సామూహిక బీమా పథకం ( Group Insurance Scheme)

1    .11.1984 నుండి అమలులోనికి వచ్చింది.

2    .ఉద్యోగులందరికీ పథకం తప్పనిసరి.

3.   రద్దు చేయబడిన కుటుంబ సంక్షేమ పథకానికి జమ  అయిన సొమ్ము ఉద్యోగ విరమణ  సమయంలో గాని,

        మరణించి నపుడుగాని చెల్లిస్తారు.

4    పథకంలో సభ్యుడు కాగానే నామినేషన్ ఫారాలు  పూర్తిచేసి అటెస్టు చేయించి సర్వీసు పుస్తకంలోఅతికించాలి.

5     నవంబరు నెల తర్వాత ఉద్యోగంలో చేరినవారు, తర్వాత వచ్చే నవంబరు నుండి స్కీములో సభ్యులుగా చేరుతారు

        అయితే స్కీములో సభ్యులుగా చేరే వరకు ప్రతినెల, ప్రతి యూనిట్ కు రూ. 5 వంతున చెల్లించాలి. భీమా కవరేజి కొరకు యిది చేర్చారు.

6    జి.వో.ఎం.ఎస్.నెం. 312 ఫైనాన్స్ ప్రకారం ప్రతి రూ. 10కు రూ. 3.125 భీమాకు రూ. 6.875 పొదుపు నిధికి

        జమ చేయబడును.

7.    మరణించినపుడు భీమా డబ్బు +పొదుపు నిల్వను వడ్డీతో సహా చెల్లిస్తారు.

8.   ప్రమోషన్ వల్లగాని యితర కారణాల వల్లగాని వేతన స్కేలు పెరిగితే అందుకు అనుగుణమైన గ్రూప్ కు

        సంబంధించిన చందా చెల్లించాలి. అయితే మారిన గ్రూప్కు సంబంధించిన చందా పథకం వచ్చే వార్షికము నుండి               చెల్లించాలిఅంతవరకు పాత చెల్లింపే కొనసాగాలి.

9.      పథకాన్ని అమలు పరచవలసిన బాధ్యత అధి కార్లదే. జీతం నుండి రికవరీ చేసే బాధ్యత డ్రాయింగ్ అధికార్లది.

10.   ఎక్స్ట్రా ఆర్డినరీ సెలవుపైన వెళితే ఉద్యోగి చెలించాల్సిన శెలవు కాలపు మొత్తమును తిరిగి జాయిన్

        అయిన తర్వాత వడ్డీతో సహా మూడు వాయిదాల్లో చెల్లించాలి. ఎక్స్ట్రా ఆర్డినరీ సెలవు కాలంలోమరణిస్తే

         అకాలపు చందా డబ్బు వడ్డీతో సహా మినహాయించుకొని మిగతా మొత్తం కుటుంబ సభ్యుల కిస్తారు.

11.   నిధి నుండి అడ్వాన్సులు అప్పులు యివ్వరు. అయితే గృహ నిర్మాణ పథకాలకు సభ్యులకు

            మేలు చేకూర్చు యితర పథకాలకు నిల్వలను ఉపయోగిస్తారు.

12.   పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు తప్ప మిగతా ఉపాధ్యాయులందరికీ రిటైర్ మెంట్ నాడే జి..ఎస్మొత్తం చెల్లించాలి.

13.   క్రింది విధంగా గ్రూపులు చేయబడ్డారు. ఒక యూనిట్ సొమ్ము రూ. 15.లు

 14      వడ్డీ రేటు :

          1-4-2011, తేది 20-11-2011 వరకు 8 శాతం. 1-12-2011నుండి 8.6% వడ్డీ రేట్లు పెంచబడినవి.

          (G.O. 2425, Fin., Dt. 10-05-2012)

15.   2012-13 ఆర్థిక సంవత్సరానికి జి. . ఎస్ లెక్కింపు వివరించబడినది. (G.O. 148, Fin., Dt. 0606-2012)