008 కి ప్రీ పోన్ మెంట్ తీసుకోవచ్చు. ప్రీ పోన్ మెంట్ కారణంగా 8 సంవత్సరాల స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరులో మార్పు ఏమి ఉండదు మీకు 8 సంవత్సరాల సర్వీసు పూర్తి ఐన తేది ఏప్రిల్ 2011 నాడే స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేస్తారు (FB2011}
10.ప్రశ్న: నేను 95 ఉ.ఎస్.సి. లో ఎస్.జి.టీ.గా ఎంపికై 6.7.95 న విధులలో చేరి 1.11.2002 న ఎస్.ఎ. (పి.ఎస్.) ప్రమోషన్ పొందాను. మరొకరు 7.7.95 న ఎస్.జి.టి.గా చేరి 31.1.95 న ఎస్.ఎ పీ.ఎస్) గా ప్రమోషన్ పొందారు. మెరిట్- కం- రోళ్బర్ సెలక్షన్ జాబితాలో నా ర్యాంక్ 821, అతని ర్యాంక్ 585. ప్రస్తుతం సదరు ఉపాధ్యాయుని మూలవేతనం నాకంటే ఎక్కువగా ఉన్నది. నేను అతని స్టెప్ అప్ చేసుకోవచ్చా? స్టెప్ అప్ కోసం సీనియారిటి ని ఎ క్యాడర్ సందు చూడాలి ఏ ప్రాతిపదికన చూడాలి?
జవాబు: డి.ఎస్.సి. మెరిట్- కం- రోస్టర్ సెలక్షన్ జాబితాలో ర్యాంకుల ప్రకారం ఆ ఉపాధ్యాయుడే మీకంటే సీనియర్. కనుక అతనితో పోల్చి స్టెప్ అప్ తీసుకోవడానికి నిబందనలు అనుమతించవు. స్టెప్ అప్ కొరకు ఫీడర్ కేటగిరి మరియు ప్రమోషన్ కేటగిరి పోస్టు లలోని సీనియరిటీ మరియు వేతనములను పోల్చి చూస్తారు సీనియారిటి ని ఏ.పి. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ లోని రూల్33(b) ప్రకారం నిర్ణయిస్తారు
11.ప్రశ్న: నేను 2001 డి.ఎస్.సి లో ఎస్.జి.టి. గా ఎంపికై 18.1.2002 న సర్వీసు లో చేరాను. apprentice పీరియడ్ లో 122 రోజులు ఇ.వో. ఎల్. వినియోగించుకొని ఎమ్ఎస్సీ చేసాను. ఆ కారణంగా నేను 21.5.04 నుండి స్కేల్ పొందాను. ఆర్.పీ.ఎస్. 2010 నందు 2002 డి.ఎస్.సి. వారు నాకంటే ముందుగా ఇంక్రిమెంట్ పొందుతున్నారు. వారితో ప్రీ పోన్మెంట్ పెట్టు కోవచ్చా? (i) నా ఇవోఎల్ కారణంగా సీనియారిటి కి ఏమైనా సఫం ఉంటుందా?
జవాబు: 1.7.08 నాటికి ప్రీ రివైజ్డ్ (ఆర్.పి.ఎస్-05) స్కిల్స్ సందు మీ జూనియర్ మీకంటే తక్కువ వేతనం పొందుతూ , 1.7.08 నాడు ఆర్.పి.ఎస్ -10 నందు వేతనం సమానంగా స్థిరీకరించబడి జూనియర్ ముందుగా ఇంక్రిమెంట్ పొందుతూ ఉన్న యెడల జీవీ. 52, ఆర్ధిక తేది 25.2.10 లోని రూల్ 7(ii) ప్రకారం సీనియర్ ఇంక్రిమెంట్ తది జూనియర్ తేదికి మార్పు చేయాలి కనుక మీరు ప్రీపోన్ మెంట్ కు అర్హులే. (i) అధికారికంగా మంజూరు చేయబడిన ఇఎల్ కాలం వల్ల సీనియరిటీ కి నష్టం జరగదు. డి.ఎస్.సి. సెలక్షన్ సందర్భంలో మెరిట్- కం- రోస్టర్ ర్యాంక్ ప్రకారం నిర్ణయించబడిన సీనియరిటీ నే కొనసాగుతుంది
12.ప్రశ్న: 96 డి.ఎస్.సీ. కి చెందిన నేను నవంబర్ 2002 ఎస్.ఏ ఇంగ్లీష్ ప్రమోషన్ పొందాను నా ఇంక్రిమెంట్ తేది నవంబర్. అదే డి.ఎస్.సీ కి చెందిన వారు కొందరు 2006 మార్చ్ లో ప్రమోషన్ పొందారు. ఎస్.జి.టి లో నాకంటే సీనియర్ గా ఉన్న ఒకరి ఇంక్రిమెంట్ తేది జులై గ ఉన్నది ఎస్.జి.టీ లో నాకంటే జూనియర్ గా ఉన్న మరొకరి ఇంక్రిమెంట్ తేది ఆగష్టు గా ఉన్నది వీరిలో నేను ఎవరితో ప్రీపోన్ మెంట్ తీసుకోవచ్చు?
జవాబు: ప్రీ పోన్ మెంట్ తీసుకోవడానికి ప్రస్తుత క్యాడర్ కి సీనియారిటీ ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు జి.వో. 52 ఆర్ధిక 25.2.10 లోని రూల్ 7(ii) ప్రకారం ఆర్.పి.ఎస్ 2005 లో మీరు మీ జునియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతూ, 1.7.08 నాడు ఆర్.పీఎస్ 2010 ఫీ రీకరణలో ఒకే స్టేజి వద్ద స్థిరీకరించబడి మీ కంటే ముందుగా అంటే జూలై! ఆగష్టు లోనే ఇంక్రిమెంట్ పొందుతూ ఉన్న యెడల మీకు కుడా వారితో సమానంగా ఇంక్రిమెంట్ పొందే అర్హత ఉంటుంది జూలై ఇంక్రిమెంట్ తేది కలిగిన జూనియర్ తో ప్రీపోన్ చేసుకోవడమే మీకు లాభదాయకము.
13. ప్రశ్న: 2002 డి.ఎస్.సి లో అన్ టైన్గా ఎంపికైన ఉపాధ్యాయునికి ఇవో.ఎల్. కారణంగా ఇంక్రిమెంట్ తేది డిసెంబర్ నుండి జూలై కి మారింది ఆర్.పీ.ఎస్. 2010 వేతన స్థిరీకరణ అనంతరం 2002 బాచ్ అందరి కంటే ముందుగా అతను ఇంక్రిమెంట్ పొందుతున్నాడు. అతనితో మిగిలిన ఉపాధ్యాయులు ప్రీ పోన్ మెంట్ తీసుకోవచ్చా
జవాబు: తీసుకోవచ్చు. ఆర్.పీ.ఎస్ 2010 వేతన స్థిరీకరణ జరిగిన తేది1.7.08 కి ముందు అతను మిగిలిన వారికంటే తక్కువ వేతనం పొందుతూ, ఫీజెషన్ లో వేతనం సమానమై ముందుగా ఇంక్రిమెంట్ పొందుతూ ఉంటే జి.వో 52 ఆర్దిక 25.2.10 లోని రూల్ 7(ii) ప్రకారం సర్వీసులో అతనికంటి సీనియర్ గా ఉన్న వారందరూ అతనితో సమానం గా ఇంక్రిమెంట్ తేదిని ప్రీ పోన్ చేసుకునే అవకాశం ఉన్నది.
14. ప్రశ్న: స్టెప్ అప్ నిబంధనలలో సేమ్ కేటగిరి అంటే ఏమిటి స్కూల్ అసిస్టెంట్స్ అందరు ఒకే కేటగిరి గా పరిగణించబడతారా ?
జవాబు : సర్వీసు నిబంధనల ఉత్తర్వులు ప్రకారం స్కూల్ అసిస్టెంట్స్ అందరు ఒకే క్లాసు క్యాడర్ గా పరిగణించబడుతారు. స్కూల్ అసిస్టెంట్స్ లోని ప్రతి సబ్జెక్టు ఒక కేటగిరి గా పరిగణించబడుతుంది. స్టెప్ అప్ నిబంధనలలో "సమ్ కేటగిరి " అంటీ "ఒకే సబ్జెక్టుకు చెందిన అని అర్ధం చేసుకోవాలి. (i)సీనియర్ , జూనియర్ వేర్వేరు కేటగిరి సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్స్ చెందిన పోస్టులలో ఉంటినిబంధనల ప్రకారం స్టెప్ అప్ కు అవకాశం లేదు
15.ప్రశ్న: నేను 96 డి.ఎస్.సి. ద్వారా ఎస్.జి.టి. గా నియమింపబడి, 2009 జనవరి లో ఎస్.ఏ (ఇంగ్లీష్ ప్రమోషన్ పొందాను. అదే డి.ఎస్.సి లో ఎంపికైన నా మిత్రుడు 2010 జూన్ లో ఎస్.ఏ (ఇంగ్లీష్ ప్రమోషన్ పొందాడు. అతను SPP-IA స్కేల్ పొందడం వల్ల నాకంటే ఒక ఇంక్రిమెంట్ అదనంగా పొందుతున్నాడు. నేను అతనితో స్టెప్ అప్ చేసుకోవచ్చా?
.జవాబు: మీ మిత్రుడు ఎస్.జి.టి లో మీ కంటి జూనియర్ అయి ఉంటే జివో.93 ఆర్ధిక తేది 3.4.10 ప్రకారం స్టెప్పీంగ్ ఆఫ్ పే చేసుకోవచ్చు.
16 ప్రశ్న: నాకు PRC 2010 స్కేళ్ళలో తేది 1.7.08 కి జూనియర్ తో స్టెప్ అప్ జరిగింది నా ఇంక్రిమెంట్ తేది. 1.1.09 మరియు నా జూనియర్ ఇంక్రిమెంట్ తేది 1.4.09. మా M EO గారు నాకు తేది. 1.1.09 కి ఇంక్రిమెంట్ మంజూరు చేసారు. కానీ ట్రెజరీ వారు జూనియర్ ఇంక్రిమెంట్ తేది ఐన 1.4.09 కి మాత్రమె ఇంక్రిమెంట్ వస్తుంది అని అభ్యంతరం పెట్టినారు ఇది సరియైనదేనా?
జవాబు: ఆడిట్ వారి అభ్యంతరం సరియైనది కాదు స్టెప్ అప్ అనంతరం సీనియర్ ఇంక్రిమెంట్ తేది కొనసాగుతుంది. ఒకవేళ జూనియర్ ఇంక్రిమెంట్ తేది సీనియర్ తేది కంటే ముందుగా ఉంటే ఆ తేదీకి సీనియర్ కు ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. కనుక మీకు తేది. 1.1.2009 కి ఇంక్రిమెంట్ ఇవ్వటం సరియైనదే
17.ప్రశ్న: నేను, నా మిత్రుడు 96 డి.ఎస్.సి లో ఎస్.జి.టి. లు గా ఎంపికై 13.2.97, 12.2.87 న ఉద్యోగం లో చేరాము. నేను 1.2.09 న, అతను 28.6.2010 న ఎస్.ఏ. (బయో సైన్సు ) గా ప్రమోషన్ పొందాము. ఇరువురికి ఎఫ్ఆర్ (22) "బి" ప్రకారం ప్రమోషన్ పోస్టులో వేతన స్థిరీకరణ జరిగింది కానీ అతను 12 సంవత్సరాల స్కేలు తీసుకుని ప్రమోషన్ పొందడం వల్ల నాకంటే ఒక ఇంక్రిమెంట్ అదనంగా పొందుచున్నాడు. నాకు అతని తో స్టెప్ అప్ కు అవకాసం ఉన్నదా?
జవాబు: ఉన్నది. ఎస్.జి.టి. గా కుడా మీ మిత్రుని కంటే మీరు సీనియర్ అయిన యెడల జి.వో. 93 ఆర్ధిక తేది 3.4.10 లోని రూల్ 3(C)(V) ప్రకారం మీరు స్టెప్పీంగ్ ఆఫ్ పే పొందటానికి అర్హులు.
18. ప్రశ్న: నేను 311096 నుండి ఎస్.జి.టి. గా పనిచేస్తూ 322009 న ఎస్.ఏ (మార్చ్) ప్రమోషన్ పొందాను. జూనియర్ తో స్టెప్ అప్ తీసుకున్నాను అతని ఇంక్రిమెంట్ తేది నవంబర్ . నాకు ఇంక్రిమెంట్ అక్టోబర్ లో వస్తుందా? నవంబర్ లో వస్తుందా? (ii) ఒక సంవత్సరం దాటితే స్టెప్ అప్, లోపైతే ప్రీ పోస్మేంట్ అంటున్నారు.కరక్టేనా?
జవాబు: అక్టోబర్ లోనే వస్తుంది జి.వో. 93 ఆర్ధిక తేది 3.4.1 ప్రకారం 17.08 తరువాత జూనియర్ వేతనం తో సమానం గా సీనియర్ వేతనాన్ని స్టెప్ అప్ చేసిన సందర్భం లో సీనియర్ కు ఇంక్రిమెంట్ ఎప్పుడు ఇవ్వాలి అన్న విషయం ప్రస్తావించలేదు. కనుక సాధారణ ఇంక్రిమెంట్ తేది నే కొనసాగుతుందని భావించాలి.
ii) ఆ బావన సరియైనది కాదు. RPS 2010 ఫిక్సేషన్ కన్నా ముందు సీనియర్ వేతనం ఎక్కువగాను, జూనియర్ వేతనం, తక్కువ గాను ఉండి, RPS 2010 ఫిక్సేషన్ నాడు ఒకే స్టేజ్ వద్ద ఫిక్సేషన్ జరిగి జూనియర్ ముందుగా ఇంక్రిమెంట్ పొందుతూ ఉన్న యెడల సీనియర్ ఇంక్రిమెంట్ ను కుడా జూనియర్ తో సమానం గా అదే నెలలో విడుదల చేయడాన్ని ప్రీపోన్ మెంట్ అంటారు. ఒక క్యాడర్ నుండి మరొక క్యాడర్ కు ప్రమోషన్ పొందిన సందర్భం లో సీనియర్ ఎఫ్.ఆర్. 228 లేదా ఏ.ఏ.ఎస్. ప్రయోజనం పొందకుండా ప్రమోటై, జూనియర్ ఆ ప్రయోజనం పొందిన తరువాత ప్రమోటైనందున అదనంగా వేతనం పొందుతున్న యెడల సీనియర్ వేతనాన్ని జూనియర్ తో సమానం చేయడాన్ని స్టెప్ అప్ అంటారు.
19.ప్రశ్న: నేను, నా మిత్రునితో స్టెప్ అప్ తీసుకున్నాను తరువాత అతను మరొకరితో ప్రేపొంమేంట్ తీసుకుని 11 నెలలు ముందుగా ఇంక్రిమెంట్ పొందుతున్నాడు. నేను కుడా మరల నా మిత్రునితో ప్రీపోస్మేంట్ చేసుకోవచ్చా?
జవాబు: మీరు 17.08 నాడు జి.వో 52, ఆర్ధిక తేది 25.2.1 ప్రకారం స్టాప్ అప్ తీసుకున్న అనంతరం ఆర్.పీ.ఎస్ 2010 లో ఇరువురి వేతనం ఒకే స్టేజి లో ఫిక్సేషన్ జరిగిన యెడల , మీకు మీ మిత్రుని ఇంక్రిమెంట్ తేది కే ఇంక్రిమెంట్ లభిస్తుంది ఆ తరువాత ఆయన తనకంటే జూనియర్ (నిబంధనల ప్రకారం ) ప్రీ పోస్మేంట్ తీసుకుంటే మీకు కూడా అది వర్తిస్తుంది
20.ప్రశ్న: నేను 2001 డి.ఎస్.సి. ద్వారా జనవరి2002 నుండి ఎస్.జి.టి గా పని చేస్తున్నాను ఆర్.పీ.ఎస్. 2010 ఫిక్సేషన్ అనంతరం అక్టోబర్ 2002 లో నియామకమైన ఉపాధ్యాయునితో ఇంక్రిమెంట్ ప్రేపొంమెంట్ తీసుకున్నాను. 2001 లో నియామకమైన వారు కొందరు వారి ఇంక్రిమెంట్ జులై కి ప్రేపొంమేంట్ చేయించుకున్నారు. నేను మరల వారితో సమానం గా ప్రేపొంమేంట్ చేసుకోవచ్చా?
జవాబు: అవును. చేసుకోవచ్చు.
ఇంక్రిమెంట్లు
• ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు.
• ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిపిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.
* APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంట్లు చెల్లించారు. *(G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)*
• నెల మద్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.
*(G.O.Ms.No.133 Fin Dt:13-05-1974)* *(G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)*
• DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన | సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ధరించబడతాయి.
• ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరుచేయాలి. *(Memo.No.49463 Dt:06-10-1974)*
• ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది. *Eg: ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.*
• నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది. • వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.
ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము
-ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం. -అన్ని రకాల సెలవులు(జీత నష్టపు సెలవు తప్ప) -డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.
-అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.
-పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.
-డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము. -అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం. -పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది. -ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం. - ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)
ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం:-
-జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు.సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.
- జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భమూ
-వైద్య కారణాలపై,శాస్త్ర, సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది (ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు) *(FR-26(2)) & G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)*
- 6 నెలల కంటే ఎక్కువ జీనష్టపు సెలవు వాడుకున్న సంధర్బాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.
ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు:
తప్పుడు ప్రవర్తనా,విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.
Without Cumulative Effect:
FR-24(1) ప్రకారం కేవలం ఒక సం || మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు.అంటే సదరు ఉద్యోగి ఒక సం || పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.
With Cumulative Effect
- దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి.సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలి. ఉద్యోగికి చార్జిషీటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి.ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.
ఇంక్రిమెంట్లు-రకాలు:
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు.
-తక్కువ వేతన స్కేలు యందు ఎక్కువ కాలం పనిచేసే ఉద్యోగులుకు వారి వేతన స్కేల్ లలో గరిష్ఠం చేరుకునే అవకాశం ఉంది. అటువంటి వారు భవిష్యత్తు లో ఇంక్రిమెంట్లు లేక అదే వేతనంపై పదవీ విరమణ పొందేవరకు లేదా వేతన స్కేలు మారే వరకు పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి వారికి న్యాయం చేసేందుకు స్థాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేస్తారు. ఈ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను అన్ని రకాల సౌలభ్యాల కొరకు (ఫికేషన్ ప్రమోషన్లు, AA5)లకు పరిగణిస్తారు. 10వ ఏ.అర్.న లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయబడ్డాయి. *GO.Ms.No.152F&P Dt:04-1-2000)* *(G.O.Ms.No.25 F&P Dt:18-03-2015)*
ప్రిపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్
-ఉద్యోగుల వేతన స్థిరీకరణ సందర్భాలలో గాని,పదోన్నతి పొందిన స్థితిలో గాని,వేతన నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు,జూనియర్,సీనియర్ ఉద్యోగుల వేతనం ఒకే స్కేలు లో ఒకే దశ యందు వేతన స్థిరీకరణ కాబడి సీనియర్ ఉద్యోగి కంటే జూనియర్ ఉద్యోగి ఎక్కువ వేతనం పొందుతున్న సందర్భంలో సీనియర్ ఉద్యోగి ఇంక్రిమెంట్ తేదీని జూనియర్ ఇంక్రిమెంట్ తేదికి ప్రీపోన్ చేయబడి వేతన రక్షణ కలుగజేయుట నే ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అందురు.
ఇంక్రిమెంట్లు కొన్ని ముఖ్యాంశాలు
- ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్ ఏ నెలలో ఉన్నదో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక రిజిస్టరు (ఇంక్రిమెంటు వాచ్ రిజిష్టర్), నిర్వహించాలి.
- ఉద్యోగి తన వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయాలని విన్నవించుకోనవసరం లేదు.గడువు తేదీన డ్రాయింగ్ అధికారే సర్టిఫికెట్ పై స్వయంగా సంతకం చేయాలి. *(Memo.No.1696577/A&L/185 Dt:13-02-1987)*
- అర్జిత సెలవు లో (EL) కొనసాగుతూ మరణించినా,రిటైర్ అయినా సెలవు కాలంలో మొదటి 120 రోజులలో డ్యూ ఉన్న ఇంక్రిమెంట్ పెన్షన్, గ్రాట్యూటీలకు లెక్కించబడుతుంది.
- డైస్ నాన్ గా పరిగణించిన కాలము ఇంక్రిమెంట్లకు పరిగణించబడదు- *FR 18*
-ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి రోజున ఇంక్రిమెంట్ 'డ్యూ' ఉంటే దానిని నేషనల్ గా పరిగణించాలి.పెన్షనరీ ప్రయోజనాలకు లెక్కించాలి.కాని పదవీ విరమణ తరువాత చెల్లించే ఫైనల్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఎర్స్ డ్ లీవ్ కు ఈ నోషనల్ ఇంక్రిమెంట్ పరిగణలోకి తీసుకోరాదు. ) *(G.O.Ms.No.352 Fin Dt:27-10-1998)*
-ఏదైనా పరీక్షా లేదా టెస్టు వల్ల ప్రభుత్వ ఉద్యోగికి ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష తేది నుండి మంజూరైనట్లుగా భావించాలి.
General Questions
1) స్థానికతను ఎలా నిర్ణయిస్తారు..?
జి.ఓ.నెం:674,తేదీ: 20-10-1975,జి.ఓ నెం:168, తేదీ: 10- 03-1977 ప్రకారం ఒక వ్యక్తి 4వ
తరగతి నుండి 10 వరకు గల 7సంవత్సరాల కాలంలో ఏ జిల్లాలో ఎక్కువ చదివితే అది అతని స్థానిక జిల్లాగా గుర్తించాలి.
2 ) EOL పెట్టిన కారణంగా ఇంక్రిమెంట్ నెల మారితే తిరిగి పాత ఇంక్రిమెంట్ నెల ఎలా పొందవచ్చు..?
జి.ఓ.నెం:43, తేదీ: 05-02- 1976 ప్రకారం వైద్య కారణాలతో EOL లో ఉన్నప్పటికీ సంబందిత వైద్య ధ్రువపత్రాలతో డీఈఓ గారి ద్వారా CSE కి ప్రపోసల్స్ పంపి అనుమతి పొందితే పాత ఇంక్రిమెంట్ నెల కొనసాగుతుంది. 180 రోజులకు మించిన EOL అయితే విద్యాశాఖ కార్యదర్శి నుండి అనుమతి పొందాలి.
3) EL's ను ఉద్యోగి ఖాతాలో ఎలా జమ చేస్తారు..?
01-01-1978 ముందు వరకు డ్యూటీ పీరియడ్ అయిన తరువాతే EL's జమ చేసేవారు. జి.ఓ.నెం:384, తేదీ: 05-11-.1977 నుండి జనవరి 1న ఒకసారి, జులై 1న ఒకసారి అడ్వాన్స్ గా EL'S క్రెడిట్ చేస్తున్నారు. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 1న 15, జులై 1న మరో 15 EL'S సర్వీస్ ఖాతాలో జమ చేయగా, వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 1న 3, జులై 1న మరో 3 EL'S సర్వీస్ ఖాతాలో జమచేస్తారు
4) లీవ్ నాట్ డ్యూ అంటేఏమిటి..?
ఒక ఉద్యోగి లీవ్స్ ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL'S గానీ లేనపుడు ఉద్యోగికి కల్పించబడిన సౌకర్యమే లీవ్ నాట్ డ్యూ. ఒక ఉద్యోగికి అత్యవసరంగా లీవ్స్ అవసరం అయ్యి ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL'S గానీ లేనపుడు భవిష్యత్తులో ఉద్యోగికి వచ్చే హాఫ్ పే లీవ్స్ ను లెక్కించి 180 రోజుల వరకు వైద్య కారణాల నిమిత్తం లీవ్ నాట్ డ్యూ మంజూరు చేస్తారు. లీవ్ నాట్ డ్యూ గా మంజూరు చేసిన సెలవుల ను హాఫ్ పే లీవ్స్ ఉద్యోగి ఖాతాలో జమ కాగానే తగ్గిస్తారు.
5) ఆగష్టు-15,జనవరి-26న జెండా వందనానికి హాజరు కాకపోతే చర్యలు ఉంటాయా?
ఆగష్టు-15, జనవరి-26 తేదీలు జాతీయ సెలవు దినాలు కావున రిజిస్టర్ లో సంతకం అవసరం లేదు. అనారోగ్యం ఉంటే జెండా వందనానికి హాజరు కాకుండా ఉండవచ్చు. అయితే సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం తగిన కారణాలు లేకుండా జెండా వందనానికి హాజరు కాకపోతే పై అధికారులు చర్యలు తీసుకోవచ్చు.
6) CPS ge basic pay + DA లో 10%కు అదనంగా మినహాయించవచ్చా..?
ఉద్యోగి బేసిక్ పే + డి.ఏ లో 10% ను మాత్రమే సిపియస్ డిడక్షన్ చేయాలి. దీనికి సమానంగా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ జమ చేస్తుంది. వాలంటరీ గా కంట్రిబ్యూట్ చేసి టైర్-1 అకౌంట్లో అమౌంట్‌కు జత చేయవచ్చు. టాక్స్ మినహాయింపు పొందవచ్చు. వాలంటరీ కాంట్రిబ్యూషన్ కు మ్యాచింగ్ గ్రాంటు జతచేయబడదు
7) మెటర్నిటీ లీవ్స్ వేసవి సెలవులలో పెడితే కౌంట్ అవుతాయా..?
FR 101(a) ప్రకారం మెటర్నిటీ లీవ్ కు ముందు గానీ తరువాత గానీ వేసవి సెలవులు ఉంటే మొత్తం 180 రోజులను మెటర్నిటీ లీవ్ గానే భావించాలి.
8) రిటైర్మెంట్ తరువాత ఇంక్రిమెంట్ ఉంటే లెక్కిస్తారా..?
జి.ఓ.నెం:235,తేదీ:27-10- 1998 ప్రకారం రిటైర్మెంట్ అయ్యిన మరుసటి రోజు ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే ఆ ఇంక్రి మెంట్ ను నోషనల్ గా సాంక్షన్ చేసి దానిని ఇంక్రిమెంట్ బెనిఫిట్స్ లెక్కింపులో పరిగణలోనికి తీసుకోవాలి.
9) 5 సంవత్సరాల 8 నెలలు పూర్తి చేసిన. ఉద్యోగికి ఎన్ని అర్ధ వేతన సెలవులు వస్తాయి..?
డ్యూటీ పీరియడ్ ఒక సంవత్సరం పూర్తి అయిన తరువాతనే అర్ధవేతన సెలవులు ఉద్యోగి ఖాతాకు జమ చేయబడతాయి. సంవత్సరానికి 20 చొప్పున 5 సంవత్సరాలకు 100 అర్ధవేతన సెలవులు అర్ధవేతన సెలవుల ఖాతాకు జమ చేస్తారు
10) ప్రభుత్వ సెలవు దినాలకు ముందు తరువాత కమ్యూటేడ్ లీవ్స్ పెట్టవచ్చా?
జి.ఓ.నెం:319,తేదీ: 18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు గానీ తరువాత ఉన్న ప్రభుత్వ సెలవులను మినహాయించవచ్చు. కాబట్టి ప్రభుత్వ సెలవును కమ్యూ టెడ్ సెలవుగా పరిగణించకూడదు.అయితే ఎన్ని రోజులు కమ్యూటెడ్ - లీవ్స్ పెట్టుకుంటే అన్ని పనిదినాలకు మాత్రమే వైద్య ధ్రువ పత్రాలు సమర్పించాలి
Roster Points in Promotion and Appointments for every 100 postd
NOC OF PASSPORT&PERMISSION RELATED GOS & MEMOS
CFMS నెం.ద్వారా మీ అకౌంట్ లో పడ్డ టోటల్ అమౌంట్ తెలుసుకొనుటకు CLICK HERE
పై లింక్ లో లభించిన బిల్ నెం. ద్వారా మీ శాలరీ డిటైల్స్ తెలుసుకొనుటకు
తెలుగు సాహితీ వేత్తలు సుమారు (90 మంది )సంగ్రహ వివరాలు
తెలుగు సాహిత్యము- చాటుకవిత్వము
మీ ప్రదేశం అక్షాంశ ,రేఖాంశ విలువులు తెలుసుకొనుటకు
మీ ఇష్టం వచ్చిన ప్రశ్న అడగండి- జవాబు పొందండి. CLICK HERE
See On The Day Of Independence
Lifetime Calendar. AGE CALCULATION
Day of Date. Blood Group Diet.
converts -Dates in Words ////Rupees in to Words conversion
Search Today in History
Search Historical Events in History