Comprehensive Financial Management System (CFMS)

                                                                        MAIN WEBSITE LINK

                                     LOGIN HERE

CFMS లో  మీ Salary Details స్టేట్ మెంట్

1. ముందుగా మీరు మీ CFMS Account లోకి లాగిన్ అవండి .లాగిన్ కావడానికి మీ CFMS నూతన ID కావలిసిన ఉంటుంది మీ CFMS ID User ID గా PassWard కూడా మొదటిసారి మీ CFMS ID నే ఎంటర్ చేయవలసిఉంటుంది తరవాత మీ పాస్వర్డ్ మార్చుకోవాలి.

 2. లాగిన్ కాబడిన తరవాత MY TASKS అనే మెనూ ని క్లిక్ చేయండి ,

3. తరువాత Beneficiary Account Statement మీకు కనిపిస్తుంది దానిమీద క్లిక్ చేయండి.

4. తరువాత CFMS ID ను ఎంటర్ చేయండి చేసిన తరువాత మీకు ఎప్పటినుంది స్టేట్మెంట్ కావాలో From Date మరియు To Date ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తరువాత Dispaly ఆప్షన్ ఉన్నది దానిమీద క్లిక్ చేస్తే మీ Statement కనిపిస్తుంది అక్కడ Bill Details వస్తాయి. అందులో Bill iD నోట్ చేసుకోండి.

 5. ఇప్పుడు Cfms.ap.gov.in website లో CITIZEN SERVICES లో Expenditure Links లో Bill Status పై క్లిక్ చేయండి.

6. ఓపెన్ ఐన web పేజి లో Year 2018 అని, Bill ID మీరు నోట్ చేసుకొన్న నెంబర్ Enter చేసి ప్రక్కన క్లిక్ చేయండి. అప్పుడు మీ మండలం Salary Details వస్తాయి..

7. అందులో మీ CFMS ID పై క్లిక్ చేయండి

8. మీ స్టేట్ మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత మీరు కార్నెర్ లో ఉన్న profile pic పై క్లిక్ చేసి signout కాగలరు

 

  CFMS కొన్ని ప్రశ్నలు - సమాధానాలు*
1. ఆన్లైన్ విధానం ఎప్పటినుండి అమలు ?
. ఏప్రిల్ 01,2018 నుండి

2. ప్రతీనెల జీతపు బిల్లులు ఏ తేదీ లోగా STO వారికి సమర్పించాలి ?
. పాత విధానంలో అనుసరించిన తేదీలనే

3. ప్రింట్ తీసిన కాపీలు అవసరమా ?
. లేదు
4.వేటిని ప్రింట్ తీసి pdf ద్వారా సమర్పించాలి ?
. స్పెషల్ కేస్ బిల్ కి మాత్రమే (అనగా ఇంక్రిమెంట్ బడ్జెట్ ఖర్చులు,ఏవైనా సర్టిఫికెట్ లు)
వాటిని స్కాన్ చేయాలి.
5 . వేటిని ప్రింట్ తీయనక్కర్లేదు ?
. బిల్ షెడ్యూల్స్
6. ఒక ఆఫీస్ లో ఇద్దరు మాత్రమే సిబ్బంది ఉంటే ?
. ఒకరు మేకర్, DDO సబ్మిటర్

7.ఒక ఆఫీసులో ఒక్కరే సిబ్బంది ఉంటే ?
. ఆయన DDO అయితే మేకర్,చెక్కర్,సబ్మిటర్ అన్నీ ఆయనే

8.DDO అందుబాటులో లేకపోయినాఅసలు ఆ ఆఫీస్ కి DDO లేకపోయినా ?
.అదే మండలంలోని వేరే ఆఫీస్/స్కూల్ యొక్క DDO ఆదరైజేసెషన్ తీసుకోవాలి.ఎందుకంటే కేవలం DDO ల బయో మెట్రిక్ మాత్రమే బిల్లులకు  పనిజేస్తుంది.

9. CFMS లో స్టాఫ్ జాబితా తప్పుగా ఉంటే ?
CFMS సైట్ లోనికి లాగ్ ఇన్ అయ్యి QUERY లో కంప్లైంట్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం పొందవచ్చు.

10.ఎవరినైనా ADD/DELETE చేయాలంటే ?
. అది కూడా QUERY లో సబ్మిట్ చేయవచ్చు.

11.పాత విధానంలో ఉండీఇప్పుడు తీసేసిన కొన్ని విషయాలు ?
.TBR అక్కర్లేదు, APTC ఫారం 101 ,47 , బాంక్ ఫారం బెనెఫిషరీ అక్కర్లేదు.

12.ట్రెజరీ బ్యాంక్ లు అనే పదం ఉంటుందా ?
. ఉండదుఇప్పుడు ఏ బ్యాంక్ లో అయినా CHALLANS కట్టవచ్చు.

13. తప్పుగా బిల్ పంపితే ?
UNIQUE నెంబర్ GENERATE అయ్యాక మళ్లీ అది CANCEL చేయబడదు.తప్పుగా పంపితే మరల సబ్మిట్ చేయవచ్చుకానీ ఇక్కడ FIFO(ముందు వచ్చినవి ముందుగా బయటికి)విధానంలో బిల్లులు ఆర్డర్ లో ఉంటాయి
.
14.unique నెంబర్ అనగా ?
. ఇంతకు ముందు TBR లాంటిదే.కానీ ఈ సారి ఈ నెంబర్ రాష్ట్రంలో ఒక్కటే ఉంటుంది.
15.మేకర్చెక్కర్,submitter లు ముగ్గురూ అవసరమా ?
. అక్కర్లేదు.కానీ సబ్మిటర్ కచ్చితంగా ఉండాలి
.
16.ట్రెజరీ id లు ఉంటాయా ?
.ఉండవు.వీటి స్థానంలో CFMS ID లు వచ్చాయి.కానీ రెండూ అనుసంధానం చేయబడే ఉంటాయి
.
17.ఒక్కో voucher కి ఒక బిల్లు సబ్మిట్ చేయాలా అన్నీ voucher లను కలిపి చేయవచ్చా ?
. ప్రస్తుతానికి ఒక voucher కి ఒక బిల్ అనే విధానం ఉంది.అలా ఎన్ని ఉంటే అన్ని బిల్లులు సమర్పించాలి
.
18.నగదు ఎలా ఎవరిచే చెల్లించ బడుతుంది ?
. బిల్లుకు అన్నీ సక్రమంగా ఉంటే సెంట్రల్ సర్వర్ ద్వారా E-KUBER కి జతచేసి RBI ద్వారా చెల్లించబడతాయి.15నిమిషాల్లో బిల్ చేసిఅన్నీ PASS ON చేస్తే 16వ నిమిషంలో నగదు ఉద్యోగి యొక్క బ్యాంక్ ఖాతా కు జమ చేయబడతాయి.

19.ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో తప్పు ఉంటే ?
. అటువంటి పొరపాట్లు ఏమైనా జరిగితే DDO లకు మెసేజ్ లు వెంటనే వస్తాయి.

20.CFMS విధివిధానాలు కి HELPLINE నెంబర్ ఉందా ?
. ఉంది