సెలవులు ఎన్ని రకాలు?:

ఉద్యోగం,వ్యక్తిగత జీవితం ఈ రెండూ ముఖ్యమే.ఉద్యోగంతో పాటు వ్యక్తిగత,కుటుంబ అవసరాలకు కూడా తగినంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది.అందుకోసమే ఉద్యోగులకు సెలవుల విధానాన్ని అమలు చేసేది.

                             జాతీయ సెలవు దినాలు:
జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2. ఇవి అందరికీ ఉండే సాధారణ సెలవు దినాలు.

                           వారాంతపు సెలవు:
వారంలో ఏడు రోజులకు గాను ఒకటి లేదా రెండు రోజులు సెలవుగా ఇస్తుంటారు.కంపెనీ పాలసీని బట్టి ఒకటా రెండా అన్నది ఆధారపడి ఉంటుంది.ఎక్కువ శాతం ఒక్కరోజే సెలవుగా ఉంటుంది.

                            పండుగ దినాలు:
వివిధ మతాలకు సంబంధించి ముఖ్యమైన పండుగ రోజుల్లోనూ సెలువులు ఉంటాయి.

ఎర్న్ డ్ లీవ్ లేదా ప్రివిలేజ్ లీవ్ EL: ప్రతీ ఉద్యోగికి ఏడాదిలో ఇన్ని రోజులంటూ ఈఎల్ ఉంటాయి.గడచిన ఏడాదిలో ఎన్ని పనిదినాల పాటు సదరు ఉద్యోగి పనిచేశాడన్న దానిపై ఆధారపడి ఈ సెలవులు ఉంటాయి.ఈఎల్స్ ను వాడుకోనట్టయితే దాని కింద అదనపు వేతనాన్ని పొందవచ్చు.తీసుకుంటే ఆ రోజుల్లోనూ వేతనాన్ని (మూలవేతనం ప్రకారం) యథావిధిగా పొందవచ్చు.అయితే,సెలవులే తీసుకోవాలా? లేక పనిచేసి వేతనాన్ని పొందాలా? అన్నది కంపెనీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

                                                క్యాజువల్ లీవ్:
నెలలో ఇన్ని రోజుల పాటు క్యాజువల్ లీవ్ అని ఇస్తుంటారు.గరిష్ఠంగా మూడు రోజుల వరకు ఉంటుంది.కొన్ని సంస్థల్లో నెలకు ఒక్కటే క్యాజువల్ లీవ్ కూడా అప్లయ్ అవుతుంది.ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, 1988 ప్రకారం ఏడాదిలో 12 రోజుల పాటు ఈ లీవ్ ఇవ్వాల్సి ఉంటుంది.

                                     సిక్ లీవ్ లేదా మెడికల్ లీవ్: 
కార్యాలయానికి రాలేని అనారోగ్యానికి గురైన పరిస్థితులలో వాడుకునేందుకు వీలుగా ఈ లీవ్.తక్కువలో తక్కువ నెలకు ఒక్క రోజైనా సిక్ లీవ్ ఉంటుంది.ఒక నెలలో వాడుకోకపోతే అవసరం ఏర్పడినప్పుడు ఒకటికి మించి వాడుకోవచ్చు.

ఎన్ని రోజులు సెలవులుగా ఇవ్వాలన్న విషయాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, 1988 ప్రకారం ఏడాదిలో 12 రోజుల వరకు సిక్ లీవ్ ఇవ్వాల్సి ఉంటుంది.కనీసం ఏడాదిలో ఏడు రోజులను జాతీయ సెలవు,పర్వ దినాల కింద ఇవ్వాలని చెబుతున్నాయి.వాటిలో గణతంత్ర దినం,స్వాతంత్ర్యదినం,గాంధీ జయంతి తప్పనిసరిగా ఇవ్వాల్సినవి.

                                           కాంపెన్సేటరీ ఆఫ్/ సీఆఫ్:
సెలవు రోజుల్లో కూడా వచ్చి పని చేసినట్టయితే అందుకు గాను వేతనం చెల్లిస్తారు.లేదా మరో రోజు సెలవు కింద ఇస్తారు.

                                            మెటర్నిటీలీవ్:
మహిళా ఉద్యోగులు సంతాన అవసరాల కోసం (గర్భ ధారణ నుంచి డెలివరీ వరకు లేదా మరికొంత కాలం) మేటర్నిటీ లీవ్ ను ఇస్తుంటారు.ఎంత కాలం అన్నది కంపెనీలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని ప్రైవేటు కంపెనీలలో వేతనం లేకుండా ఈ లీవ్ ను మంజూరు చేస్తుంటారు. గర్భస్రావం అయిన వారికి కూడా ఈ లీవ్ ఇస్తుంటారు.కాకపోతే తక్కువ రోజుల పాటు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, 1988 ప్రకారం డెలివరీకి ముందు ఆరు వారాలు డెలివరీ తర్వాత ఆరు వారాలు కనీసం మేటర్నిటీ లీవ్ ఇవ్వాలి.

                                                        పేటర్నిటీ లీవ్:
పైన చెప్పుకున్న తరహాలో ఉద్యోగుల భార్యలు డెలివరీ అయిన సందర్భాల్లో వారి అవసరాలు చూసుకునేందుకు వీలుగా కొన్ని రోజుల పాటు ఉద్యోగులకు ఈ సెలవు ఇస్తుంటారు.

                                                  క్వారంటైన్ లీవ్:
ఇన్ఫెక్షన్ ఆధారిత వ్యాధికి లోనై ఆ వ్యాధి కంపెనీలోని ఉద్యోగులకు కూడా వచ్చే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో సదరు ఉద్యోగిని ఈ సెలవుపై పంపిస్తారు.

                                                హాఫ్ పే లీవ్:
ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ లీవ్ అందుబాటులో ఉంది.ఏడాది కాలం సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత ఈ లీవ్ మంజూరు అవుతుంది.ఈ లీవ్ పై విధులకు రాకపోయినా ప్రతి రోజూ వేతనంలో సగం మేర చెల్లిస్తారు.

                                              స్టడీ లీవ్:

ఉద్యోగి ఉన్నత చదువులు, వృత్తి పరమైన నాలెడ్జ్ పెంచుకునేందుకు వీలుగా ఈ సెలవు ఇస్తుంటారు. ఈ సెలవు కాలంలో వేతనం ఉండదు. అంటే ఉద్యోగం విడిచి పెట్టకుండా కొంత కాలం పాటు సెలవు తీసుకుని చదువుకోవచ్చు. ఇవే కాకుండా వివిధ రంగాలు, కంపెనీలను బట్టి చైల్డ్ కేర్ లీవ్, హాస్పిటల్ లీవ్, స్పెషల్ డిజేబిలిటీ లీవ్, చైల్డ్ అడాప్షన్ లీవ్, కమ్యూటెడ్ లీవ్, లీవ్ వితవుట్ పే /లాస్ ఆఫ్ పే (వేతనం లేకుండా తీసుకునే సెలవు) ఇలా భిన్న రకాల సెలవులు కూడా ఉన్నాయి.

                       అర్ధవేతన సెలవులు  (Half Pay Leave)

           HALF PAY LEAVES

 ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.

 సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.
సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు.
*(G.O.Ms.No.165 Dt:17-08-1967)*

 

 ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు

.

 అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.

 అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.
1 వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)
2
 స్వంత వ్యవహారాలపై (Private Affairs)

 సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.

ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.

 

వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను *కమ్యూటెడ్ సెలవు* అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.
*{APLR 15(B) & 18(B}*

 

 కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచనైనది.
*(G.O.Ms.No.186 Dt:23-07-1975)*

 సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు *{Rule 15(B}*

 

 ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.

 వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.

 

 వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో 
వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.
*(Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)*
*(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)*

 

 అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడ వు.

 

 క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.
*(G.O.Ms.No.386 Dt:06-09-1996)*
*(G.O.Ms.No.449 Dt:19-10-1976)*

 

 వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు.
*(G.O.Ms.No.29 Dt:09-03-2011)*

 

 ఎట్టి పరిస్థితులలోనూ *కమ్యూటెడ్ సెలవును* HPL గా మార్చుకొనుటకు వీలులేదు.
*(G.O.Ms.No.143 Dt:01-06-1968)*

 

 ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.

 

 సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.
*(G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)

 

సెలవు మంజూరు అధికారం

G.O.Ms.No.58* విద్య తేది:22-04-2008 ద్వారా విద్యాశాఖలో వివిధ రకాల సెలవులు మంజూరు అధికారం,కాలపరిమితుల పై ఉత్తర్వులు ఇవ్వబడినవి,కాలక్రమేణ ఆ నియమాలను సవరిస్తూ *G.O.Ms.No.70* విద్య తేది:06-07-2009 ద్వారా ఏఏ అధికారి ఎన్ని రోజులు, ఏరకమైన సెలవులు మంజూరు చేయాలో తాజా మార్గదర్శకాలు జారీచేయబడినవి.

*ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు:*

ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు లేదా ప్రత్యేక ఆకస్మిక సెలవులు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంజూరు చేస్తారు.15 ఆకస్మిక సెలవులు,7 ప్రత్యేక ఆకస్మిక సెలవులు, ఒకేసారి ఆకస్మిక సెలవులు/ప్రత్యేక ఆకస్మిక సెలవులు 10 రోజులకు మించకుండా మంజూరు చేస్తారు.

*ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు:*

ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/ అర్ధవేతన/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు
4 నెలల వరకు మంజూరు చేస్తారు

*ప్రసూతి సెలవు(Maternity Leave):*

మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల మంజూరు విషయంలో 180 రోజుల వరకు సెలవు మంజూరు చేసే అధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,మండల విద్యాధికారులకు G.O.Ms.No.84 తేది:17-09-2012 ద్వారా కల్పించబడింది.

*మండల విద్యాధికారులు:*

తన పరిధిలోని ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు
ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,
అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు/అర్ధవేతన సెలవులు/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు నెలల వరకు మంజూరు చేస్తారు.

*ఉప విద్యాధికారి:*

తన పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలలప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథ మిక/ప్రాథమికోన్నత /ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు

అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత/ అర్ధవేతన/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు నెలల పైబడి ఆరు నెలల వరకు మంజూరుచేస్తారు.

*జిల్లా విద్యాధికారి:*

జిల్లాలోని ఉపవిద్యాధికారులకుమండల విద్యాధికారులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/అర్ధవేతనకమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 1సం॥ వరకు మంజూరు చేయవచ్చును. జిల్లాలోని అన్ని ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు 6నెలలనుండి సం॥ వరకు అన్ని రకాల సెలవులు మంజూరు చేస్తారు.

*డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్:*

మండలవిద్యాధికారులకు
/ఉన్నత/ ప్రాథమికోన్నత/ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను సం॥ నుండి సం॥ వరకు సెలవు మంజూరు చేస్తారు.

*కొన్ని ముఖ్యాంశాలు:*

సెలవు పై వెళ్ళిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా అదే పాఠశాలలో చేరవలసిన ఉంటుంది.

సెలవు నిర్ణీత గడువు ముగిసిన పిదప 15 రోజులలో వీధుల్లో చేరకపోతే జిల్లా విద్యాధాఖాధికారికి రిపోర్ట్ చేయాలి.

నిర్ణీత సమయానికి మా మించి అనుమతి లేకుండా సెలవు వినియోగించుకుంటే రీపోస్టింగ్ సందర్భంలో 4వ కేటగిరీకి బదిలీచేస్తారు.

అధికంగా వాడుకున్న సెలవును FR-18 ప్రకారం అనధికార గైర్హాజరుగా భావించి *డైస్ నాన్* గా ప్రకటిస్తారు.

 

Compensatory casual leave ( ప్రత్యామ్నాయ సెలవులు)

          15 రోజులకు మించని స్వల్పకాలిక విరామం (Short Term Vacation) లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేసిన కాలానికి ప్రత్యామ్నాయంగా మరొక పని దినాన్ని సెలవుగా వినియోగించుకోవడాన్ని సీసీఎల్ (Compensatory casual leave) అంటారు.

::వివరణ:::

         విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు కొందరు కొన్ని ప్రత్యేక కారణాల వలన రెండవ శనివారము, ఆదివారము , దసరా మరియు సంక్రాంతి సెలవు దినాల్లో పని చేయడం జరుగుతుంది.  అలా సెలవు రోజుల్లో పనిచేసి ఉంటే అందుకు ప్రతిఫలంగా కోల్పోయిన సెలవులకు బదులుగా సిసియల్ ( Compensatory casual leave )మంజూరు చేయవచ్చునని ప్రభుత్వ ఉత్తర్వులు G.o.నెం.50 తేది: 1-2 - 1968 ,  మరియు Memo నెం.13112 , తేది. 1-3-1958 ద్వారా CCL's ను వినియోగించుకొనే సౌకర్యం ఉద్యోగులకు / ఉపాధ్యాయులకు పోరాటం ద్వారా సాధించబడింది.  కావున ఉపాధ్యాయులు సెలవు దినాల్లో పని చేస్తే సిసిఎల్ వినియోగించుకోవాలని కోరుతున్నాము

I) క్యాలెండర్ సంవత్సరంలో పది రోజులకు మించకుండా సీసీఎల్ (Compensatory casual leave) సెలవులను సి.యల్ (Casual​ leave) మంజూరు చేయు అధికారే మంజూరు చేస్తారు
అనగా ప్రాథమిక ,ప్రాథమికోన్నత పాఠశాలలకు మండల విద్యాశాఖ అధికారి గారు ,ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాశాఖాధికారి Compensatory casual leave మంజూరు చేస్తారు.

 

2) మంజూరు కాబడిన సిసిఎల్ ను ఆరు నెలల లోపల వినియోగించుకోవాలి.

 

3)సి.సి.ఎల్ ఖాతాను సపరేట్ గా మంజూరు చేయు అధికారి (H M / MEO) నిర్వహించాలి. సి.యల్( Casual Leave) ఖాతాతో కలిపి నిర్వహించరాదు.

 

4) సాధారణ సెలవులు (Casual Leave )ఉన్నప్పటికీ C.C.L 's Memo నెం.934/63 - 2, తేది. 26 - 4 - 1963 ద్వారా వాడుకొనవచ్చును.

    సాధించబడిన ఉత్తర్వులను అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై మరియు సంఘాలపై ఉంది. 
అంతేకాక మండల విద్యాశాఖ అధికారులు ,ప్రధానోపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులు సెలవు దినాల్లో పనిచేశారు కాబట్టి వారికి సీసీఎల్ (Compensatory casual leave) ఇవ్వాల్సిన బాధ్యత కూడా వుంటుంది 

 

SHORT TERM HOLIDAYS   SUFFIX – PREFIX  పై వివరణ

15 రోజులు మించిన సెలవు కాలాన్ని *వెకేషన్* అంటారు. 

 15 రోజుల లోపు సెలవులను  మిడ్ టర్మ్ హాలిడేస్  అంటారు.

 10 రోజులకు పైబడి 15 రోజులకు మించని మిడ్ టర్మ్ సెలవుల సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున, తెరిచే రోజున తప్పక హాజరుకావాలి.

(Rc .No.10324/E4-2/69,Dt :7-11-1969) 

 మిడ్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల లోపు ఉన్న సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున లేదా తెరిచే రోజున* గైర్హాజరు అయిన సందర్భం లో సాధారణ సెలవు(CL) పెట్టుకొనవచ్చును.

 

పబ్లిక్ సెలవులు అనుసంధానం (SUFFIX)

      ఒక ఉద్యోగికి మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా 20-11-2015 నుండి 13-12-2015 వరకు సెలవు.ఆ వెంటనే వచ్చిన 14-12-2015,15-12-2015 పబ్లిక్ సెలవులు వినియోగించుకుటకు అనుమతించనైనది.ఆ ఉద్యోగి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ జతపరుస్తూ 16-12-2015 తేదీన డ్యూటీలో చేరాడు.

     అట్టి సందర్భoలో:

a) డాక్టర్ జారీచేసిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ 16-12-2015 తేదీన జారీచేసిన యెడల 14-12-2015 మరియు 15-12-2015 తేదిలలో వున్న పబ్లిక్ హాలిడేస్ సెలవుకు అనుసంధానం (suffix) చేయుటకు వీలులేదు.

b) ఒకవేళ డాక్టర్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ 13-12-2015 తేదీన జారీచేసిన యెడల పబ్లిక్ హాలిడేస్ అయిన 14-12-2015 మరియు 15-12-2015 రెండు రోజులు సెలవుకు అనుసంధానం(suffix) చేసుకొనవచ్చును.

c) ఒకవేళ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ 14-12-2015 తేదీన గానీ లేక 15-12-2015 తేదీన గాని జారీచేసిన యెడల ఆ రెండు రోజులు సెలవుగా పరిగణించాలి.

 

సెలవు మంజూరు అధికారం:

      G.O.Ms.No.58 విద్య తేది:22-04-2008  ద్వారా విద్యాశాఖలో వివిధ రకాల సెలవులుమంజూరు    అధికారంకాలపరిమితుల పై   ఉత్తర్వులు  ఇవ్వబడినవి,  కాలక్రమేణ   నియమాలను సవరిస్తూ G.O.Ms.No.70 విద్య తేది:06-07-2009 ద్వారా ఏఏ అధికారి ఎన్ని రోజులుఏరకమైన సెలవులు మంజూరు  చేయాలోతాజా మార్గదర్శకాలు జారీచేయబడినవి.

 

ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు:

                   ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు లేదాప్రత్యేక ఆకస్మిక సెలవులు  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంజూరు చేస్తారు.15 ఆకస్మిక సెలవులు,7 ప్రత్యేక ఆకస్మికసెలవులుఒకేసారి ఆకస్మిక సెలవులు/ప్రత్యేక ఆకస్మిక సెలవులు 10 రోజులకు  మించకుండా మంజూరు చేస్తారు.

ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు:

                   ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయులకు  పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఆకస్మిక/ప్రత్యేకఆకస్మికఆర్జితఅర్ధవేతనకమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు

నెలల వరకు మంజూరు చేస్తారు.

ప్రసూతి సెలవు(Maternity Leave):

                మహిళా ఉద్యోగుల ప్రసూతి   సెలవుల మంజూరు విషయంలో 180 రోజుల  వరకు  సెలవు మంజూరు చేసేఅధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,మండల విద్యాధికారులకు  G.O.Ms.No.84 తేది:17-09-2012ద్వారా కల్పించబడింది.

మండల విద్యాధికారులు:

               తన పరిధిలోని  ప్రాథమిక,  ప్రాథమికోన్నత  పాఠశాలల  ప్రధానోపాధ్యాయులకు  ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథమిక/ప్రాథమికోన్నత  పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,  అన్ని క్యాడర్ల   ఉపాధ్యాయులకు  ఆర్జిత సెలవులు/అర్ధవేతన సెలవులు/కమ్యూటెడ్   సెలవులు  మరియు   వేతనంలేని  సెలవులు  4  నెలల  వరకు  మంజూరు చేస్తారు.

ఉప విద్యాధికారి:

                                   తన పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలలప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మికసెలవులతో పాటు ప్రాథ మిక/ప్రాథమికోన్నత /ఉన్నత పాఠశాలల  ప్రధానోపాధ్యాయులకు   , అన్ని క్యాడర్లఉపాధ్యాయులకు ఆర్జితఅర్ధవేతన/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల పైబడి ఆరు నెలలవరకు మంజూరుచేస్తారు.

జిల్లా విద్యాధికారి:

జిల్లాలోని ఉపవిద్యాధికారులకుమండల విద్యాధికారులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మికఆర్జిత/అర్ధవేతనకమ్యూటెడ్సెలవులు మరియు వేతనంలేని సెలవులు 1సం వరకు మంజూరు చేయవచ్చునుజిల్లాలోని అన్ని ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు 6నెలలనుండి 1 సం వరకు అన్ని రకాలసెలవులు మంజూరు  చేస్తారు.

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్

మండలవిద్యాధికారులకు, /ఉన్నతప్రాథమికోన్నత/ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియుఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను 1 సం నుండి 4 సం వరకు సెలవు మంజూరు చేస్తారు.

కొన్ని ముఖ్యాంశాలు:

సెలవు పై వెళ్ళిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా అదే పాఠశాలలో చేరవలసిన ఉంటుంది.

సెలవు నిర్ణీత గడువు ముగిసిన పిదప 15 రోజులలో వీధుల్లో చేరకపోతే జిల్లా విద్యాధాఖాధికారికి రిపోర్ట్ చేయాలి.

నిర్ణీత సమయానికి మా మించి అనుమతి లేకుండా సెలవు వినియోగించుకుంటే రీపోస్టింగ్ సందర్భంలో 4 కేటగిరీకిబదిలీచేస్తారు.

అధికంగా వాడుకున్న సెలవును  FR-18 ప్రకారం  అనధికార గైర్హాజరుగా భావించి డైస్ నాన్ గా ప్రకటిస్తారు.

 

వేసవిలో సంపాదిత సెలవులు పొందడం

పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను "సంపాదిత సెలవులు" అందురు.

 15 రొజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b) ప్రకారం ఇటువంటి సెలవులు మంజూరు చేస్తారు.

వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు ఎన్నికలు,జనాభా గణన, జనాభా ఓట్ల జాబిత తయారీ,పరీక్షలు మొదలగు విధులు నిర్వర్తించినపుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.35 Dt:16-1-1981)
(G.O.Ms.No.151 Dt:14-11-2000)
(G.O.Ms.No.174 Dt:19-12-2000)

 
వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా పద్దతిలో మాత్రమే సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.114 Dt:28-4-2005)


 సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు,ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి సర్వీసు పుస్తకములో నమోదుచేస్తారు.
(Rc.No.362 Dt:16-11-2013)

 
వేసవి సెలవులు 49
రోజులు ప్రకటించిన సందర్భంలో సంపాదిత సెలవులు మంజూరుచేయు విధానం:


 సూత్రం: 
డ్యూటీ కాలము x 1/11-(365x1)/11-(27xవాడుకున్న వేసవి సెలవులు /మొత్తం వేసవి సెలవులు)-6

పనిచేసిన రోజులు-సంపాదిత సెలవులు 

>1-1
>2-1
>3-2
>4-2
>5-3
>6-3
>7-4
>8-5
>9-5
>10-6
>11-6
>12-7
>13-7
>14-8
>15-8
>16-9
>17-10
>18-10
>19-11
>20-11
>21-12
>22-12
>23-13
>24-13
>25-14
>26-15
>27-15
>28-16
>29-16
>30-17
>31-17
>32-18
>33-18
>34-19
>35-19
>36-20
>37-21
>38-21
>39-22
>40-22
>41-23
>42-23
>43,44,45,46,47,48,49-24 రోజులు

 

child care leave

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి ఉద్యొగినులకు 60 రోజుల Child Care Leave ను ఇస్తూG.O.Ms.No.132 Dt 06.07.2016 ను విడుదల చేయడం జరిగింది.
    ఇకమీదట మహిళా ఉద్యొగినులు తమ పిల్లలకు( గరిష్టముగా ఇద్దరు మాత్రమే) 18 ఏళ్ళు వచ్చే వరకు వారికి ఓంట్లొ బాగా లెనప్పుడు, పరీక్షలకు హాజరు అగునప్పుడు, ఫంక్షన్లకు, అవసరం అయినపుడు గరిష్టముగ 60 రొజుల వరకు సెలవు వాడుకొనవచ్చును.
ఈ సెలవును వంతుల వారీగా కూడ అవసరమయినప్పుడు వాడు కోవచ్చును.
పిల్లలు పుట్టిన తేది ఆధారముగ ఈ సెలవు మంజురు‌చెస్త్తారు.