ఈ పేజీలో మీకు ఈ క్రిందివాని సమాచారం సమగ్రంగా దొరుకుతుంది

 30 సం౹౹ల స్కేల్(SPP II B) అమలుపై వివరణ

దశాబ్దాల నాటి 10 సర్టిఫికెట్ అయినా స్థానికంగా పొందే వెసులుబాటు

 సాధారణ ఆకస్మిక సెలవు

కారుణ్యనియామకాలు (Compassionate Appointments
సర్వీస్ రెగ్యులరైజేషన్   
సర్వీస్ బుక్  రిజిష్టర్ నందు ఉండవలసిన నమోదులు ( ఎంట్రీలు ):
EWF :- 
FUNDAMENTAL RULES ….
సెలవు మంజూరు అధికారం:
EL - EARNED LEAVES
 CHAILD CARE LEAVE
Leave Not Due   -    సంపాదించని సెలవు
స్టెప్‌అప్‌,  ప్రీ పోస్మేంట్ ఆఫ్‌ ఇంక్రిమెంటు 
ఇంక్రిమెంట్లు
 కమ్యూటేషన్ (COMMUTATION): 
పబ్లిక్ సెలవులు అనుసంధానం (SUFFIX)
SHORT TERM HOLIDAYS   SUFFIX – PREFIX  పై వివరణ

సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్:-

ఉద్యోగులు వారికి లభించే వివిధ రకాల ప్రయోజనాలు
సెలవులు ఎన్ని రకాలు?:
అర్ధవేతన సెలవులు  (Half Pay Leave)
డిపార్ట్ మెంటల్ టెస్ట్ - ఆన్ లైన్ పరీక్షా విధానము
 ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం
 ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషనల్ రూల్స్-1966
 ఏకీకృత సర్వీసు నిబంధనలు
 సెలవు మంజూరు అధికారం
Compensatory casual leave ( ప్రత్యామ్నాయ సెలవులు)
VOLUNTARY RETIREMENT
    

 

     30 సం౹౹ల స్కేల్(SPP II B) అమలుపై వివరణ

పదోన్నతి లేక ఒకే క్యాడర్ లో కొనసాగుతున్న ఉద్యోగులకు 2022 పీఆర్సీలో కొత్తగా 30 సం౹౹ల స్కేల్ మంజూరు చేస్తు GO Ms No. 1 Finance (PC-TA) dept dt. 17.01.2022 ఉత్తర్వులు ఇచ్చారు. అయితేఈ 30 సం౹౹ల స్కేల్ అమలుపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా డిటిఏ గారు Lr No. FIN02-18069/ 65/2022-H SEC-DTA dt.02.09.2022 లేఖ ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. అందులో 2011 లో కొత్తగా మంజూరు చేసిన 18 సం౹౹ల స్కేల్ అమలుపై ఇచ్చిన Cir. 020091ని అనుసరించాలని సూచించారు.

2010 పీఆర్సీకి మునుపు 8/16/24 సం౹౹ల స్కేల్స్ అమలులో ఉండగా GO 96 తేదీ 20.05.2011 మేరకు 8/16/24కు బదులుగా 6/12/24 స్కేల్స్ గా మారుస్తు కొత్తగా 18 స్కేల్ మంజూరు చేయడం జరిగింది. 18 స్కేల్ అమలుపై ఆనాడు 11 అంశాలపై వివరణలు ఇస్తు Cir.Memo No.020091/ 125/PC.II/2011 Finance dept dt.17.08.2011 ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వివరణలు 30సం౹౹ల స్కేల్ అమలుకు అన్వయించుకోవాలి. అందులోని వివరణల మేరకు

1)  01.07.2018నాటి కన్నా ముందు ఒకే క్యాడర్ లో 30సం౹౹ల సర్వీస్ పూర్తి చేసుకుని 01.07.2018 నాటికి అదే క్యాడర్ లో కొనసాగుతున్న ఆ ఉద్యోగికి 1.7.2018 నుండి  మాత్రమే 30సం౹౹ల స్కేల్ మంజూరు చేయవచ్చు.

2)   01.07.2018 తేదీ నాటి కన్నా ముందు 30స౹౹ల సర్వీసు పూర్తయి 01.07.2018 నాటికి క్యాడర్ మారిన వారికి ఈస్కేల్ వర్తించదు.

3)   01.07.2018 తర్వాత 30 సం౹౹ల సర్వీసు పూర్తయి తర్వాత పదోన్నతి పొందిన వారికి కూడా 30 సం౹౹ల స్కేల్ వర్తిస్తుంది.

4)    24/30 సం౹౹ల స్కేల్స్(SPP II) పొందిన తర్వాత పదోన్నతి పొందిన వారికి FR22(B) వర్తించదు. అనగా FR 22(a)(1) మేరకు ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే మంజూరు చేస్తారు.

5)   24/30 సం౹౹ల స్కేల్ పొందిన తర్వాత పదోన్నతి పొందిన క్యాడర్ లో AAS వర్తించదు.

6)   30 సం౹౹ల స్కేల్ వేతన స్థిరీకరణ 01.01.2022 నుండి మాత్రమే నగదుగా చెల్లిస్తారు.

 

దశాబ్దాల నాటి  10th సర్టిఫికెట్ అయినా స్థానికంగా పొందే వెసులుబాటు

దశాబ్దాల నాటి సర్టిఫికెట్ అయినా స్థానికంగా పొందే వెసులుబాటు

మీ సేవతో ఎస్ఎస్సి బోర్డు ఒప్పందం 

       నాలుగున్నర దశాబ్దాల క్రితం నాటి 10వ తరగతి సర్టి ఫికెట్ ఇప్పుడు మీకు అవసరం అయిందా? సర్టిఫికెట్ లేకపోవడం, ఒక వేళ ఉన్నా చిరిగిపోవడం, నలిగిపోయిందన్న బాధ ఉందా? ఈ సమస్యలకు పరి ష్కారంగా ఎస్ఎస్ సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 1969 నుంచి 2013వ సంవత్సరం వరకు 10 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు పాస్ లేదా ఫెయిల్ సర్టిఫికెట్లను తాజాగా పొందేందుకు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెసులు బాటు కల్పించింది. సమీపంలోని మీ సేవ కేంద్రంలో నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోగా సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఇతర రాష్ట్రాలకు విద్య, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళే అభ్యర్థులకు తప్పనిసరిగా అవసరమైన మైగ్రేషన్, వయసు ధృవీకరణ పత్రాలను మాత్రం టెన్ ఉత్తీర్ణత సాధించిన వారికే జారీ చేస్తారు. అభ్యర్థి 10వ తరగతి పరీక్ష రోల్ నెంబరు, పాసైన సంవత్సరం ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానం ప్రకారం ఈ సర్టిఫికెట్లను పొందాలంటే హైదరాబాద్ వెళ్ళి ఎఎస్సి బోర్డులో దరఖాస్తు చేసుకుని నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. దీని వల్ల అభ్యర్థులకు ఖర్చు, కాలయాపన జరిగేది. తాజూగా మీ- సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ సర్వీసు ద్వారా సర్టిఫికెట్ల జారీకి ఎస్ఎస్ సీ బోర్డు ఒప్పందం చేసుకోవడంతో కీలకమైన ఈ సమస్యకు స్థానికంగానే పరిష్కారం లభించినట్లయింది. ధృవపత్రాలను ఎస్ఎస్ సీ బోర్డు అదనపు సంయుక్త కార్యదర్శి

,సంతకంతో జారీ చేస్తారు.

 

         Information for Female teachers leave management

1.EARNED LEAVE

(ఇవి సంవత్సర సర్వీస్ కి 6 వస్తాయి.సర్వీస్ ని బట్టి లెక్కించవలెను. ఏమైనా earned లీవ్స్ క్యాష్ చేసుకున్నట్లైతే availed దగ్గర చూపించాలి..ex-15/30/60...)

2.Extraordinary Leave-1461days

(ఇవి జీత నష్టపు సెలవులు ....app లో 1461 maximum తీసుకుంటుంది.ఏమైనా వాడుకొనినచో ఆ నెంబర్ availed దగ్గర ఎంటర్ చేయండి)

3.HALF PAY LEAVE*(commutation)

(ఇవి సంవత్సర సర్వీస్ కి 20 వస్తాయి.no. of days column లో మీ సర్వీస్ బట్టి నమోదు చేసుకొనవలెను.)

హాఫ్ పే లీవ్ పెట్టుకొని ఫుల్ శాలరీ draw చేసినట్లయితే ఈ commutation దగ్గర availed column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు double చేసి నమోదు చెయ్యాలి.

4.HALF PAY LEAVE*(private affairs)

(ఇక్కడ కూడా  no. of. days column దగ్గర అదే నెంబర్ ఎంటర్ చేయాలి)

హాఫ్ పే లీవ్ పెట్టుకొని సగం శాలరీ draw చేసినట్లయితే ఈ private affairs దగ్గర availed column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు నమోదు చెయ్యాలి.

5.SPECIAL CASUAL LEAVES-7days

 

6.Special casual leave on spl occasions (national/state events)

ఏమైనా తీసుకుంటే నెంబర్ వెయ్యండి లేకపోతే సున్నా పెట్టండి

7.Special casual leave on spl occasions-21 days

(Representing Recognised unions)

8.Special casual leave on spl occasions

(Participating in scouts/guides camps)

ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే సున్నా పెట్టండి.

9.Special casual leave on spl occasions-14days   (Tubectomy)

10.Special casual leave on spl occasions-21days

(Recanalization of tubectomy operation)

11.CASUAL LEAVE-15 days

12.STUDY LEAVE-1825 days

13.Maternity leave-360days

14.Child care leave-180 days

15.Abortion leave-42 days

16.Special disability leave-730 days

17.Casual leave(Additional for women)-5days

 

   సాధారణ ఆకస్మిక సెలవు

Iteam 1 of Annexure VII under FR-85 Rulling

 సాధారణంగా ఉద్యోగుల అత్యవసర పరిస్థితులలో సెలవులో వెళ్ళుటకు సాధారణ ఆకస్మిక సెలవు(Casual Leave) సెలవు ఉపయోగించుకుంటారు 

        FR-67 ప్రకారం సెలవు అనేది హక్కు కాదు

క్యాలెండర్ సం॥లో ఈ సెలవులు 15 రోజుల గరిష్ట పరిమితికి మించరాదు
G.O.Ms.No.52 తేది: 04-02-1981)
అయితే మహిళా ఉపాధ్యాయులకు మరో 5 రోజులు అదనంగా ఇస్తారు 
   G.O.Ms.No.374 తేది:16-03-1996
ఆదివారాలు,యితర ప్రభుత్వ సెలవు దినాలు,ఇచ్చిక సెలవు దినాలు కలిపి మొత్తం విధులకు వరుసగా గైర్హాజరు 10 రోజులకు మించరాదు
G.O.Ms.No.2465 Fin తేది:23-12-1959  , G.O.Ms.No.2094 Fin తేది:22-04-1960
సగం రోజుకు కూడా ఈ సెలవు మంజూరు చేయవచ్చు.అయితే ఒంటిపూట బడుల విషయంలో సాధ్యపడదు
 G.O.Ms.No.112 తేది:03-06-1966
ప్రతి కార్యాలయంలో ఉద్యోగుల ఆకస్మిక సెలవులు ఒక రిజిస్టరులో నమోదుచేయాలి

 

GIS

దీనిని 1.11.84 లో ప్రవేశ పెట్టారు.

బేసిక్ పే పెరిగినప్పుడు నవంబర్ నెల నుండి మాత్రమే స్లాబ్ మార్చాలి.

SR లో నమోదు చేఇంచుకోవాలి.

ఉద్యోగి చెల్లించే ప్రతి 10రూ, యూనిట్ నుండి 3.125రూ, ఇన్సూరెన్స్ ఖాతాకు, 6.875రూ సేవింగ్స్ ఖాతాకు జమ చేస్తారు.అదేవిధంగా ప్రతి 15రూ యూనిట్ నుండి4.50రూ ఇన్సూరెన్స్ ఖాతాకు, 10.50రూ సేవింగ్స్ ఖాతాకు జమ చేస్తారు.

ఉద్యోగి రిటైర్ అయినా, మరణించిన అతడు చెల్లించిన ప్రతి యూనిట్ కు సేవింగ్స్ ఖాతా నుండి 3 పట్టికలో చూపిన విధంగా చెల్లించబడును.

ఈ పట్టిక లు ప్రతి ఇయర్ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది.31.10.94 నాటికి పూర్తి ఐన ఇయర్స్ ను బట్టి ఆ నాటికి ఖాతా లో గల నిల్వ మొత్తం table1 నుండి గుర్తించాలి.

సభ్యత్వ0 ముగుయు నాటికి నిల్వ మొత్తం ఫై గల వడ్డీ table2 గా గుర్తించాలి.

1.11.94 నుండి సభ్యత్వ0 ముగియు నాటికి లభించు వడ్డీ తో కూడిన సేవింగ్స్ మొత్తం ను table3 గా గుర్తించాలి.ఈ మూడింటిని కలప గా వచ్చు మొత్తం 1 యూనిట్ కు చెల్లించబడే అంతిమ మొత్తం అవుతుంది.

దీనిని యూనిట్ల సంఖ్య చే గుణించిన ఉద్యోగికి చెల్లించే మొత్తం వస్తుంది.ప్రతి ఇయర్ PF ఫై చెల్లించే వడ్డీ ని దీనికి వర్తింపజేస్ఠారు.

 

 

కారుణ్యనియామకాలు (Compassionate Appointments)

GO.1005, E.S.W., Dept., 27-12-1974

                 

             సర్యులర్ మెమోనెం. 60681/సర్వీస్ / 2003-1 జి..డితేది 12/8/2003 ద్వారా అప్పటి వరకు జారీ చేయబడిన   కారుణ్య నియామకాల ఉత్తర్వులను కన్సాలిడేట్ చేసి ప్రచురించడం జరిగింది.

         కారుణ్య నియామకాల స్కీమ్ క్రింద నియామకానికి  క్రింది వారు అర్హులు.

       1కుటుంబంలో ఎవరూ సంపాదితులు లేని సందర్భములో కుటుంబ యజమాని మరణించిన యెడల  కుటుం బంలో ఒకరికిజూనియర్ అసిస్టెంట్ కేడర్ కు మించని ఉద్యోగము లభించును.

       2) ఒక ప్రభుత్వ ఉద్యోగి 7 సంవత్స రాలు కన్పించని సందర్భాలలో  కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లభించును.

        మెడికల్ ఇన్ వాలిడేషన్ పై రిటైరయినవారి కుటుంబ సభ్యులకు కూడా కారుణ్య నియామకాలు కొన్ని షరతులకు లోబడివర్తిస్తాయి. (G.O.Ms. No.661 GAD Dt. 23-10-2008.)

        మెడికల్ బోర్డు ఆమోదించేనాటికి ఉద్యోగికి 5 సం|| సర్వీసు మిగిలివుండాలి. (G.O.Ms. No.182 GAD Dt. 22-52014.)

         సందర్భముగా ఎఫ్..ఆర్నమోదు కాబడవలెనుపోలీసు శాఖ  ఉద్యోగి ట్రేస్ కాబడ లేదని ధృవీకరించ వలెను.

      3) నియామకపు అధికారి  కేసు వాస్తవమైనదిగా భావించాలితప్పిపోయిన ఉద్యోగికి పదవీ విరమణకు 7సం|| సర్వీసు 

కంటేతక్కువగా యున్న  అవకాశము యుండదు తప్పిపోయిన ఉద్యోగి శిక్షార్హమైన నేరము చేసినట్లుగాని

లేదా టెర్రరిస్టు లేదాతీవ్రవాద సంస్థలలో చేరినట్లు అనుమానం యున్న ఎడల  కుటుంబంలో యున్నవారికి ఉద్యోగము రాదు.

i) కుటుంబ సభ్యులు అనగా -

              1) భార్య లేదా భర్తకుమారుడుకుమార్తె,

              2) ఉద్యోగిగా యున్న కుమారుడు కుటుంబం నుండి విడిపోయి వేరేకుటుంబం పెట్టుకొన్న  యెడల మిగతా కుటుంబసభ్యులలో ఒకరికి ఉద్యోగము పొందే అవకాశము కలదు.

ii) దత్తత కుమారుడు లేదా కుమార్తెలకు ఉద్యోగమునకు అర్హత కలదు దత్తత చట్టబద్దముగా యుండాలి.      అంతేకాకుండా మరణానికి   సం|| ముందు దత్తత తీసుకొనియుండాలి

 iii) కారుణ్య నియామకముల క్రింద జూనియర్  అసిస్టెంట్ పోలీసు కానిస్టేబుల్ఎక్సైజు కానిస్టేబుల్అటవీశాఖలో హెల్పరు లేదా ఫైర్ 

 సర్వీసులో ఫైర్ మెన్ పోస్టులో ఒకటి యివ్వబడనుఉద్యోగి మరణించేసరికి 16 సం|| వయస్సులో పిల్లలుంటే 18 సం|| తరువాత 

వారుఉద్యోగ ములలో చేరవచ్చును.

iv) ఉద్యోగములో నియమించేఅధికారి సదరు ఉద్యోగాలు యివ్వడానికి అర్హత గల ఉద్యోగి. (The appointing authority is the competent authority to make appointment)

వయోపరిమితి:

          గరిష్ట వయస్సు 40 సం||లు ఎస్.సి., ఎస్.టి., బి.సి.లకు 5 సం||సడలింపు కలదు.

          కారుణ్య నియామకమునకు భార్య లేదా భర్త గరిష్ట వయో పరిమితి 45 సం|| సర్యులర్ మెమో.నెం. 3731 సర్వీస్/2002/3 జీఏడీతేది. 11/12/ 2003.

    i)    కనీస విద్యార్హతలు లేని యెడల 3 సంవత్సరములలోగా  విద్యార్హతలు పొంద వలసి యుండునుఅత్యవసర పరిస్థితుల్లో కాలాన్ని 2 సం|| వరకు పొడిగించ వచ్చునుఅప్పటికీ  వ్యక్తి విద్యార్హతలు సంపాదించ లేకపోతే  క్రింది పోస్టుకు రివరు చేయబడును.

        (G.O.M.S.No. 112,జీఏడీ,Dt.18-8-2017).  ఉత్తర్వుద్వారా ఇంటర్మీడియేట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు పోస్టులకు కారుణ్య నియామకం చేయవచ్చునని సడలింపునిచ్చింది.

కారుణ్య నియామకాలు

కారుణ్య నియామకాలు రెండు రకాలు. ఒకటి : మరణించిన ఉద్యోగి కుటుంబీకులకు ఇచ్చేది. రెండు : వైద్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి ఆధారితులకు ఇచ్చేది.

జీవోలు:

మరణించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడినవారికి జీవో 687, జీఏడీ, 03.10.1977 ద్వారా కారుణ్య నియామకం ఇస్తారు. కాలక్రమంలో ఈ జీవోకు సంబంధించి పలు సవరణలు, వివరణలు ఇచ్చారు. వీటన్నింటినీ చేర్చి 60681/సర్వీస్‌-ఏ/2003-1, జీఏడీ, 12.08.2003 ద్వారా సమగ్ర ఉత్తర్వులు ఇచ్చారు. వైద్య కారణాల వల్ల రిటైర్‌ అయిన ఉద్యోగుల వారసుల కారుణ్య నియామక అవకాశాన్ని జీవో ఎంఎస్‌ నెం.661, జీఏడీ, తేదీ 23.10.2008 ద్వారా పునరుద్ధరించారు. సర్వీసులో ఉండి మరణించిన ఎయిడెడ్‌ టీచర్ల వారసులకు కారుణ్య నియామకాలను జీవో ఎంఎస్‌ నెంబర్‌ 113, విద్యాశాఖ, తేదీ : 6.10.2009 ద్వారా అనుమతించారు.

 

కారుణ్య నియామకాలకు అర్హులెవరు?

మరణించిన ఉద్యోగి వారసులు, వైద్య కారణాల వల్ల రిటైర్‌మెంట్‌ తీసుకున్న ఉద్యోగి వారసులు, ఏడేళ్లపాటు కనిపించకుండాపోయిన ఉద్యోగి వారసులు ఈ నియామకాలకు అర్హులు. వైద్య కారణాల వల్ల కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండగా రిటైర్‌మెంటు తీసుకుంటే ఆ ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తారు. కనిపించకుండాపోయిన ఉద్యోగి విషయంలో పోలీసు రిపోర్టు ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.

 

ఎవరికిస్తారు?

ఎలాంటి కారణ్య నియామకమైనా ఎవరికిస్తారన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. దానికి విధివిధానాలు ఉన్నాయి. 1.ఉద్యోగి భార్య/భర్త, 2.కుమారుడు/కుమార్తె, 3.ఉద్యోగి మరణించిన నాటికి కనీసం ఐదేళ్ల మునుపు చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు/కుమార్తె, 4.ఉద్యోగి భార్య/భర్త నియామకానికి ఇష్టపడని సందర్భంలో ఆ కుటుంబంపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె, 5. మరణించిన ఉద్యోగికి ఒక వివాహిత కుమార్తె, మైనర్‌ కుమార్తె ఉంటే వారి తల్లి సూచించినవారికి ఉద్యోగం ఇస్తారు, 6.ఉద్యోగి అవివాహితుడై మరణించినపుడు అతని తమ్ముడు, చెల్లెలు కారుణ్య నియామకానికి అర్హులు.

ఏ పోస్టులో నియమిస్తారు?

జూనియర్‌ అసిస్టెంటు పోస్టులోగానీ, ఆ పోస్టు స్కేలుకు మించని పోస్టులోగానీ, అంతకన్నా తక్కువస్థాయి పోస్టులోగానీ నియమిస్తారు.

నియామక విధానం ఎలా?

ఉద్యోగి మరణించిన ఏడాదిలోపు అతని కుటుంబ సభ్యులు నియామకం కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. మైనర్‌ పిల్లల విషయంలో ఉద్యోగి మరణించిన రెండు సంవత్సరాలలోపు 18 సంవత్సరాలు వయసు నిండినపుడు మాత్రమే వారి దరఖాస్తు పరిగణించబడుతుంది. వైద్య కారణాల వల్ల రిటైర్మెంట్‌ కోరుకునేవారి దరఖాస్తు జిల్లా/రాష్ట్ర వైద్యుల కమిటీకి పంపి వారి నివేదిక ఆధారంగా జిల్లా/రాష్ట్ర కమిటీ సిఫార్సు మేరకు నియామకాధికారి అనుమతి ఇస్తారు.

అర్హతలు :

ఆయా పోస్టులకు సంబంధించిన నిర్ణీత అర్హతలు కలిగివుండాలి. అయితే జూనియర్‌ అసిస్టెంట్‌గా సబార్డినేట్‌ ఆఫీసులో నియామక అర్హతైన ఇంటర్మీడియెట్‌ పాసయ్యేందుకు 3 సంవత్సరాల గడువు, శాఖాధిపతి కార్యాలయం లేక సచివాలయం అయితే నియామక అర్హతైన డిగ్రీ పాసయ్యేందుకు 5 సంవత్సరాల గడువు ఇస్తారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కులాల వారికి ఐదేళ్ల మినహాయింపు ఉంది. ఉద్యోగి భార్య/భర్తకు నియామకం ఇవ్వాల్సి వస్తే వారికి వయోపరిమితి 45 ఏళ్లు. చివరి శ్రేణి పోస్టుకు వయసు, అర్హతలు తగిన విధంగా లేనపుడు ముందు నియామకం ఇచ్చి ఆ తరువాత మినహాయింపును సంబంధిత శాఖ నుంచి పొందవచ్చును.

నియామక పరిధి :

మరణించిన ప్రభుత్వ ఉద్యోగి పనిచేసిన యూనిట్‌లో నియామకం ఇస్తారు. ఆ యూనిట్‌లో ఖాళీలు లేనపుడు ఆ కేసులను నోడల్‌ అధికారి అయిన జిల్లా కలెక్టర్‌కు పంపిస్తే ఆయన ఇతర డిపార్టుమెంట్లకు కేటాయిస్తారు. ఏ డిపార్టుమెంట్‌లోనూ ఖాళీలు లేని సందర్భంలో కలెక్టరు ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో 5 వరకు సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించొచ్చు. అంతకు మించి పోస్టులు అవసరమైనపుడు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపాలి. ఈ కారుణ్య నియామకాలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాలో సిక్స్‌ పాయింట్‌ ఫార్మలాకు లోబడి ఇవ్వబడతాయి. రిజర్వేషన్‌ నిబంధన (రూల్‌ 22)ను పాటించాల్సివుంటుంది. మరణించిన ఉద్యోగి భార్య కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకుంటే ఆమె సొంత జిల్లాలోగానీ, భర్త

ఇటీవలి ఉత్తర్వులు :

కారుణ్య నియామకాలకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ఓ మెమో జారీ చేసింది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై ఉండి, అందులో ఒకరు రిటైర్‌ అయి పెన్షన్‌ తీసుకుంటుండగా, మరొకరు మరణిస్తే వారిపై ఆధారితులకు కారుణ్య నియామకం వర్తించదు. ఆ ఇంట్లో పెన్షన్‌ పొందుతున్న వ్యక్తి ఉన్నందున దాన్ని ఆదాయం ఉన్న కుటుంబంగానే పరిగణించి కారుణ్య నియామకం ఇవ్వరు. దీనికి సంబంధించి సర్క్యులర్‌ మెమో నెం.3548/సర్వస్‌-జి/ఏ2/2010-8, జీఏడీ, తేదీ : 24.03.2012 జారీ చేసింది.

ఎక్స్‌గ్రేషియా :

కారుణ్య నియామకం ఇవ్వడానికి సాధ్యపడని సందర్భంలో నాల్గో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు రూ.40వేలు, నాన్‌ గెజిటెట్‌ వారికి రూ.60 వేలు, గెజిటెడ్‌ ఉద్యోగుల కుటుంబాలకు రూ.80 వేలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలి. ఇదీ కారుణ్య నియామకాల నిబంధనలు, విధానానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం.*

 

 

1 కారుణ్య నియామకాల పునరుద్ధరణ ఉత్తర్వులు.

G.O.Ms.No.687 తేది:31-10-1977

 

2 కుటుంబంలో ఉద్యోగం ఎవరికి ఇవ్వాలి వివరణ ఉత్తర్వులు.

Govt.Memo.No.140733 తేది:14-11-2003

 

3. ఉగ్రవాదుల ఘాతుకాలు,అసాంఘిక శక్తుల దుశ్చర్యల వల్ల చనిపోయిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కారుణ్య నియామక ఉత్తర్వులు.

G.O.Ms.No.443 తేది:28-10-2002

 

4. ఉద్యోగంలో ఉంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కారుణ్య నియామక ఉత్తర్వులు.

Gov.Cir.Memo.No.41758 తేది:19-07-2007

 

 5 సం॥ మించి ఆచూకి తెలియకుండా అదృశ్యమైన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులు.

Govt.Cir.Memo.No.60681 తేది:12-08-2003

 

6.  కారుణ్య నియామకాలకు కనిష్ట,గరిష్ట వయస్సు ఉత్తర్వులు.

G.O.Ms.No.759 తేది:06-10-2007

 

7. భార్య/భర్త కారుణ్య నియామక సంధర్భంలో గరిష్ట వయస్సు ఉత్తర్వులు.

G.O.Ms.No.144 తేది:15-06-2004

 

8 దత్తత తీసుకున్న పిల్లలకు కారుణ్య నియామక ఉత్తర్వులు.

G.O.Ms.No.612 తేది:30-10-1991

 

9.అవివాహిత ఉద్యోగి చనిపోతే తమ్ముడు,చెల్లెలుకి కారుణ్య నియామక ఉత్తర్వులు.

Para 2(i) of G.O.Ms.No.612 తేది:30-10-1991

 

సర్వీస్ రెగ్యులరైజేషన్     

 " Regularisation of service of a temporary employee is nothing but an appointment of that employee in accordance with rules (i.e) regular appointment of that employees by the competant authority"        

                     Govt. Memo. 1596/9270-5 Edn. Dt.12-2-1971.1

1.D.S.C ని లేక APPSCచే ఎంపికై నియమింపబడిన   ఉపాధ్యాయులు మొదటి మూడేళ్ళలో రెండేళ్ళు అవిచ్చిన్నమైనసంతృప్తికరమైన సర్వీసు పూర్తిచేసినపుడు వారి సేవలు క్రమబద్దీకరించబడును.

 2.    పోస్టుకు సంబంధించిన పూర్తి అర్హతలుపొందివుండాలి.

 3. అటెస్టేషను ఫారాలు పంపుకొని పోలీసు డిపార్టుమెంటు   నుండి యాంటీసిడెంట్ రిపోర్టులు పొందాలి.

4. క్రమబద్దీకరణకు మొదట నియామకపు తేదిని (Date of first appointment) పరిగణనలోకి తీసుకోవాలి.         (Proceeding of the D.S.E. in.L.M.S.No. 3353-C2-175 Dt. 3-9-75)

5. డి.యస్.సిలచే నియమించబడని సర్వీస్లో ఉన్నటిపా ధ్యాయులు క్రమబద్ధీకరణ డి.ఎస్సిలు సూచించిన క్రమంలో జరగాలిఆయావిభాగాల్లో (కేటగిరిస్క్రిందటి డి.యస్.సి నియామకాలలో చివరి అభ్యర్ధి క్రమబద్ధీకరణ తరువాత తేదినుండిగాని(Whichever is later) నియామకపు తేది నుండి గాని ఏతేదీ చివరి తేదీ అయితే   తేదీనుండి క్రమబద్ధం చేయాలి.

6. జి.వోఎంయస్నెం. 238 విద్య తేది 28-1-94. ప్రకారం 2సం||లు అప్రెంటీస్ పీరియడ్ ప్రొబెషన్ కు

పరిగణింపబడుతుంది.

7. జిల్లాలో కేటగిరి 2 మరియు 3 ఉపాధ్యాయుల సర్వీసు రెగ్యులరైజేషన్ప్రొబేషన్ డిక్లరేషన్ జిల్లావిద్యాశాఖాధికారీ చేయాలిఆర్.సినెం. 2844/ సి2-1/99 C&DSE తేది 3-8-2000.

8. స్థానిక సంస్థల ఉద్యోగులకు AP Public Service Commission లేదా DSC ద్వారా ప్రభుత్వ సర్వీసుకు ఎంపిక కాబడినవారికి వేతన రక్షణ (Pay Protection) యివ్వబడినది. GO.M.S. 105 fin dt. 2/6/11

9.  సర్క్యులర్ మెమొ.నెం.132/BC-BIA1/A1, 2012-1, తేదీ 15-11-2012 ద్వారా రెగ్యులరైజేషన్ కొరకు దరఖాస్తు చేసుకొనే ఎటెస్టేషన్ ఫారం కొత్త నమూనా  ఇవ్వడం జరిగింది.

10. ప్రమోషన్ పొందినపుడు ప్రతి కేడరులోను సర్వీస్ క్రచుబద్ధీకరణ జరగాలిదీనికి అటెస్టేషన్ ఫారాలు పంపుకోని యాంటీసిడెంట్రిపోర్టుల పొందనవసరం లేదుఒక సంవత్సరం అవిచ్చిన్న సర్వీసు పూర్తయిన  అనంతరం ఆకేడరులో సర్వీసుక్రమబద్దీకరణచేస్తారు..

 

ప్రొబేషన్

1. ప్రొబేషన్ అంటే ఏమిటిప్రొబేషనర్ ఎవరు ?

       ఏదైనా ఒక ఉద్యోగానికి తాత్కాలికంగా నియమింపబడిన ఉద్యోగికి తన ప్రవర్తసద్వారా  ఉద్యోగానికి అరునిగా గుర్తింపుపొందేందుకు నిర్ణయింపబడిన సేవా కాలాన్ని ప్రొబేషన్ అంటారు నిర్ణీత కాలంలో ఉద్యోగంలో తాత్కాలి కంగా పనిచేస్తున్న ఉద్యోగినేప్రొబేషనర్ అంటారు.

2.  అప్రూఫ్ట్ ప్రొబేషనర్ అంటే ఎవరు ?

       ఏదైనా ఒక ఉద్యోగంలో సంతృప్తికరంగా ప్రొబేషన్ కాలం గడిపిపూర్తి కాలపు ఉద్యోగిగా నియమింప బడడానికి వేచియుండేఉద్యోగిని అప్రూఫ్ట్ ప్రొబేషన్ అంటారుమొదటి నియామకపు ఉద్యోగానికి మొదటి మూడేండ్లలో రెండేండ్ల కాలం ప్రొబేషన్ కాలంగాపరిగణింపబడుతుంది.

        (Rule-16 C-1 of A.P. State and Subordinate Service Rules 1996)

       ప్రమోషన్ ద్వారా నియామకం పొందిన ఉద్యోగి రెండేళ్ళ సర్వీసు కాలంలో ఒక ఏడాది ప్రొబేషన్గా నిర్ణయించబడింది.  (Rule-Il C of Rule 16 of A.P. State and Subordinate Service Rules 1996)

     స్కూల్ అసిస్టెంట్స్ H.M.'s Gr.II గా ప్రమోషన్ కావడానికి ముందే టెస్టులలో ఉత్తీర్ణత పొందాలిలేదా  టెస్టుల నుండిమినహాయింపు పొందాలి.

      నియమిత కాలంలో ప్రొబేషన్ యొక్క సేవలను అనుమ తించకపోతే (అప్రూఫ్ట్ ప్రొబేషనర్గా ఆమో దించక పోతేడైరెక్టు రిక్రూటీనిఒకనెల ముందు నోటీసు జారీచేసి కానిఒకనెలజీతం చెల్లించిగానీ ఉద్యోగం నుండి తొలగిస్తారు. .

            (Rule-Il of 17 of A.P. State and Subordinate Service Rules 1996).

టెర్మినేట్ చేయబడ్డ ఉద్యోగి 30 దినములలోగా అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంటుంది.

          (Rule-E of 17 of A.P. State and Subordinate Service Rules 1996)

      ప్రొబేషన్ సందర్భంలో అతని సేవలు సంతృప్తికరంగా లేనియెడల క్రిందిపోస్టుకు తగ్గిస్తారు. (Reverse చేస్తారు)

     ఒక పోస్టులో ప్రొబేషన్ కాలం ముగిసిన తరువాత సంవత్సంలోగా నియామకపు అధికారులు  ఎట్టి ఉత్తర్వులు పంపకపోతే పదవిలో ప్రొబేషన్ కాలంసంతృప్తికరంగా ముగించబడినట్లు భావించబడుతుంది. (Memo. No. 2786/62-2 GAD, Dt. 7-9-1962) Rule 18 (B) (2) || మేరకు ఉద్యోగి ప్రొబేషన్ పాత తేదీనుండి డిక్లేర్ చేయబడినట్లు భావింపబడుచున్నది.

         be deemed to have completed satisfactorly his probation with retrospective effect from the date of expire of the prescribed or extend period of probation and formal order to that effect may be issued for the purpose of record.

 

సర్వీస్ బుక్  రిజిష్టర్ నందు ఉండవలసిన నమోదులు ( ఎంట్రీలు ):

1. అపాయింట్మెంట్ ఆర్డర్ వివరాలు

 2. జాయింనింగ్ తేది వివరాలు

 3. శాశ్వత స్వస్థలం.

 4. చదువు ( పూర్తి అర్హతలు హాల్ టికెట్ నంబర్ తో  సహా ).

 5. పుట్టుమచ్చలు.

 6. సర్వీస్ పుస్తకం 8 కాల-మ్ లో ఉద్యోగి  సంతకం,తేది.

 7. చేతి వెలి ముద్రలు

 8. ఉద్యోగి ఫోటో మరియు ఫోటో పై DDO సంతకం

 9. ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్.

10. సరెండర్ లీవ్  ప్రొసీడింగ్స్.

11. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీంవివరాలు

12. CPS / PRAN నంబర్.

13. సంపాదిత సెలవుహాఫ్ డే లీవ్ , జీత నష్ట  సెలవుల వెరిఫికేషన్.

14. LTC other then హోం టౌన్ , హోం టౌన్ ఎంట్రీ.

15. LTC డిక్లరేషన్.

16. లీవ్ ఎకౌంటు.

17. హాఫ్ పే లీవ్ ఎకౌంటు.

18. పే ఫిక్షేషన్ ఎంట్రీలు.

19. నామినీ సహా కుటుంబ సభ్యుల వివరాలు.

20. స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ 6 - 12 -18 - 24         

మంజూరు ఉతర్వులు ఎంట్రీలు.

21. స్పెషల్ పే ఎంట్రీలు.

22. బదిలీ సమయంలో రిలీవ్ ఎంట్రీ.

23. సర్వీస్ వెరిఫికేషన్ ఎంట్రీ.

24. ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంటు నెంబర్.

25. APGLI /TSGLI నెంబర్.

26. కుల ధృవీకరణ నమోదు.

27. ఎంప్లాయ్ ID నెంబర్.

28. ట్రెజరీ ID నెంబర్.(G.O.Ms.No.80 తేది: 19-3-2008)

29. 610 జి  ప్రకారం లోకల్ స్టేటస్ నమోదు.

30. సర్వీస్ క్రమబద్ధీకరించబడిన మరియు   ప్రోహిబిషన్ ఎంట్రీ.

31. పుట్టిన తేదీ ( అక్షరాలలో రాయాలి )

32. బోనాఫైద్ సర్టిఫికెట్ లు అంటించాలి.

33. హెల్త్ కార్డ్ నెంబర్.

34. ఎత్తు.

35. పితృత్వామాతృత్వ సెలవులు ( ఇద్దరు పిల్లలు వరకు )

36. తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్,

37. ప్రమోషన్ వివరాలు,

38 . మొదటి సారి ఉద్యోగం లోకి చేరిన అప్పుడు ఉద్యోగం రకం.

39. ఆధార్ కార్డు నంబర్.

40. జీతం ను పొందే బ్యాంక్ అకౌంట్ నెంబరుబ్యాంక్ పేరు

41. డిపార్ట్మంట్ టెస్ట్ లు

సర్వీస్ బుక్  రిజిష్టర్ నిర్వహణ – నియమాలుసూచనలుపద్దతులు:

1)  అనివార్య కారణాల వల్ల ఏవైనా తప్పులు జరిగినట్లు అయితే వాటిని దిద్ద కూడదు,వైట్ నర్ వాడకూడదురౌండ్ అప్ చేసి పైన రాసి DDO గారు సంతకం చేయాలి.

2)  కొన్ని కారణాల వల్ల  ఏదైనా నమోదు ను మార్చ వలసివస్తే  రౌండ్ అప్ చేసి పైన రాసిమార్చిన చోట

DDO సంతకం చేయడం తప్పనిసరి.

3)  సర్వీస్ రిజిష్టర్ లో ఎక్కడైనా చిరిగి పోతే అక్షరాలు కన పడే విధంగా సెల్లో టేప్ తో అతికించాలిఅట్టలాంటివి అక్షరాలు లేని చోట చిరిగితే గం తో ఎప్పటికప్పుడు అతికిస్తు ఉండాలి.

4)  ప్రతి సంవత్సరపు సర్వీస్ వెరిఫికేషన్ చేసి వివరాలు నమోదు చేయాలి. 01- 04 ( ఏప్రిల్ ) నుండి 31- 03 ( మార్చ్ ) వరకు సర్వీస్ వెరిఫికేషన్ నమోదు చేయాలి.

5) నెల మొదటి తేదిన జాయిన్ అయినవారు  ముందు నెల ఆఖరు తేదిన రిటైర్ అయిన ఇంక్రిమెంట్కలపాలి.

6) డూప్లికేట్ సర్వీస్ పుస్తకం అధికారికంగా ఉంచుకోవచ్చు.  ఇందులో ప్రతి నమోదు యందు 

DDO తోసంతకం చేయాలిఒరిజినల్ పోయినప్పుడు దీని ఆధారంగా కొత్త ది రాయబడునులేదా ఒరిజినల్ రిజిష్టర్నీ Xerox తీసుకుని ఉంచుకోవచ్చు కానీ DDO గారి అటేస్తేషన్ తప్పని సరి సర్వీస్ బుక్ పై డూప్లికేట్అని తప్పకుండా రాయాలి.

 7)  రిజిష్టర్ లో స్కెచ్ పెన్ గాని జెల్ పెన్ గాని మరియు ఇంక్ పెన్ గాని వాడకూడదుకేవలం బాల్పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలినల్ల రంగు బాల్ పాయింట్ పెన్ వాడడం ఉత్తమం. DDO లుసహితం జెల్ పెన్ తో సంతకాలు చేయకూడదుఖచ్చితంగా ఆకు పచ్చ బాల్ పాయింట్ పెన్ తో నేసంతకాలు చేయాలి.

8)  కారణం చేత దీర్ఘకాలం సెలవులు పెట్టి డ్యూటీ లో జాయిన్ అయిన తరవాత లీవ్ మంజూరుచేసినప్పుడు నిల్వ ఉన్నo వరకు ముందుగ EL తదుపరి HPL మిగిలినదానికి EOL మంజూరు చేస్తారుEOL పీరియడ్ ను తప్పనిసరిగా సర్వీస్ వెరిఫికేషన్ ఎంట్రీ వేయాలి.

9 ) రిజిష్టర్ రాయాల్సిన పని మరియు భాధ్యత పూర్తిగా DDO లదేపని భారం అయినప్పుడు ఎవరి తోనైన రాయించవచ్చు కానీ DDO గారు భాధ్యత వహిస్తారుకాబట్టి అంతా క్షుణ్ణంగా అధ్యయనం చేసిసంతకం చేయాలి .

10 ) భార్య భర్తల బదిలీల వాడుకున్నపుడు ఖచ్చితంగా  వివరాలు రిజిష్టర్ లో నమోదు చేయాలి.గజిటెడ్

 ఉద్యోగులకు ఐదు సంవ్సరాలకు ఒకసారి మిగతా వారికి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారివాడుకోవచ్చుఇరువురికి ఇచ్చే పాయింట్లు పది.

 

EWF :- 

ఇది ఉద్యోగుల నిధి

 ఈ నిధికి ఉద్యోగుల జీతాలు ద్వారా, చందాలు ద్వారా , విరాళాలు ద్వారా డబ్బులు సేకరిస్తారు.

ఈ నిధికి రెండు కమిటీలు ఉంటాయ. 

ఒకటి రాష్ట్ర కమిటీ , రెండవది జిల్లా కమిటీ. 

రాష్ట్ర కమిటీకి CS గారు అధ్యక్షునిగా , ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రేజరర్ గా ఉంటారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సభ్యులు గా ఉంటారు.

 జిల్లా కమిటీకి కలెక్టర్ గారు అధ్యక్షునిగా , DTO గారు ట్రేజరర్ గా ఉంటారు.

 ఈ నిధి నుంచి రాష్ట్ర కమిటీ ద్వారా 1 లక్ష రూపాయలు అప్పు తీసుకోవచ్చు. 

జిల్లా కమిటీ ద్వారా 20 వేలు అప్పు గా తీసుకోవచ్చు.

ఈ అప్పు 5 సంవత్సరం ల లోపు వడ్డీ తో సహా జీతం ద్వారా చెల్లించాలి. 

సరిఐన కారణం ఉంటేనే అప్పు ఇస్తారు.

ఇళ్లు కట్టుకోవటానికి , ఇంటి ఋణం తీర్చటానికి అప్పు ఇవ్వరు

 

FUNDAMENTAL RULES ….

# F.R. 12(a)  1 శాశ్వత పోస్ట్ లోకి ఇద్దరూఅంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకే సారి నియమించరాదు.

#F. R. 12(బి)  ఒక govt employee ని ఒకే సారి 2 లేక అంతకంటే ఎక్కువ పోస్ట్ లలో నియమించరాదు.

# F. R. 12(c) ఉద్యోగి లీవ్ లో ఉంటే  పోస్ట్ లో మరొకరిని appoint చేయకూడదు.

#F. R. 15(b)  ఉద్యోగి 1 డే కూడా మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు.

#F. R. 18   govt appoint చేస్తే తప్ప employee కి ఒకే సారి 5y కంటే ఎక్కువ సెలవు మంజూరు చేయకూడదు.

#F. R.18(a)  1y కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవు లో ఉంటేఅతను రాజీనామా చేసినట్లు లెక్క.

#F.R.18(బి)   పర్మిషన్ ఉన్నా /పర్మిషన్ లేకుండా 5y కంటే ఎక్కువ కాలం లీవ్ లో ఉంటే అతను జాబ్ కి రాజీనామాచేసినట్లు లెక్క.

#F. R.18(c)   5y కంటే ఎక్కువ కాలం ఫారిన్ సర్వీస్ లో ఉన్నపుడు అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.

#F. R.22(a)   ప్రస్తుత పోస్ట్ విధుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత విధులు గల పోస్ట్ లోకి నియమించబడినప్పుడు ప్రస్తుతవేతనం కంటే నూతన స్కేలు లో ఫై స్టేజి వద్ద స్థిరీకరి0చబడుతుంది.

#F. R.22(a)(iv)   ఒక ఉద్యోగి APPSC ద్వారా మరొక పోస్ట్ కి సెలెక్ట్ అయినపుడు పాత పోస్ట్ లోని వేతనాన్కి తక్కువకాకుండా కొత్తగా ఎంపిక ఐన పోస్ట్ లో వేతనం స్తిరీకరి0చబడును.కొత్త ఉద్యోగం లో చేరిన తేదీ నుంచి 1y తరువాత మాత్రమేఇంక్రిమెంట్ ఇవ్వబడును.ఇక పాత పోస్ట్ లోని ఇంక్రిమెంట్ డేట్ పోతుంది.

#F. R.22(B)   ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్ కి పదోన్నతి పొందినప్పుడుకింది పోస్ట్ లో పొందుతున్న వేతనానికి ఒకnotional increment కలిపి వచ్చిన వేతనాన్ని ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో ఫై స్టేజి వద్ద నిర్ణఇ0చాలి.పదోన్నతి వచ్చినఉద్యోగి 2 రకాల వేతన స్తిరీకరణ కై ఆప్షన్ కలిగి ఉంటాడు.అవి (a)పదోన్నతి వచ్చిన తేదీ (b)కింది పోస్ట్ లో ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవటం.

#F. R.24   వార్షిక ఇంక్రిమెంట్ యధాలాపంగా వస్తుందిఉద్యోగి ప్రవర్తన సంతృప్తి కరంగా లేకపొతే ఆతని ఇంక్రిమెంట్ అపివేయవచ్చు.ఇలా అపి వేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు,అలా ఎంతకాలం అపి వేస్తున్నారో అలాగే with cumulativeలేదా with out cumulative effect అన్న విషయం ఉత్తర్వుల లో తెలుపవలెను.

Ex  ఒక ఉద్యోగి 1.6.10 ఇంక్రిమెంట్ తీసుకున్న తరువాత పనిష్మెంట్ గా 2 ఇంక్రిమెంట్ లు ఆపారు అనుకుందాం.

(a)with cumulative effect

 విధంగా చేస్తే 1.6.13 నకు ఒకే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది.

(b)with out cumulative effect

 విధంగా చేస్తే 1.6.13 నకు 3 వార్షిక increment లు వస్తాయి.అంటే 2 వార్షిక increments arrearsకోల్పోయినట్లు.

# F. R.26    ఇంక్రిమెంట్ కి పరిగణింపబడే సర్వీస్ కి సంబందించిన షరతులు ఉన్నాయి.

ఒక టైం స్కేల్ లో పని చేసిన కాలం ఇంక్రిమెంట్ కి లెక్కించబడుతుంది.

ఐతే జీత నష్టపు సెలవు పెట్టి ఉంటే అంతకాలం వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది.

180 రోజుల వరకు వైద్య కారణాల తో జీత నష్టపు సెలవు వాడు కొన్నపుడు ఇంక్రిమెంట్ తేదీ వాయిదా పడకుండాఉత్తర్వులు ఇచ్చే అధికారము Head of department లకు ఇవ్వబడినది.

#F.R.26(a)    ఏదయినా పరీక్ష పాస్ అయిన0దు వల్ల ఉద్యోగికి ఏదయినా హక్కు లేదా మినహాఇ0పు వచ్చినట్లయితే సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ నుండి మంజూరు అయినట్లు గా భావించాలి.

కొత్తగా ఉద్యోగం లో చేరిన లేదా ప్రమోషన్ పోస్ట్ లో చేరిన ఉద్యోగికి ఆతని వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలల కాలం పూర్తికాకుండానే మంజూరు అవుతుంది.

Ex: 19.12.73 నాడు ఉద్యోగం లో చేరిన ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ 1.12.74 నకే మంజూరు అవుతుంది.

ఒక ఉద్యోగి రిటైర్ ఐన తేదీ మరుసటి రోజు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉన్నపుడు pentionery benifits కోసం notionalమంజూరు అయినట్లు భావించి లెక్కించాలి.

ఐతే లీవ్ encashment వంటి వాటికి ఇది వర్తించదు.

F. R.44    ఉద్యోగి లీవ్ లో ఉన్నపుడు 4 నెలల వరకు HRA పూర్తి గా మంజూరు చేయవచ్చును.అర్ద లేదా పూర్తి వేతనసెలవు మీద వున్న ఉద్యోగి HRA, అతడు సెలవు మీద వెళ్ళేటప్పటి వేతనం మీద లెక్కించబడుతుంది.

# F.R.49    govt ఒక ఉద్యోగి ని temporary గా 2 పోస్ట్ లకి నియమించవచ్చును.

#F.R.49(a)    విధంగా 2 పోస్టులు చూస్తున్నప్పుడు ఏది ఎక్కువ వేతనం కలిగి ఉంటుందో వేతనం మంజూరుచేయవచ్చు.

 ఉద్యోగిని అదనపు పోస్ట్ ను కూడా నిర్వహించమన్నపుడు మొదటి 3 నెలల వేతనం లో 1/5 భాగం ,next 3 నెలలు1/10 భాగం అలవెన్సు చెల్లించబడుతుంది.

 

 

సెలవు మంజూరు అధికారం:

                               G.O.Ms.No.58 విద్య తేది:22-04-2008  ద్వారా విద్యాశాఖలో వివిధ రకాల సెలవులుమంజూరు    అధికారంకాలపరిమితుల పై   ఉత్తర్వులు  ఇవ్వబడినవి,  కాలక్రమేణ   నియమాలను సవరిస్తూ G.O.Ms.No.70 విద్య తేది:06-07-2009 ద్వారా ఏఏ అధికారి ఎన్ని రోజులుఏరకమైన సెలవులు మంజూరు  చేయాలోతాజా మార్గదర్శకాలు జారీచేయబడినవి.

 

ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు:

                   ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు లేదాప్రత్యేక ఆకస్మిక సెలవులు  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంజూరు చేస్తారు.15 ఆకస్మిక సెలవులు,7 ప్రత్యేక ఆకస్మికసెలవులుఒకేసారి ఆకస్మిక సెలవులు/ప్రత్యేక ఆకస్మిక సెలవులు 10 రోజులకు  మించకుండా మంజూరు చేస్తారు.

ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు:

                   ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయులకు  పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఆకస్మిక/ప్రత్యేకఆకస్మికఆర్జితఅర్ధవేతనకమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు

నెలల వరకు మంజూరు చేస్తారు.

ప్రసూతి సెలవు(Maternity Leave):

                మహిళా ఉద్యోగుల ప్రసూతి   సెలవుల మంజూరు విషయంలో 180 రోజుల  వరకు  సెలవు మంజూరు చేసేఅధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,మండల విద్యాధికారులకు  G.O.Ms.No.84 తేది:17-09-2012ద్వారా కల్పించబడింది.

మండల విద్యాధికారులు:

               తన పరిధిలోని  ప్రాథమిక,  ప్రాథమికోన్నత  పాఠశాలల  ప్రధానోపాధ్యాయులకు  ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథమిక/ప్రాథమికోన్నత  పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,  అన్ని క్యాడర్ల   ఉపాధ్యాయులకు  ఆర్జిత సెలవులు/అర్ధవేతన సెలవులు/కమ్యూటెడ్   సెలవులు  మరియు   వేతనంలేని  సెలవులు  4  నెలల  వరకు  మంజూరు చేస్తారు.

ఉప విద్యాధికారి:

                                   తన పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలలప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మికసెలవులతో పాటు ప్రాథ మిక/ప్రాథమికోన్నత /ఉన్నత పాఠశాలల  ప్రధానోపాధ్యాయులకు   , అన్ని క్యాడర్లఉపాధ్యాయులకు ఆర్జితఅర్ధవేతన/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల పైబడి ఆరు నెలలవరకు మంజూరుచేస్తారు.

జిల్లా విద్యాధికారి:

జిల్లాలోని ఉపవిద్యాధికారులకుమండల విద్యాధికారులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మికఆర్జిత/అర్ధవేతనకమ్యూటెడ్సెలవులు మరియు వేతనంలేని సెలవులు 1సం వరకు మంజూరు చేయవచ్చునుజిల్లాలోని అన్ని ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు 6నెలలనుండి 1 సం వరకు అన్ని రకాలసెలవులు మంజూరు  చేస్తారు.

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్

మండలవిద్యాధికారులకు, /ఉన్నతప్రాథమికోన్నత/ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియుఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను 1 సం నుండి 4 సం వరకు సెలవు మంజూరు చేస్తారు.

కొన్ని ముఖ్యాంశాలు:

సెలవు పై వెళ్ళిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా అదే పాఠశాలలో చేరవలసిన ఉంటుంది.

సెలవు నిర్ణీత గడువు ముగిసిన పిదప 15 రోజులలో  చేరకపోతే జిల్లా విద్యాధాఖాధికారికి రిపోర్ట్ చేయాలి.

నిర్ణీత సమయానికి మా మించి అనుమతి లేకుండా సెలవు వినియోగించుకుంటే రీపోస్టింగ్ సందర్భంలో 4 కేటగిరీకిబదిలీచేస్తారు.

అధికంగా వాడుకున్న సెలవును  FR-18 ప్రకారం  అనధికార గైర్హాజరుగా భావించి డైస్ నాన్ గా ప్రకటిస్తారు.

 

EL - EARNED LEAVES

సంపాదిత సెలవు

GO,232 ప్రకారం వెకేషన్ డిపార్టుమెంటు వారికి సంవత్సరానికి 6 (జనవరి లో 3, జూలై లో 3)రోజులు జమ అవుతాయి.

గరిష్ట0 గా 300 కు మించి నిల్వ ఉండకూడదు.

GO.114 ప్రకారం వేసవి సెలవుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి, పని చేసిన రోజులకు మాత్రమే EL లు జమ చేస్తారు.

వీటిని కూడా సాధారణ సెలవులు లాగా కూడా వాడుకోవచ్చు.

GO,232 ప్రకారం ఒకే సారి 120 రోజుల వరకు వాడుకోవచ్చు.

ఇతర సెలవుల తో కలిపి మొత్తం 180 రోజుల వరకు వాడుకోవచ్చు.

సెలవు లలో పని చేసిన రోజులు - వచ్చెడి ELs

   1,2 – 1    3,4 – 2  5,6 – 3  7 – 4  8,9 – 5  10,11 -6   12,13 – 7   4,15 -   16 – 9     17,18 – 10    19,20 – 11   21,22 – 12   23,24 – 13  25 – 14   26,27 -15    28,29 – 16  30,31 – 1   32,33 – 1   34,35 – 1    36 - 20

 

CHAILD CARE LEAVE

                  మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు ఇప్పటి వరకు సంచల యొక్క ప్రాతినిధ్యంతో క్రింద తెలుప బడిన ప్రత్యేక సెలవులు(సి.యల్స్ & స్పెషల్ సీ.యల్స్ (15+7)కాకుండా) సాధించుకొని వినియోగించు కొనుచున్నాము.

1. ప్రసూతి సెలవులు ......180 రోజులు (జి.ఓ..యం.యస్.నెం.152, తేదీ.04/05/2010)

 2.అబార్షన్ సెలవులు ......42 రోజులు (జి.ఓ.యం.యస్.నెం.219, తేది.25/06/1984)

3.ట్యూబెక్టమీ ఆపరేషన్ సెలవులు ......14 రోజులు (జి.ఓ.యం.యస్.నెం.1415, తేది.10/06/1968)

4. కానలైజేషన్ ఆపరేషన్ సెలవులు21 రోజులు (జి.ఓ.యం.యస్.నెం.102, తేది.19/02/1981)

 5.గర్భనిరోధక సాధనం(లూప్ అమర్చుటకు ...... 01రోజు (జి.ఓ యం.యస్.నెం.102, తేది.19/02/1981)

6.గర్భసంచి తొలగింపు హిస్టారెక్టమీ ఆపరేషన్ సెలవులు--.... 45 రోజులు (జి.ఓ.యం.యస్.నెం.152, తేది.31/04/2011)

7. మహిళా దినోత్సవము (మార్చి, 8)................ 01 రోజు  (జి.ఓ యం.యస్.నెం.433, తేదీ.04/08/2010)

8.మహిళా ఉపాధ్యాయినీలకు ప్రత్యేక సెలవులు.... 5 రోజులు( జి.ఓ యం.యస్.నెం.374, తేది.16/03/1998).

          పై విధంగా ప్రత్యేక సెలవులతో పాటుగా ప్రస్తుత 10వ పి.ఆర్.సి. ప్రతిపాదనలు అనుగుణంగా సర్వీసు మొత్తములో పిల్లలను పెంచు నిమిత్తము లేక పాఠశాల&కాలేజి స్థాయి పరీక్షల సమయంలోనూ,వారి అనారోగ్య సమయంలలో, వగైరాలకు 2నెలలు (60రోజులు) వరకు శిశు సంరక్షణ సెలవులు క్రింద తెలుపబడిన నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకొనుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినది. ఈ సదుపాయము మహిళా ఉద్యోగులకు ఒక వరంగా భావించుటలో అతిశయోక్తి లేదు.

1. సెలవులను 3సారు తగ్గకుండా ఇద్దరి పిల్లల యొక్క వయస్సు 18సంIIల లోపు వరకు మరియు అశక్తులైనపిల్లల యొక్క  (మానసిక , శారీరక వికలాంగులు) వయస్సు 22 సంIIలలోపు వరకు ఎన్నిసార్లు అయిననూ వినియోగించు కొనవచ్చు.

2. ఈ సెలవులను LTC . నిమిత్తంగా వాడుకోనుకు అవకాశము లేదు.

3. ఈ సెలవులు వినియోగించుకొనిన వివరాలు జి.ఓ నందు పొందు పరచబడిన సంబంధిత ప్రొఫార్మా ప్రకారంగా ఇ.యల్స్

మరియు అర్ధజీతపు సెలవుల అకౌంటు మాదిరిగా సర్వసు రిజిస్టరు నందు నమోదు పరచుకొనవలెను.

4. ఈ సెలవులు ఇ.యల్స్ మరియు ఆర్టజీతపు సెలవుల అకౌంటు నుండి తగ్గించబడవు.

5. ఈ సెలవులు కార్యాలయము/సంస్థ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందు లేకుండా మాత్రమే వినియోగించుకొనవలెను.

6. ఈ సెలవులు వినియోగించుకొనుట హాక్కుగా భావించరాదు. మంజూరు చేయు అధికారిని ముందుగానే అనుమతి తీసుకొని మాత్రమే వినియోగించుకోనవలెను.

7. ఈ సెలవులు సంపాదిత సెలవులుగానే పరిగణించాలి.

8. ఈ సెలవులు ప్రసూతి సెలవులు మరియు ఇతర సెలవులతో కలుపుకొని అనగా స్.యల్స్ & స్పెషల్ స్.యల్స్ కాకుండా  వినియోగించుకొనవచ్చు.

9. ఉద్యోగిని యొక్క ప్రొబేషన్ కాలము నందుకూడా వినియోగించుకొనవచ్చు కాని సదరు కాలము వరకు ప్రొబేషన్ కాలము పొడిగించబడును.

10. ఈ సెలవులను లీవ్ - నాట్ - డ్యూ గా అవకాశము కలదు.

 

                Leave Not Due   -    సంపాదించని సెలవు

             AP Leave Rules 1933 మరియు 15C, 18C మరియు 25 ను అనుసరించి ప్రొటేషన్ కాలము సంతృప్తికరంగా పూర్తిచేసిన సుపీరియరు మరియు నాల్గవ తరగతీ సర్వీసులకు చెందిన ఉద్యోగులందరూ ఈ సెలవు పొందుటకు అర్హులు .

సంపాదించని సెలవు మెడికల్ సర్టిఫికెట్ పై మాత్రమే,సగం జీతం సెలవు ఖాతాలో నిల్వలేనపుడు భవిష్యత్ లో ఆర్జించిబోవు సగం జీతపు సెలవును వినియోగించుటకు ఈ సెలవు మంజూరు చేయవచ్చును. *[Rule 15(c) & 18(C)]* *(G.O.Ms.No.543 F&P Dt:07-12-1977)

మొత్తం సర్వీసులో 180 రోజులకు మించకుండా ఈ సెలవు మంజూరు చేయవచ్చును. ఈ విధంగా మంజూరైన సంపాదించని సెలవు సగం జీతం సెలవు ఖాతాలో (-) గా నమోదుచేయాలి.

              భవిష్యత్తు లో ఆ ఉద్యోగి సంపాదించుకోగలిగిన సగం జీతం సెలవుకు మించి ఇట్టి సెలవును మంజూరు చేయకూడదు.

               ఉద్యోగి భవిష్యత్తు లో సగం జీతం సెలవు సంపాదించుకోగలడనీ, అంతేకాకుండా మంజూరైన సెలవు తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరుతాడని విశ్వసించినపుడు మాత్రమే సెలవు మంజూరు చేయాలి.

                ఒకవేళ సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగి ఏ కారణం చేతనైనా స్వచ్ఛంద పదవీ విరమణ చేయదలచుకున్న అంతకు ముందు మంజూరు చేసిన సెలవు ఉత్తర్వులను రద్దుపరచాలి.అట్టి సందర్భాలలో సెలవు ఎప్పటినుండి ప్రారంభమయ్యిందో అప్పటి నుండి స్వచ్ఛంద పదవీ విరమణ అమలులోకి వస్తుంది.

అనారోగ్య కారణంగా ఉద్యోగంలో కొనసాగుటకు అశక్తుడై పదవీ విరమణ చేసినా గాని,క్రమశిక్షణా చర్యల ప్రకారం నిర్భంద పదవీ విరమణ చేయబడినా గాని,లేక మరణించినా గాని ఆ ఉద్యోగికిచ్చిన సంపాదించని సెలవు జీతాన్ని వసూలు చేయనవసరం లేదు. *(G.O.Ms.No.290 F&P Dt:19-11-1981)*

సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగులకు సగం జీతం సెలవులో పొందే సెలవు జీతం మరియు భత్యం చెల్లిస్తారు.

 

స్టెప్‌అప్‌,  ప్రీ పోస్మేంట్ ఆఫ్‌ ఇంక్రిమెంటు 

నియమనిబంధనలు :

           9వ వేతన సవరణ సంఘం చేసిన సానుకూలమైన సిఫారసులలో ముఖ్యమైనది స్టెప్‌అప్‌ప్రీపొన్‌మెంట్‌ ఆఫ్‌ ఇంక్రిమెంటు సౌకర్యాలను పునరుద్ధరించటం. ఆర్‌పిఎస్‌-93కి ముందు ఇవి అమలులో ఉన్నాయి. 31.07.93 నుండి (93,98,2005 పీఆర్‌సీలలో) వీటి అమలును నిలిపి వేశారు. ఆ కారణంగా ఏర్పడిన వేతన వ్యత్యాసాల వల్ల పలువురు సీనియర్‌ ఉపాధ్యాయులుఉద్యోగులకు నష్టం జరిగింది. ఈ నష్టాలను 9వ వేతన సవరణ కమీషన్‌ దృష్టికి తీసుకువచ్చిస్టెప్‌అప్‌ప్రీపోన్‌మెంటు సౌకర్యాలను పునరుద్ధరించాలని యుటియఫ్‌ చేసిన వాదనను అంగీకరించిన పీఆర్‌సీ ఆసౌకర్యాలను పునరుద్ధ-రించింది.అంతే కాకుండా గత పీఆర్‌సీలలో ఏర్పడిన అసమానతలను సవరించిన అనంతరమే 2010 వేతన స్థిరీకరణ నిర్వహించాలని సిఫారసు చేసింది. 17 ఏళ్ళ అనంతరం పునరుజ్జీవం పొందిన స్టెప్‌అప్‌ప్రీపోన్‌మెంటు ఆఫ్‌ ఇంక్రిమెంట్‌ గురించి తెలుసుకుందాము..

స్టెప్‌ అప్‌: 
                      సీనియర్‌ ఉపాధ్యాయులు తన కంటే జూనియర్‌ అయిన ఉపాధ్యాయుని కంటే తక్కువ వేతనము పొందుతుంటే అట్టి వ్యత్యాసమును ఎఫ్‌ఆర్‌ 27 ప్రకారం సవరించబడుటను స్టెప్‌అప్‌ అంటారు. ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌లో 10-15 సంవత్సరాల స్కేళ్ళఅమలు వలన వచ్చిన వ్యత్యాసమును సవరించుటకు ప్రభుత్వం జి.ఓ.ఎంఎస్‌.నం. 297 ఆర్థిక & ప్రణాళికతేది. 25.10.1983 ద్వారా స్టెప్‌అప్‌ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఎఎఎస్‌లో 10/15/22 సం|| స్కేళ్ళ అమలుపదోన్నతి సందర్భములో ఎఫ్‌ఆర్‌ 22(బి) అమలు తదితర కారణాలవలన వచ్చిన వ్యత్యాసమును సవరించుటకు ప్రభుత్వం జి.ఓ.ఎంఎస్‌.నం. 75 ఆర్థిక & ప్రణాళికా శాఖతేది. 22.02.94 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. పై రెండు ఉత్తర్వులను ఉపాధ్యాయులకు కూడా వర్తింప చేస్తూ ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్‌.నం. 475 విద్యతేది. 02.11.98 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

            పై ఉత్తర్వులు 93 పీఆర్‌సీ స్కేళ్ళ అమలుకు ముందు వరకు అనగా 31.07.93 వరకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. తదుపరి 93,99 పీఆర్‌సీల్లో ఎఎ స్కీము స్కేళ్ళు పొందినవారికి ఎఫ్‌ఆర్‌ 22బి ప్రయోజనం నిరాకరించబడి ఆర్‌పిఎస్‌ 2005లో పునరుద్ధరించ బడింది. ఆ కారణంగా ఏర్పడిన వేతన వ్యత్యాసాలను సవరించటానికి వీల్లేదని ప్రభుత్వం మెమో నం. 2620-ఎ/65/ఎఫ్‌ఆర్‌-11/07, తేదీ. 20.02.2007 ద్వారా ఆదేశించింది. అందువలన అనేకమంది సీనియర్‌ ఉపాధ్యాయులుఉద్యోగులు తమ జూనియర్లకంటే తక్కువ వేతనం పొందుతున్నారు. అటువంటి వారందరికీ ఇప్పుడు ప్రయోజనం కలుగుతుంది. పైన పేర్కొన్న ప్రభుత్వ ఉత్తర్వులలో స్టెప్‌అప్‌ ఉత్తర్వులు అమలు చేయుటకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను నిర్ధేశించింది. ఈ నిబంధనల పరిధిలోనే స్టెప్‌అప్‌ అమలు చేయబడుతుంది.

నిబంధనలు : 
1. సీనియర్‌, జూనియర్‌ ఉపాధ్యాయుని నియామకం ఒకే యూనిట్‌లో జరిగి ఉండాలి. అనగా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌లలో పని చేసే వారికి అదే యూనిట్‌లో పని చేసే వారితో పోల్చుకోవాలి.
2. సీనియర్‌, జూనియర్‌లు ఒకే పే స్కేలు కలిగి ఉండాలి.
3. సీనియర్‌, జూనియర్‌లు ఇద్దరూ ఒకే పే స్కేలు, ఒకే సబ్జెక్టు మరియు ఒకే ప్రమోషన్‌ ఛానల్‌ కలిగిన కేటగిరీలోనికి పదోన్నతి పొంది ఉండాలి.
4. పదోన్నతి పొందుటకు ముందు క్రింది కేడరు పోస్టులో జూనియర్‌ యొక్క వేతనం సీనియర్‌ వేతనముకంటే తక్కువగా గాని లేక సమానముగా గాని ఉండాలి.
5. ఎఫ్‌ఆర్‌ 27 ప్రకారము సీనియర్‌ వేతనమును జూనియర్‌ వేతనముతో సమానము (స్టెప్‌అప్‌) చేసిన తదుపరి సీనియర్‌ ఉపాధ్యాయునికి వార్షిక ఇంక్రిమెంట్‌ స్టెప్‌అప్‌ జరిగిన తేదీనుండి ఒక సంవత్సరమునకు మంజూరు చేయబడుతుంది. ఒక వేళ జూనియర్‌ వేతనము ఎఫ్‌ఆర్‌ 31(2) ప్రకారం ఇంక్రిమెంటు తేదీకి రీ ఫిక్స్‌ చేయబడియుంటే సీనియర్‌ వేతనము కూడా అదే విధంగా సదరు తేదీకి జూనియర్‌తో సమానంగా స్టెప్‌అప్‌ చేయబడును.
6. సీనియర్‌ పదోన్నతి పొందిన తదుపరి జూనియర్‌ దిగువ క్యాడరులోనే 8/16/24 సం||ల స్కేలులో వేతన నిర్ణయం పొంది తదుపరి పదోన్నతి పొందిన సందర్భములో జూనియర్‌ వేతనముతో సీనియర్‌ వేతనం స్టెప్‌అప్‌ చేయబడును.
7. సీనియర్‌ పదోన్నతి పొందినప్పుడు ఎఫ్‌ఆర్‌ 22(ఎ)(1) ప్రకారం వేతన నిర్ణయం జరిగి, జూనియర్‌ పదోన్నతి పొందినప్పుడు ఎఫ్‌ఆర్‌ 22బి ప్రకారం వేతన నిర్ణయం జరిగిన సందర్భములో వీరి వేతనంలో కలిగే అసమానతను స్టెప్‌అప్‌తో సరి చేస్తారు.
8. సీనియర్‌ వేతనముకంటే జూనియర్‌ వేతనము (ఎ) అదనపు అర్హతలకు మంజూరు చేయబడిన అదనపు ఇంక్రిమెంట్ల వల్ల కానీ (బి) కుటుంబ నియంత్రణ అమలుకు జారీ చేయబడిన వ్యక్తి గత వేతనము వలన గాని (సి) జూనియర్‌కు మంజూరు చేయబడిన ప్రొత్సహక ఇంక్రిమెంట్లు వలనగాని పెరిగినట్లైతే, వీరి వేతనములో వచ్చిన వ్యత్యాసమును ఈ ఉత్తర్వుల ప్రకారం స్టెప్‌అప్‌ చేయు అవకాశము లేదు.
9. పీఆర్‌సీ 2010 సిఫారసు మేరకు పీఆర్‌సీ అమలు తేది. 01.07.2008 నాటికి పై నిబంధనల మేరకు జూనియర్‌ ఉపాధ్యాయుని కంటే సీనియర్‌ ఉపాధ్యాయుడు తక్కువ వేతనం పొందుతుంటే ఆ తేడాను సవరించిన తదుపరి ఆర్‌పిఎస్‌ 2010 స్కేళ్ళలో వేతన నిర్ణయం చేయబడుతుంది.

ఉదాహరణ : 89 డిఎస్‌సిలో 17.07.89 1010-1800/1010 వేతనంతో నియామకమైన ,బి అనే ఇరువురు ఎస్‌జిటిలలో సెలక్షన్‌ లిస్ట్‌ ప్రకారం సీనియర్‌ అయిన (ఎ) అనే ఉపాధ్యాయుడు ప్రథమ నియామకం తేదీకేబిఎస్సీబిఇడి (మాథ్స్‌) అర్హతలు కలిగిఎఎ స్కీములో 8 సం||ల స్కేలు తీసుకున్న అనంతరం 12.09.98న ఎస్‌ఏ (మాథ్స్‌) ప్రమోషన్‌ పొందినందున ఎఫ్‌ఆర్‌ 22 (బి)(రి) ప్రకారం వేతనం స్థిరీకరణ జరిగింది. (బి) అనే ఉపాధ్యాయుడు ఇంటర్‌టిటిసి అర్హతలతో ఉద్యోగంలో చేరి తరువాత కాలంలో బిఎస్సీబిఇడి అర్హతలు సంపాదించి, 8/16 సం||ల స్కేళ్ళు తీసుకున్న అనంతరం 1.03.2006న స్కూల్‌ అసిస్టెంట్‌ మాథ్స్‌గా ప్రమోషన్‌ పొందాడు. అతని వేతనం ఎఫ్‌ఆర్‌ 22 బి ప్రకారం స్థిరీకరించ బడింది. ఆ కారణంగా (బి) అనే ఉపాధ్యాయుడు (ఎ) కంటే 1 లేదా ఇంక్రిమెంట్లు అదనంగా వేతనం పొందే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో (ఎ) వేతనాన్ని (బి)కి ప్రమోషన్‌ పోస్టులో వేతన స్థిరీకరణ జరిగిన (1.03.06 / 01.07.06) తేదీ నాడు స్టెప్‌అప్‌ ద్వారా సమానం చేస్తారు. ఆ తదుపరి ఒక సంవత్సరం తర్వాత వార్షిక ఇంక్రిమెంటు ఇస్తారు. అటు పిమ్మట 01.07.08 నాటి వేతనం ఆధారంగా ఆర్‌పిఎస్‌ 2010లో వేతన స్థిరీకరణ జరుగుతుంది

1.ప్రశ్న : (i) నేను 2002 డిఎస్పీలో స్పెషల్ వి.వి.గా ఎంపికై డిసెంబర్ 2005 లో రెగ్యులర్ ఎస్.జి.టి. గా నియామకమయ్యాను. 1.7.08 నాడు RPS- 2010 నందు నా వేతనం రు.1 1,530/- గా ఉన్నది. అయితే 2003 డిఎస్పీ లో ఎంపీకై 7.12.2005 న అఫ్రంటీస్ ఎస్ జి టి గా చేరిన ఒక ఉపాధ్యాయుడు ఆరు నెలలు ఇ.ఓ.ఎల్ కారణంగా 14.7.08 న రెగ్యులర్ స్కేల్ పొందాడు. ఆయనకు ఆర్.పీ.ఎస్ 2010 స్కేళ్ళలో 2 నేషనల్ ఇంక్రిమెంట్ లతో కలుపుకుని వేతనం 12190అవుతున్నది. ఆతను నాకంటే జూనియర్ అయినందున నాకు స్టెప్ అప్ వర్తిస్తుందా?

 (ii) 2001,2002 DSC స్కూల్ అసిస్టెంట్ లు 1.7.08 నాడు ఆర్.పీ.ఎస్-10 లో రు. 14860/- వేతనం పొందుతూ ఉంటుండగా, 2003 డిఎస్పీ వారు 1.10.08 నాడు 2 నేషనల్ ఇంక్రిమెంట్ కలుపుకుని రు. 15700/- వేతనం పొందుతున్నారు. ఈ వ్యత్యాసం సవరించేందుకు పరిష్కారం ఏమిటి?

జవాబు: ప్రస్తుతం అమలులో ఉన్న స్టెప్ అప్ నిబంధనల ప్రకారం ఈ వ్యత్యాసం సవరించడానికి అవకాసం లేదు కానీ ఎఫ్ఆర్ 27 ప్రకారం ప్రత్యేక సందర్భాలలో ప్రీమేచుర్ ఇంక్రిమెంట్ మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. కనుక మీరు మీ జూనియర్ వేతన వివరాలతో కంపారిటివ్ స్టేట్మెంట్ తయారు చేసి డిఇవో ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోండి.

2.ప్రశ్న: నేను 2002 జనవరిలో ఎస్.జి.టి గా నియామకమయ్యాను. మా డి.ఎస్.సి లోనే ఎంపికైన నా జూనియర్ ఆరు నెలల ఇ.వీ.ఎల్ కారణంగా ఇంక్రిమెంట్ తేది పోస్ట్ పోన్ అయింది. ఆర్.పి.ఎస్. 200 ఫిక్సేషన్ లో ఇరువురి వేతనం ఒకే స్టేజి లో స్త్రీకరించబడినది అతనికి జూలై లోనే ఇంక్రిమెంట్ వస్తుంది నేను జనవరి వరకు ఆగాల్సి వస్తుంది ప్రేపొంమేంట్ కు STO ఒప్పుకోవడం లేదు. జీత నష్టపు సెలవు వాడుకున్న వారితో ప్రేపొంమేంట్ కుదరదంటున్నారు. సమంజసమేనా?

 జవాబు: సమంజసం కాదు. జూనియర్ ఇంక్రిమెంట్ ఏ కారణం చేత వెనుకకు జరిగినప్పటికీ ఆర్ పీ.ఎస్.201 ఫిక్సేషన్ తదుపరి మీకంటే ముందే ఇంక్రిమెంట్ పొందుతున్నందున జి.వో.52 తేది 252,201 లోని రూల్ 7(i) ప్రకారం మీరు ప్రేపొంమేంట్ కు అర్హులు.

3.ప్రశ్న: నేను Untrained గా 19.1.2002 న జాయిన్ అయి శిక్షణ అనంతరం 1.5.06 నుండి నుండి వార్షిక ఇంక్రిమెంట్లు పొందుతున్నాను మరొకరు 2002 డి.ఎస్.సి లో స్పెషల్ వి.వి. గా ఎంపికై 26.10.05 న రెగ్యులర్ స్కేల్ పొంది 1.10.06 నుండి ఇంక్రిమెంట్లు పొందుతున్నారు 1.7.08 న ఆర్.పీ.ఎస్-10 సందు ఇరువురి వేతనం ఒకే స్టేజి (Rs. 10,900 వద్ద ఫిక్స్ అయింది. నాకంటే జునియర్ ఐన అతనికి 2008 అక్టోబర్ లోనే ఇంక్రిమెంట్ వస్తుండగా నేను 2009 మే వరకు ఆగవలసి వస్తుంది నా వేతనం అతనితో సమానం చేసుకొనే అవకాసం ఉన్నదా?

జవాబు: ఉన్నది, జి.వో.నెం.52, ఆర్ధిక, తేది 25.2.10, లోని రూల్ 7(ii) ప్రకారం మీ ఇంక్రిమెంట్ తేదిని మీ జూనియర్ తేదికి ప్రీపోన్ చేసి అక్టోబర్ లోనే వార్షిక ఇంక్రిమెంట్ విడుదల చేస్తారు మీ వేతనం వివరాలు, మీ జూనియర్ వివరాలతో కంపారిటివ్ స్టేట్ మెంట్ తయారు చేసి ఇంక్రిమెంట్ తేది ప్రీ పోస్మేంట్ కొకరు ఉడి.వో కు దరఖాస్తు చేసుకోండి

4.ప్రశ్న: నేను నవంబర్ 96 లోను, నా మిత్రుడు జూలై 97 లోను ఎస్.జి.టీ గా చేరాము. నేను 2002 నవంబర్లో ఎస్ఎ(ఏ.ఎస్) గాను, అతను 2006 మార్చ్ లో ఎస్.ఎ(ఇంగ్లీష్) గాను పదోన్నతి పొందాము.1.7.08 నాడు నా వేతనం రు.8170, అతని వేలనం రు. 1770. ఇద్దరి వేతనం ఆర్.పీ.ఎస్. 10 నందు రు.14860 గా స్థిరీకరించారు వార్షిక ఇంక్రిమెంట్ తేది జులై లోనే ఉన్నందున అతను నా కంటే 4 నెలలు ముందుగా ఇంక్రిమెంట్ పొందుతున్నారు. నాకు అతనితో ప్రీ పోస్మేంట్ కు అవకాశం ఉన్నదా? సబ్జెక్ట్ వేరనే కారణంతో మా ప్రధానోపాధ్యాయులు ప్రీపోస్మేంట్ చేయటానికి నిరాకరిస్తున్నారు సమంజసమేనా?

జవాబు: ప్రధానోపాధ్యాయుని అభ్యంతరం సమంజసం కాదు. ప్రీ పోస్మేంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ కు ఒకే సబ్జెక్టు నిబంధన వర్తించదుజీ.వో.52, తేది 25.2.10 లోని రూల్ . 7(ii) సందు ఒకే కేడర్ అనే పదాన్ని ఉపయోగించారు కాగా అదే జి.వీ. లోని రూల్ 6{1}{b} స్టెప్ అప్ నిబంధనలలో ఒకే కేటగిరి అనే పదాన్ని ఉపయోగించారు. ఈ రెండింటి మధ్య తేడాను గమనించాలి. 

5.ప్రశ్న: నేను 1994 డి.ఎస్.సి. లో ఎస్.జి.టి. గా ఎంపికై 5.1.96 న duty లోచేరాను. నాకు నవంబర్ 2002 స ఎస్.ఎ.పీ.ఎస్.) ప్రమోషన్ వచ్చింది. కాగా అదే డి.ఎస్.సి. లో ఎంపికై 21.12.95 న చేరిన ఒక ఉపాద్యాయునికి 31.1.2009 న ఎస్.ఎ. పి.ఎస్.) ప్రమోషన్ వచ్చింది. ఆమె వేతనం నా వేతలసం కంటే ఎక్కువగా ఉన్నది. ఆమె వేతనం తో సమంగా , నా వేతనాన్ని స్టెప్ అప్ చేసుకోవచ్చా? ఆమె ఎస్.జి.టి. గా నాకంటే ముందే జాయిన్ అయ్యారు కనుక నాకు స్టెప్ అప్ వర్తించదు అంటున్నారు సమంజసమేనా ?

జవాబు: ఒకే డి.ఎస్.సి కి చెందిన ఒకే కేటగిరి ఉపాధ్యాయులు సీనియారిటీ వారి డిఎస్.సి. మెరిట్ కం రోస్టర్ ర్యాంక్ ను బట్టి నిర్ణయించబడుతుంది చేరిన తేదిని బట్టి కాదు, మీరు 15 రోజులు ఆలస్యంగా చేరినప్పటికి డిఎస్.సీ మెరిట్ కం రోస్టర్ ర్యాంక్ లో ముందుగా చేరిన ఉపాధ్యాయుని కంటే ముందుఉన్నట్లయితే మీరే సీనియర్ గా పరిగనించబడుతారు. అప్పుడు ఆమె వేతనంతో సమానంగా స్టెప్ లప్ తీసుకోవడానికి వీలుపడుతుంది

6.ప్రశ్న: నేను 14.2.79 స ఎస్.జి.టి.గా చేరి 1.11.2002 న ఎస్.ఎ. (సోషల్) గా ప్రమోషన్ పొందాను. నా జూనియర్ 16.2.79 నాడు ఎస్.జి.టి గా చేరి 16.2.2003 న 24 సం|| లకు ఒక ఇంక్రిమెంట్ తీసుకుని జూన్ 2003 న ఎస్.ఎ (సోషల్) గా ప్రమోషన్ పొందాడు. 1.7.08 నాటికి అతను నాకంటే ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ పొందుతున్నాడు అతనితో నాకు స్టెప్ అప్ అర్హత ఉన్నదా?

 జవాబు: అర్హత ఉన్నది. జి.వో నం.2, ఆర్ధిక, తేది 25.2.10 లోని రూల్ 6B{1} ప్రకారం మీరు 1.7.08 నాడు మీ జూనియర్ వేతనం తో సమానం గా స్టెప్ అప్ తీసుకోవచ్చు .

 7.ప్రశ్న: 18.1.2002 స సర్వీసులో చేరిన ఎస్జి.టి. 1.1.11 న రు.12910 వేతనం పొందుతూ ఉండగా, 19.10.02 న చేరిన ఎస్.జి.టి 19.10.2010 నుండే 12910! - వేతనం పొందుతున్నాడు. ఈ తేడాను ప్రీపోన్ మెంట్ ద్వారా సవరించావచ్చా?

జవాబు: సవరించవచ్చు. 2001,2002 డిఎస్సీ లలో నియామకమైన వారి మధ్య ప్రీ పోన్ మెంట్ కు అర్హత అవకాసం ఉన్నది. 1.7.08 న ఆర్.పీ.ఎస్.2010 స్కేళ్ళలో సీనియర్ జూనియర్ ఒకే స్టేజి లో ఫిక్స్ ఐన తదుపరి జూనియర్ తన ఇంక్రిమెంట్ తేది 1.10.08 నాడే పొందుచున్నాడు. అందువల్ల సీనియర్ ఇంక్రిమెంట్ తేదిని ప్రీ పోన్ చేసి 1.10.08 నాడే ఇంక్రిమెంట్ విడుదల చేయాలి

 

8.ప్రశ్న: నేను సెప్టెంబర్ 89 లో ఎస్.జి.టి.గా నియామకమై 2001 డిసెంబర్ లో ఎస్.ఎ ప్రమోషన్ పొందాను.01.07.08 న జూనియర్ స్టెప్ అప్ తీసుకున్నాను తదుపరి నా వార్షిక ఇంక్రిమెంట్ తేది సెప్టెంబర్ 2008 నాడు యధావిధిగా ఇంక్రిమెంట్ పొందాను. ఇది సరియైనదేనా.

జవాబు: సమంజసం కాదు. జి.వో 52, లోని రూల్ 7(iv) ప్రకారం మీరు సేప్పింగ్ లప్ పొందిన జూనియర్ ఆర్.పి.ఎస్ -10స్కళ్ళలో ఎప్పడు ఇంక్రిమెంట్ పొందుతాడో మీరు కూడా అదే తేదికి ఇంక్రిమెంట్ పొందాల్సి ఉంటుంది

9.ప్రశ్న: నా వార్షిక ఇంక్రిమెంట్ తేది ఏప్రిల్ నా జూనియర్ తేది నవంబర్. ఆర్.పీ.ఎస్ -10 ప్రకారం ఒకే స్టేజి లో ఫిక్స్ అయ్యాము ప్రీ పోన్ మెంట్ పెట్టుకోవచ్చానాకు ఏప్రిల్ 2011 కు సం||ల సర్వీసు పూర్తి అవుతుంది. ప్రీ పోస్మంట్ తీసుకుంటే సంవత్సరాల స్పెషల్ గ్రేడ్ స్కేల్ ఎప్పుడు మంజూరు చేస్తారు ?

 జవాబు: జి.వో 52 ఆర్ధిక తేది 25.2.10 లోని రూల్ 7(ii) ప్రకారం మీరు మీ జూనియర్ తో సమానంగా ఇంక్రిమెంట్ తేదిని నవంబర్ 2008 కి ప్రీ పోన్ మెంట్ తీసుకోవచ్చు. ప్రీ పోన్ మెంట్ కారణంగా 8 సంవత్సరాల స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరులో మార్పు ఏమి ఉండదు మీకు 8 సంవత్సరాల సర్వీసు పూర్తి ఐన తేది ఏప్రిల్ 2011 నాడే స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేస్తారు (FB2011} 

10.ప్రశ్న: నేను 95 ఉ.ఎస్.సి. లో ఎస్.జి.టీ.గా ఎంపికై 6.7.95 న విధులలో చేరి 1.11.2002 న ఎస్.ఎ. (పి.ఎస్.) ప్రమోషన్ పొందాను. మరొకరు 7.7.95 న ఎస్.జి.టి.గా చేరి 31.1.95 న ఎస్.ఎ పీ.ఎస్) గా ప్రమోషన్ పొందారు. మెరిట్- కం- రోళ్బర్ సెలక్షన్ జాబితాలో నా ర్యాంక్ 821, అతని ర్యాంక్ 585. ప్రస్తుతం సదరు ఉపాధ్యాయుని మూలవేతనం నాకంటే ఎక్కువగా ఉన్నది. నేను అతని స్టెప్ అప్ చేసుకోవచ్చా? స్టెప్ అప్ కోసం సీనియారిటి ని ఎ క్యాడర్ సందు చూడాలి ఏ ప్రాతిపదికన చూడాలి?

 జవాబు: డి.ఎస్.సి. మెరిట్- కం- రోస్టర్ సెలక్షన్ జాబితాలో ర్యాంకుల ప్రకారం ఆ ఉపాధ్యాయుడే మీకంటే సీనియర్. కనుక అతనితో పోల్చి స్టెప్ అప్ తీసుకోవడానికి నిబందనలు అనుమతించవు. స్టెప్ అప్ కొరకు ఫీడర్ కేటగిరి మరియు ప్రమోషన్ కేటగిరి పోస్టు లలోని సీనియరిటీ మరియు వేతనములను పోల్చి చూస్తారు సీనియారిటి ని ఏ.పి. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ లోని రూల్33(b) ప్రకారం నిర్ణయిస్తారు

11.ప్రశ్న: నేను 2001 డి.ఎస్.సి లో ఎస్.జి.టి. గా ఎంపికై 18.1.2002 న సర్వీసు లో చేరాను. apprentice పీరియడ్ లో 122 రోజులు ఇ.వో. ఎల్. వినియోగించుకొని ఎమ్ఎస్సీ చేసాను. ఆ కారణంగా నేను 21.5.04 నుండి స్కేల్ పొందాను. ఆర్.పీ.ఎస్. 2010 నందు 2002 డి.ఎస్.సి. వారు నాకంటే ముందుగా ఇంక్రిమెంట్ పొందుతున్నారు. వారితో ప్రీ పోన్మెంట్ పెట్టు కోవచ్చా? (i) నా ఇవోఎల్ కారణంగా సీనియారిటి కి ఏమైనా సఫం ఉంటుందా?

జవాబు: 1.7.08 నాటికి ప్రీ రివైజ్డ్ (ఆర్.పి.ఎస్-05) స్కిల్స్ సందు మీ జూనియర్ మీకంటే తక్కువ వేతనం పొందుతూ , 1.7.08 నాడు ఆర్.పి.ఎస్ -10 నందు వేతనం సమానంగా స్థిరీకరించబడి జూనియర్ ముందుగా ఇంక్రిమెంట్ పొందుతూ ఉన్న యెడల జీవీ. 52, ఆర్ధిక తేది 25.2.10 లోని రూల్ 7(ii) ప్రకారం సీనియర్ ఇంక్రిమెంట్ తది జూనియర్ తేదికి మార్పు చేయాలి కనుక మీరు ప్రీపోన్ మెంట్ కు అర్హులే. (i) అధికారికంగా మంజూరు చేయబడిన ఇఎల్ కాలం వల్ల సీనియరిటీ కి నష్టం జరగదు. డి.ఎస్.సి. సెలక్షన్ సందర్భంలో మెరిట్- కం- రోస్టర్ ర్యాంక్ ప్రకారం నిర్ణయించబడిన సీనియరిటీ నే కొనసాగుతుంది

12.ప్రశ్న: 96 డి.ఎస్.సీ. కి చెందిన నేను నవంబర్ 2002 ఎస్.ఏ ఇంగ్లీష్ ప్రమోషన్ పొందాను నా ఇంక్రిమెంట్ తేది నవంబర్. అదే డి.ఎస్.సీ కి చెందిన వారు కొందరు 2006 మార్చ్ లో ప్రమోషన్ పొందారు. ఎస్.జి.టి లో నాకంటే సీనియర్ గా ఉన్న ఒకరి ఇంక్రిమెంట్ తేది జులై గ ఉన్నది ఎస్.జి.టీ లో నాకంటే జూనియర్ గా ఉన్న మరొకరి ఇంక్రిమెంట్ తేది ఆగష్టు గా ఉన్నది వీరిలో నేను ఎవరితో ప్రీపోన్ మెంట్ తీసుకోవచ్చు?

జవాబు: ప్రీ పోన్ మెంట్ తీసుకోవడానికి ప్రస్తుత క్యాడర్ కి సీనియారిటీ ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు జి.వో. 52 ఆర్ధిక 25.2.10 లోని రూల్ 7(ii) ప్రకారం ఆర్.పి.ఎస్ 2005 లో మీరు మీ జునియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతూ, 1.7.08 నాడు ఆర్.పీఎస్ 2010 ఫీ రీకరణలో ఒకే స్టేజి వద్ద స్థిరీకరించబడి మీ కంటే ముందుగా అంటే జూలై! ఆగష్టు లోనే ఇంక్రిమెంట్ పొందుతూ ఉన్న యెడల మీకు కుడా వారితో సమానంగా ఇంక్రిమెంట్ పొందే అర్హత ఉంటుంది జూలై ఇంక్రిమెంట్ తేది కలిగిన జూనియర్ తో ప్రీపోన్ చేసుకోవడమే మీకు లాభదాయకము.

13. ప్రశ్న: 2002 డి.ఎస్.సి లో అన్ టైన్గా ఎంపికైన ఉపాధ్యాయునికి ఇవో.ఎల్. కారణంగా ఇంక్రిమెంట్ తేది డిసెంబర్ నుండి జూలై కి మారింది ఆర్.పీ.ఎస్. 2010 వేతన స్థిరీకరణ అనంతరం 2002 బాచ్ అందరి కంటే ముందుగా అతను ఇంక్రిమెంట్ పొందుతున్నాడు. అతనితో మిగిలిన ఉపాధ్యాయులు ప్రీ పోన్ మెంట్ తీసుకోవచ్చా

జవాబు: తీసుకోవచ్చు. ఆర్.పీ.ఎస్ 2010 వేతన స్థిరీకరణ జరిగిన తేది1.7.08 కి ముందు అతను మిగిలిన వారికంటే తక్కువ వేతనం పొందుతూ, ఫీజెషన్ లో వేతనం సమానమై ముందుగా ఇంక్రిమెంట్ పొందుతూ ఉంటే జి.వో 52 ఆర్దిక 25.2.10 లోని రూల్ 7(ii) ప్రకారం సర్వీసులో అతనికంటి సీనియర్ గా ఉన్న వారందరూ అతనితో సమానం గా ఇంక్రిమెంట్ తేదిని ప్రీ పోన్ చేసుకునే అవకాశం ఉన్నది.

14. ప్రశ్న: స్టెప్ అప్ నిబంధనలలో సేమ్ కేటగిరి అంటే ఏమిటి స్కూల్ అసిస్టెంట్స్ అందరు ఒకే కేటగిరి గా పరిగణించబడతారా ?

 జవాబు : సర్వీసు నిబంధనల ఉత్తర్వులు ప్రకారం స్కూల్ అసిస్టెంట్స్ అందరు ఒకే క్లాసు క్యాడర్ గా పరిగణించబడుతారు. స్కూల్ అసిస్టెంట్స్ లోని ప్రతి సబ్జెక్టు ఒక కేటగిరి గా పరిగణించబడుతుంది. స్టెప్ అప్ నిబంధనలలో "సమ్ కేటగిరి " అంటీ "ఒకే సబ్జెక్టుకు చెందిన అని అర్ధం చేసుకోవాలి. (i)సీనియర్ , జూనియర్ వేర్వేరు కేటగిరి సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్స్ చెందిన పోస్టులలో ఉంటినిబంధనల ప్రకారం స్టెప్ అప్ కు అవకాశం లేదు

15.ప్రశ్న: నేను 96 డి.ఎస్.సి. ద్వారా ఎస్.జి.టి. గా నియమింపబడి, 2009 జనవరి లో ఎస్.ఏ (ఇంగ్లీష్ ప్రమోషన్ పొందాను. అదే డి.ఎస్.సి లో ఎంపికైన నా మిత్రుడు 2010 జూన్ లో ఎస్.ఏ (ఇంగ్లీష్ ప్రమోషన్ పొందాడు. అతను SPP-IA స్కేల్ పొందడం వల్ల నాకంటే ఒక ఇంక్రిమెంట్ అదనంగా పొందుతున్నాడు. నేను అతనితో స్టెప్ అప్ చేసుకోవచ్చా?

.జవాబు: మీ మిత్రుడు ఎస్.జి.టి లో మీ కంటి జూనియర్ అయి ఉంటే జివో.93 ఆర్ధిక తేది 3.4.10 ప్రకారం స్టెప్పీంగ్ ఆఫ్ పే చేసుకోవచ్చు.

16 ప్రశ్న: నాకు PRC 2010 స్కేళ్ళలో తేది 1.7.08 కి జూనియర్ తో స్టెప్ అప్ జరిగింది నా ఇంక్రిమెంట్ తేది. 1.1.09 మరియు నా జూనియర్ ఇంక్రిమెంట్ తేది 1.4.09. మా M EO గారు నాకు తేది. 1.1.09 కి ఇంక్రిమెంట్ మంజూరు చేసారు. కానీ ట్రెజరీ వారు జూనియర్ ఇంక్రిమెంట్ తేది ఐన 1.4.09 కి మాత్రమె ఇంక్రిమెంట్ వస్తుంది అని అభ్యంతరం పెట్టినారు ఇది సరియైనదేనా?

జవాబు: ఆడిట్ వారి అభ్యంతరం సరియైనది కాదు స్టెప్ అప్ అనంతరం సీనియర్ ఇంక్రిమెంట్ తేది కొనసాగుతుంది. ఒకవేళ జూనియర్ ఇంక్రిమెంట్ తేది సీనియర్ తేది కంటే ముందుగా ఉంటే ఆ తేదీకి సీనియర్ కు ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. కనుక మీకు తేది. 1.1.2009 కి ఇంక్రిమెంట్ ఇవ్వటం సరియైనదే

17.ప్రశ్న: నేనునా మిత్రుడు 96 డి.ఎస్.సి లో ఎస్.జి.టి. లు గా ఎంపికై 13.2.97, 12.2.87 న ఉద్యోగం లో చేరాము. నేను 1.2.09 అతను 28.6.2010 న ఎస్.ఏ. (బయో సైన్సు ) గా ప్రమోషన్ పొందాము. ఇరువురికి ఎఫ్ఆర్ (22) "బిప్రకారం ప్రమోషన్ పోస్టులో వేతన స్థిరీకరణ జరిగింది కానీ అతను 12 సంవత్సరాల స్కేలు తీసుకుని ప్రమోషన్ పొందడం వల్ల నాకంటే ఒక ఇంక్రిమెంట్ అదనంగా పొందుచున్నాడు. నాకు అతని తో స్టెప్ అప్ కు అవకాసం ఉన్నదా?

 జవాబు: ఉన్నది. ఎస్.జి.టి. గా కుడా మీ మిత్రుని కంటే మీరు సీనియర్ అయిన యెడల జి.వో. 93 ఆర్ధిక తేది 3.4.10 లోని రూల్ 3(C)(V) ప్రకారం మీరు స్టెప్పీంగ్ ఆఫ్ పే పొందటానికి అర్హులు.

18. ప్రశ్న: నేను 311096 నుండి ఎస్.జి.టి. గా పనిచేస్తూ 322009 న ఎస్.ఏ (మార్చ్) ప్రమోషన్ పొందాను. జూనియర్ తో స్టెప్ అప్ తీసుకున్నాను అతని ఇంక్రిమెంట్ తేది నవంబర్ . నాకు ఇంక్రిమెంట్ అక్టోబర్ లో వస్తుందానవంబర్ లో వస్తుందా? (ii) ఒక సంవత్సరం దాటితే స్టెప్ అప్లోపైతే ప్రీ పోస్మేంట్ అంటున్నారు.కరక్టేనా?

జవాబు: అక్టోబర్ లోనే వస్తుంది జి.వో. 93 ఆర్ధిక తేది 3.4.1 ప్రకారం 17.08 తరువాత జూనియర్ వేతనం తో సమానం గా సీనియర్ వేతనాన్ని స్టెప్ అప్ చేసిన సందర్భం లో సీనియర్ కు ఇంక్రిమెంట్ ఎప్పుడు ఇవ్వాలి అన్న విషయం ప్రస్తావించలేదు. కనుక సాధారణ ఇంక్రిమెంట్ తేది నే కొనసాగుతుందని భావించాలి.

 ii) ఆ బావన సరియైనది కాదు. RPS 2010 ఫిక్సేషన్ కన్నా ముందు సీనియర్ వేతనం ఎక్కువగానుజూనియర్ వేతనంతక్కువ గాను ఉండి, RPS 2010 ఫిక్సేషన్ నాడు ఒకే స్టేజ్ వద్ద ఫిక్సేషన్ జరిగి జూనియర్ ముందుగా ఇంక్రిమెంట్ పొందుతూ ఉన్న యెడల సీనియర్ ఇంక్రిమెంట్ ను కుడా జూనియర్ తో సమానం గా అదే నెలలో విడుదల చేయడాన్ని ప్రీపోన్ మెంట్ అంటారు. ఒక క్యాడర్ నుండి మరొక క్యాడర్ కు ప్రమోషన్ పొందిన సందర్భం లో సీనియర్ ఎఫ్.ఆర్. 228 లేదా ఏ.ఏ.ఎస్. ప్రయోజనం పొందకుండా ప్రమోటైజూనియర్ ఆ ప్రయోజనం పొందిన తరువాత ప్రమోటైనందున అదనంగా వేతనం పొందుతున్న యెడల సీనియర్ వేతనాన్ని జూనియర్ తో సమానం చేయడాన్ని స్టెప్ అప్ అంటారు.

19.ప్రశ్న: నేను, నా మిత్రునితో స్టెప్ అప్ తీసుకున్నాను తరువాత అతను మరొకరితో ప్రేపొంమేంట్ తీసుకుని 11 నెలలు ముందుగా ఇంక్రిమెంట్ పొందుతున్నాడు. నేను కుడా మరల నా మిత్రునితో ప్రీపోస్మేంట్ చేసుకోవచ్చా?

 జవాబు: మీరు 17.08 నాడు జి.వో 52, ఆర్ధిక తేది 25.2.1 ప్రకారం స్టాప్ అప్ తీసుకున్న అనంతరం ఆర్.పీ.ఎస్ 2010 లో ఇరువురి వేతనం ఒకే స్టేజి లో ఫిక్సేషన్ జరిగిన యెడల , మీకు మీ మిత్రుని ఇంక్రిమెంట్ తేది కే ఇంక్రిమెంట్ లభిస్తుంది ఆ తరువాత ఆయన తనకంటే జూనియర్ (నిబంధనల ప్రకారం ) ప్రీ పోస్మేంట్ తీసుకుంటే మీకు కూడా అది వర్తిస్తుంది

20.ప్రశ్న: నేను 2001 డి.ఎస్.సి. ద్వారా జనవరి2002 నుండి ఎస్.జి.టి గా పని చేస్తున్నాను ఆర్.పీ.ఎస్. 2010 ఫిక్సేషన్ అనంతరం అక్టోబర్ 2002 లో నియామకమైన ఉపాధ్యాయునితో ఇంక్రిమెంట్ ప్రేపొంమెంట్ తీసుకున్నాను. 2001 లో నియామకమైన వారు కొందరు వారి ఇంక్రిమెంట్ జులై కి ప్రేపొంమేంట్ చేయించుకున్నారు. నేను మరల వారితో సమానం గా ప్రేపొంమేంట్ చేసుకోవచ్చా?

 జవాబు: అవును. చేసుకోవచ్చు.

 

 

                ఇంక్రిమెంట్లు

• ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు.

• ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిపిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.

* APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంట్లు చెల్లించారు. *(G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)*

• నెల మద్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.

*(G.O.Ms.No.133 Fin Dt:13-05-1974)* *(G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)*

• DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన | సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ధరించబడతాయి.

• ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరుచేయాలి. *(Memo.No.49463 Dt:06-10-1974)*

• ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది. *Eg: ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.*

• నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది. • వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.

ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము

-ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం. -అన్ని రకాల సెలవులు(జీత నష్టపు సెలవు తప్ప) -డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.

-అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.

-పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.

-డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము. -అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం. -పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది. -ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం. - ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)

ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం:-

-జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు.సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.

- జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భమూ

-వైద్య కారణాలపై,శాస్త్ర, సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది (ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు) *(FR-26(2)) & G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)*

- 6 నెలల కంటే ఎక్కువ జీనష్టపు సెలవు వాడుకున్న సంధర్బాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.

ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు:

తప్పుడు ప్రవర్తనా,విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.

            Without Cumulative Effect:

FR-24(1) ప్రకారం కేవలం ఒక సం || మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు.అంటే సదరు ఉద్యోగి ఒక సం || పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.

                With Cumulative Effect

- దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి.సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలి. ఉద్యోగికి చార్జిషీటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి.ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.

ఇంక్రిమెంట్లు-రకాలు:

స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు.

-తక్కువ వేతన స్కేలు యందు ఎక్కువ కాలం పనిచేసే ఉద్యోగులుకు వారి వేతన స్కేల్ లలో గరిష్ఠం చేరుకునే అవకాశం ఉంది. అటువంటి వారు భవిష్యత్తు లో ఇంక్రిమెంట్లు లేక అదే వేతనంపై పదవీ విరమణ పొందేవరకు లేదా వేతన స్కేలు మారే వరకు పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి వారికి న్యాయం చేసేందుకు స్థాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేస్తారు. ఈ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను అన్ని రకాల సౌలభ్యాల కొరకు (ఫికేషన్ ప్రమోషన్లు, AA5)లకు పరిగణిస్తారు. 10వ ఏ.అర్.న లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయబడ్డాయి. *GO.Ms.No.152F&P Dt:04-1-2000)* *(G.O.Ms.No.25 F&P Dt:18-03-2015)*

ప్రిపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్

-ఉద్యోగుల వేతన స్థిరీకరణ సందర్భాలలో గాని,పదోన్నతి పొందిన స్థితిలో గాని,వేతన నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు,జూనియర్,సీనియర్ ఉద్యోగుల వేతనం ఒకే స్కేలు లో ఒకే దశ యందు వేతన స్థిరీకరణ కాబడి సీనియర్ ఉద్యోగి కంటే జూనియర్ ఉద్యోగి ఎక్కువ వేతనం పొందుతున్న సందర్భంలో సీనియర్ ఉద్యోగి ఇంక్రిమెంట్ తేదీని జూనియర్ ఇంక్రిమెంట్ తేదికి ప్రీపోన్ చేయబడి వేతన రక్షణ కలుగజేయుట నే ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అందురు.

ఇంక్రిమెంట్లు కొన్ని ముఖ్యాంశాలు

- ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్ ఏ నెలలో ఉన్నదో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక రిజిస్టరు (ఇంక్రిమెంటు వాచ్ రిజిష్టర్), నిర్వహించాలి.

- ఉద్యోగి తన వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయాలని విన్నవించుకోనవసరం లేదు.గడువు తేదీన డ్రాయింగ్ అధికారే సర్టిఫికెట్ పై స్వయంగా సంతకం చేయాలి. *(Memo.No.1696577/A&L/185 Dt:13-02-1987)*

- అర్జిత సెలవు లో (EL) కొనసాగుతూ మరణించినా,రిటైర్ అయినా సెలవు కాలంలో మొదటి 120 రోజులలో డ్యూ ఉన్న ఇంక్రిమెంట్ పెన్షన్, గ్రాట్యూటీలకు లెక్కించబడుతుంది.

- డైస్ నాన్ గా పరిగణించిన కాలము ఇంక్రిమెంట్లకు పరిగణించబడదు- *FR 18*

-ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి రోజున ఇంక్రిమెంట్ 'డ్యూ' ఉంటే దానిని నేషనల్ గా పరిగణించాలి.పెన్షనరీ ప్రయోజనాలకు లెక్కించాలి.కాని పదవీ విరమణ తరువాత చెల్లించే ఫైనల్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఎర్స్ డ్ లీవ్ కు ఈ నోషనల్ ఇంక్రిమెంట్ పరిగణలోకి తీసుకోరాదు. ) *(G.O.Ms.No.352 Fin Dt:27-10-1998)*

-ఏదైనా పరీక్షా లేదా టెస్టు వల్ల ప్రభుత్వ ఉద్యోగికి ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష తేది నుండి మంజూరైనట్లుగా భావించాలి.

 

 

                                     కమ్యూటేషన్ (COMMUTATION): 

ఉద్యోగికి లభించే పింఛను నుంచి 40% మించకుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్దతినే "కమ్యూటేషన్" గా పరిగణిస్తారు.

    ఈ పద్దతి 1-4-1999 నుండి అమలులోకి వచ్చింది.1-4-1999 తేదీన గాని,అటు తర్వాత గాని పదవీ విరమణ గాని,చనిపోయిన ఉద్యోగి విషయంలో గాని ఈ సూత్రం వర్తిస్తుంది.
(G.O.Ms.No.158 F&P తేది:1-4-1999)

        శాఖాపరమైన న్యాయస్థానాలలో గనుక ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు.
(Rule 3(3) of Commutation Rules 1994)

              కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరంలేదు.ప్రభుత్వం 
G.O.M.No.263 తేది:23-11-1998 ద్వారా నిర్దేశించిన పింఛను ఫారంలోనే,పింఛనుతో పాటు కమ్యూటేషన్ ను కూడా తెలియజేయవచ్చు.
(G.O.Ms.No.356 F&P తేది:28-11-1989)

            పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తరువాత తగ్గిన పెన్షన్ 15సం॥ తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పింఛను వస్తుంది.ఈ విధంగా మరల పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూట్ చేయు అవకాశం లేదు.
(G.O.Ms.No.44 F&P తేది:19-02-1991)

          15 సం॥ కాలపరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేది నుంచి గానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమ్మని జారీచేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత గానీ ఏది ముందైతే ఆ తేది నుండి లెక్కిస్తారు.
(G.O.Ms.No.324 F&P తేది:20-08-1977)

                కమ్యూటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణము చేతనైనా పెన్షన్ సవరించినయెడల,తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువ అయిన సందర్భాలలో తదనుగుణంగా పెరిగినటువంటి కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసియుంటుoది.
(G.O.Ms.No.392 F&P తేది:02-12-1993)

          కమ్యూటేషన్ మొత్తానికి,గ్రాట్యూటి మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు.ఎంతమేరకు అర్హులో అంతవరకూ పొందవచ్చు.

 

                         పబ్లిక్ సెలవులు అనుసంధానం (SUFFIX)

      ఒక ఉద్యోగికి మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా 20-11-2015 నుండి 13-12-2015 వరకు సెలవు.ఆ వెంటనే వచ్చిన 14-12-2015,15-12-2015 పబ్లిక్ సెలవులు వినియోగించుకుటకు అనుమతించనైనది.ఆ ఉద్యోగి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ జతపరుస్తూ 16-12-2015 తేదీన డ్యూటీలో చేరాడు.

     అట్టి సందర్భoలో:

a) డాక్టర్ జారీచేసిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ 16-12-2015 తేదీన జారీచేసిన యెడల 14-12-2015 మరియు 15-12-2015 తేదిలలో వున్న పబ్లిక్ హాలిడేస్ సెలవుకు అనుసంధానం (suffix) చేయుటకు వీలులేదు.

b) ఒకవేళ డాక్టర్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ 13-12-2015 తేదీన జారీచేసిన యెడల పబ్లిక్ హాలిడేస్ అయిన 14-12-2015 మరియు 15-12-2015 రెండు రోజులు సెలవుకు అనుసంధానం(suffix) చేసుకొనవచ్చును.

c) ఒకవేళ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ 14-12-2015 తేదీన గానీ లేక 15-12-2015 తేదీన గాని జారీచేసిన యెడల ఆ రెండు రోజులు సెలవుగా పరిగణించాలి.

 

 

SHORT TERM HOLIDAYS   SUFFIX – PREFIX  పై వివరణ

15 రోజులు మించిన సెలవు కాలాన్ని *వెకేషన్* అంటారు. 

 15 రోజుల లోపు సెలవులను  మిడ్ టర్మ్ హాలిడేస్  అంటారు.

 10 రోజులకు పైబడి 15 రోజులకు మించని మిడ్ టర్మ్ సెలవుల సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున, తెరిచే రోజున తప్పక హాజరుకావాలి.

(Rc .No.10324/E4-2/69,Dt :7-11-1969) 

 మిడ్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల లోపు ఉన్న సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున లేదా తెరిచే రోజున* గైర్హాజరు అయిన సందర్భం లో సాధారణ సెలవు(CL) పెట్టుకొనవచ్చును.

 

 సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్:-

     1.  FR-55 ప్రకారం సస్పెండు అయిన ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదు.

సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూన్నట్లయితే అతనికి పదోన్నతి(Promotion) కల్పించటకు అవకాశము లేదని ప్రభుత్వం G.O.Ms.No.257 తేది:10-06-1999 ద్వారా తెలియజేసింది.

       2.ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో పదవీ విరమణ వయస్సు వచ్చినయెడల అతనిపై ఉన్న క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో ఉన్న యెడల అట్టివానికి భంగం కలగకుండా ఆ ఉద్యోగిని పదవీ విరమణ గావించవలెను.
(G.O.Ms.No.64 F&P తేది:01-03-1979)
(Section 3 of A.P.Public Employment of age of super annuation Act 1984)

   3.సస్పెన్షన్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు పుర్తిగాకుండా అసంపూర్తిగా ఉన్న సమయంలో సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి చనిపోయిన యెడల,సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించవలెనని ప్రభుత్వం G.O.Ms.No.275 F&P తేది:08-08-1997 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

   4.AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 లోని రూలు.30 ప్రకారం సస్పెన్షన్ ఉన్న ఉద్యోగి క్రమశిక్షణా చర్యల గురించి విచారణ పూర్తికాకముందే ఏ కారణము చేతనైన తన పదవికి రాజీనామా చేసిన యెడల అట్టి రాజీనామా అంగీకరించకూడదు.

  5.రెండు సం. కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి యొక్క క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో పెడుతూ వెంటనే సర్వీసలోకి పునరుద్దరించవలెను. కొన్ని ప్రత్యేక పరిస్థితులలలో మాత్రమే సస్పెన్షన్ కొనసాగిన్చవచ్చు.
(G.O.Ms.No.526 GAD తేది:19-08-2008)

   6.సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి జీవనాధారంగా వున్న ఉద్యోగం ద్వారా జీతభత్యాలు పొందు అర్హత ఉండదు కాబట్టి,అట్టి ఉద్యోగికి జీవనాధారంగా భత్యములు చెల్లించు అవకాశం FR-53 లోని నియమ నిబంధనలకులోబడి చెల్లించే విధానాలు ప్రభుత్వం కల్పించింది.

  7.సస్పెండ్ అయిన ఉద్యోగిని తిరిగి సర్వీసులో పునరుద్దరించే Resistance)సందర్భంలో జారీచేయవలసిన ఉత్తర్వుల ఫారం ప్రభుత్వం G.O.Ms.No.82 GAD తేది:01-03-1996) ద్వారా నిర్దేశించింది.

  8.సస్పెండ్ అయిన ఉద్యోగి తాను సస్పెండ్ అయిన తర్వాత ఏ విధమైన ఉద్యోగం గాని/వృత్తి గాని/వ్యాపారం గాని యితరత్రా వ్యాపకం గాని చేయటం లేదని ధృవీకరణ పత్రము అధికారికి అందజేయవలెను.

   9.జీవనాధార భత్యము సస్పెండ్ అయిన ఉద్యోగికి తిరస్కరించరాదు. జీవనాధార భత్యము(Subsistance Allowance) చెల్లింపులు తిరస్కరించటం శిక్షించదగ్గ నేరము.
(Govt.memo.no.29730/A/458/A2/FR-II/96/F&P తేది:14-10-1996)

  10.సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీలో లేని కాలం(Non Duty) గా పరిగణించినప్పుడు ఉద్యోగి అభ్యర్ధనమేరకు సెలవుగా మార్పు (Convert) చేసినపుడు అతని సెలవు జీతములో నుంచి అతనికి ఇదివరకే చెల్లించియున్న జీవనభృతి లో మొత్తం రికవరీచేయాలి.

  11.ఉద్యోగిని చిన్న కారణాల వల్ల న్యాయ సమ్మతము గాని సస్పెండ్ చేసే బదులు అతనిని బదిలీచేయవచ్చు. అట్టి బదిలీ కాబడిన ఉద్యోగి బదిలీ కాబడిన కొత్త స్థానంలో చేరకుండా సెలవు పెట్టిన యెడల అట్టి సెలవు మంజూరుచేయకూడదు.
(Govt.circular.memo.no.595SP/B/2000 తేది:21-09-2000 & Govt.memo.no.1733/ser.C GAD 03-08-1967)

    12.ఉద్యోగులను సర్వసాధారణమైన సామాన్య కారణాలపై అనవసరంగా సస్పెండు చేయకూడదు.ఆ విధంగా సస్పెండు కాబడిన ఉద్యోగికి జీవనాధార భృతి చెల్లించటమే కాకుండా,అతని సేవలు కూడా ప్రభుత్వం పోగొట్టుకుంటుoది. అందువలన అనవసర కారణాల వల్ల ఉద్యోగిని సస్పెండు చేయకూడదు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
(Govt.memo.no.2213/ser.C/66-1 GAD తేది:30-11-1966 & memo no.4993/police-C/69-1 తేది:08-12-1969

 

 

         ఉద్యోగులు వారికి లభించే వివిధ రకాల ప్రయోజనాలు

   ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు వేతనంతోపాటు ఎన్నో ప్రయోజనాలు అందుకుంటుంటారు.నిజానికి పే స్కేల్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఉద్యోగం చేసే వారు ఎందరో ఉన్నారు.అంతేకాదు, వేతన భత్యాల విషయంలోనూ పూర్తి అవగాహన ఉన్నవారు కొద్ది మందే.ఈ నేపథ్యంలో ఉద్యోగులకు అందే వేతన భత్యాలు, ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

                                             బేసిక్ శాలరీ (మూలవేతనం):
బేసిక్ శాలరీ అనేది ఫిక్స్ డ్ శాలరీ.అంటే తప్పనిసరిగా చెల్లించేటటువంటి వేతనం.ఉద్యోగి చేరినప్పుడు నిర్ణయించేది.సాధారణంగా చెల్లించే వేతనంలో 30 నుంచి 60 శాతం వరకు బేసిక్ పే గా ఉండవచ్చని చట్టం చెబుతోంది.గ్రాస్ శాలరీ ఎంత ఉంటుందో బేసిక్ పే అందులో 30 శాతానికి తగ్గకుండా ఉంటుంది.

                                                     పే స్కేల్:
ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వారి ఉద్యోగ స్థాయి, ర్యాంకును బట్టి పే స్కేళ్లు ఉంటాయి.ఉదాహరణకు 10000-470/6-12820-500/3-14320-560/7-18240 ఇదొక పే స్కేల్.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల్లో ఈ పే స్కేల్స్ ను పేర్కొనడాన్ని చూస్తుంటాం. ఉదాహరణకు ఇక్కడ పేర్కొన్న పే స్కేల్ లోని అంకెల మర్మం ఏంటో చూద్దాం. మొట్ట మొదటగా ఉన్న 10వేల రూపాయలు బేసిక్ పే.అంటే ఇతరత్రా ఎలాంటి అలవెన్స్ లు కాకుండా ఉద్యోగి ఉద్యోగంలో చేరిన వెంటనే అందుకునే మొత్తం.ఆ తర్వాత ఉన్న 470 అనేది ఏడాది ఉద్యోగ కాలం తర్వాత ఇచ్చే ఇంక్రిమెంట్.470/6 అని ఉంది కదా అంటే 470 చొప్పున ఏడాదికోసారి అలా ఆరేళ్లపాటు ఇంక్రిమెంట్ వస్తుంది.దాంతో ఆరేళ్ల తర్వాత ఆ ఉద్యోగి వేతనం బేసిక్ పేకి ఆరు ఇంక్రిమెంట్లు కలుపుకుంటే 12820 రూపాయలు వస్తుంది.దాని తర్వాత 500/3 ఉంది కదా అంటే ఏడవ ఏట పూర్తి అయిన తర్వాత నుంచి మూడేళ్ల పాటు ఏటా 500 రూపాయల చొప్పున ఇంక్రిమెంట్ వస్తుంది.దాంతో వేతనం 14320కు చేరుకుంటుంది అన్నమాట.ఆ తర్వాత ఏటా 560 ఇంక్రిమెంట్ చొప్పున (560/7) ఏడు సంవత్సరాల పాటు ఇంక్రిమెంట్ ఇస్తారు.దాంతో 16 ఏళ్ల సర్వీసు తర్వాత ఆ ఉద్యోగి వేతనం 18240గా ఉంటుంది.ఇది సంబంధిత ఉద్యోగ స్థాయికి చివరి బేసిక్ పే అన్నమాట.సాధారణంగా పే స్కేల్స్ లో బేసిక్ పే అన్నది ఉద్యోగ హోదా, స్థాయిని బట్టే ఉంటుంది.అదే విధంగా ఉన్నత స్థాయి ఉద్యోగులైతే వారికి లభించే ఇంక్రిమెంట్ల మొత్తం కూడా ఎక్కువగానే ఉంటుంది.దీంతో వారి పే స్కేల్ మరోలా ఉంటుంది.ఏడవ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిష్ఠ వేతనం 18 వేలు కాగా గరిష్ఠ వేతనం 2.5 లక్షలుగా ఉంది.

                                                          సీటీసీ:
ఉద్యోగాలకు అప్లయ్ చేసుకున్నప్పుడు అభ్యర్థులు సాధారణంగా ఎదుర్కొనే ప్రశ్న వాట్ యువర్ కరెంట్ సీటీసీ (CTC)?? సీటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ.ఒక ఉద్యోగిపై ఒక ఏడాది కాలంలో ఆ కంపెనీ వెచ్చిస్తున్న వ్యయం మొత్తాన్ని సీటీసీగా పేర్కొంటారు.కొందరు ఈ విషయం తెలుసుకోకుండా సీటీసీ ఎంత అని అడగ్గానే శాలరీ ప్యాకేజీ చెబుతుంటారు.కానీ అది తప్పు.వేతనంతోపాటు అందుకుంటున్న అన్ని రకాల ప్రయోజనాలను కలుపగా వచ్చే మొత్తమే సీటీసీ.గ్రాస్ శాలరీ,ఈపీఎఫ్,బోనస్,సబ్సిడీ ప్రయోజనాలు ఇలా అనమాట.

                                                       అలవెన్స్ లు:
కంపెనీ లేదా సంస్థ-ఉద్యోగి అనుబంధంలో భాగంగా అందుకునే నగదును వేతనంగా పేర్కొంటారు.ఫ్రీలాన్సర్ గా పనిచేసేవారు,లేదా కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే వారి ఆదాయం వేతనం కింద పరిగణించరు.వీరి ఆదాయాన్ని వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయంగానే పరిగణిస్తారు.

బేసిక్ శాలరీ అనేది ఫిక్స్ డ్ గా ఉంటుంది.గ్రాస్ శాలరీ అంటే ఉద్యోగి చేతికి అందేది కాదు. ఈపీఎఫ్,ఈఎస్ఐ సహా ఎలాంటి కోతలు లేకుండా బేసిక్ శాలరీకి అన్ని అలవెన్స్ లు జోడించగా వచ్చే మొత్తం.వేతనంతోపాటు ప్రతీ ఉద్యోగికి పలు రకాల అలవెన్స్ లు ఇస్తుంటారు.బేసిక్ పే,గ్రేడ్ పే,డేర్ నెస్ అలవెన్స్,ఇతర అలవెన్స్ లు (ఫోన్, ట్రావెల్ అలవెన్స్).ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ లేదా వాహనంలో పికప్ సదుపాయం.హెచ్ ఆర్ ఏ లేదా ఉచిత నివాస సదుపాయం.చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్,లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.సాధారణంగా ఉద్యోగ కేటగిరీని బట్టి ప్రభుత్వ ఉద్యోగులకు గ్రేడ్ పే ఉంటుంది.

                               డియర్ నెస్ అలవెన్స్ (కరవు భత్యం):

 ద్రవ్యోల్బణ ప్రభావంతో పెరుగుతున్న జీవన వ్యయాన్ని తట్టుకునేందుకు వీలుగా ఈ అలవెన్స్ ను బేసిక్ పే కు కలుపుతుంటారు.బేసిక్ శాలరీపై కొంత శాతం చొప్పున ఇస్తుంటారు.

                                హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ ఆర్ఏ):
ఉద్యోగం చేస్తున్న ప్రాంతం నగరమా,పట్టణమా? అన్నదాన్ని బట్టి హెచ్ ఆర్ఏ ఉంటుంది.హెచ్ ఆర్ఏ కూడా బేసిక్ శాలరీ (మూల వేతనం)పైనే లెక్కిస్తుంటారు.

                                                     ఎల్టీసీ/ఎల్టీఏ:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండేళ్ల కోసారి స్వస్థలం లేదా ఆయా రాష్ట్రం పరిధిలో ఏదేనీ ప్రాంతానికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే ఇండియాలో ఏదో ఒక ప్రాంతానికి ప్రభుత్వ ఖర్చుతో వెళ్లి రావచ్చు.కొన్ని కార్పొరేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగులకు ఎల్టీసీ సదుపాయాన్ని అందిస్తున్నాయి.

                                                             ఈపీఎఫ్:

బేసిక్ శాలరీ,డీఏను కలుపగా వచ్చిన మొత్తానికి 12 శాతాన్ని ఈపీఎఫ్ కింద మళ్లిస్తుంటారు.ఇందులో కొంత మొత్తాన్ని పెన్షన్ ఫండ్ కు జమ చేస్తుంటారు.

                                               కన్వేయన్స్ అలవెన్స్ (సీఏ):

దీన్ని ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ గానూ పేర్కొంటారు.ఉద్యోగి తన నివాసం నుంచి కార్యాలయానికి వచ్చి వెళ్లేందుకు వీలుగా అయ్యే వ్యయాన్ని భర్తీ చేసుకునేందుకు ఇచ్చే అలవెన్స్.వాస్తవానికి ఉద్యోగి నివాసం నుంచి కార్యాలయం ఎంత దూరంలొ ఉంది? ఏ రవాణా వ్యవస్థ ద్వారా వస్తున్నారు? ఎంత వ్యయం అవుతుంది? అనే దాని ఆధారంగా ఈ అలవెన్స్ మొత్తాన్ని నిర్ణయిస్తారు.లేదా వేతన స్థాయిని బట్టి కూడా నిర్ణయిస్తుంటారు. ఆదాయపన్ను చట్టం ప్రకారం నెలకు 800 రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంది.

                                        సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్:
మెట్రో నగరాల్లో పని చేసే ఉద్యోగులు అక్కడి అధిక వ్యయాన్ని తట్టుకునేందుకు వీలుగా ఈ అలవెన్స్ ను ఇస్తుంటారు.ఇది పన్ను విధించతగ్గ ఆదాయం.

                                           ఫారీన్ అలవెన్స్:
ఇది దేశం బయట పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అలవెన్స్.

                               చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్:
ఉద్యోగులు తమ పిల్లల విద్యకు అయ్యే వ్యయాన్ని భర్తీ చేసుకునేందుకు వీలుగా ఈ అలవెన్స్.

                                 ఓవర్ టైమ్ అలవెన్స్:
ఉద్యోగి నిర్ణీత పనివేళలకు మించి అదనంగా చేసే పనికి గాను ఓటీ అలవెన్స్ ఇస్తుంటారు.

                                         రీటెయనింగ్ అలవెన్స్:
కంపెనీ పని చేయకపోయినా ఉద్యోగులను అట్టిపెట్టుకునేందుకు వీలుగా రీటెయినింగ్ అలవెన్స్ ఇస్తుంటారు.

                                    మెడికల్ అలవెన్స్:
కంపెనీ పాలసీకి అనుగుణంగా ఉద్యోగుల వైద్య ఖర్చుల కోసం గాను ఇచ్చే అలవెన్స్ ఇది.

                               యూనిఫామ్ అలవెన్స్:
సంబంధిత ఉద్యోగంలో యూనిఫామ్ నిబంధన ఉంటే (ఉదాహరణకు పోలీసు, ఫైర్) వారి హోదా,ఉద్యోగ స్థాయిని బట్టి యూనిఫామ్ అలవెన్స్ ఇస్తుంటారు.

ఇంటీరియమ్ అలవెన్స్:
కొన్ని సంస్థలు వార్షిక సంవత్సరంలో మధ్యంతరంగా అలవెన్స్ ను ఇచ్చే అవకాశం ఉంది.

                                                 క్యాష్ అలవెన్స్/మ్యారేజీ గిఫ్ట్: 
కంపెనీ ఉద్యోగులు వివాహం చేసుకున్న సందర్భాల్లో కొంత మొత్తాన్ని క్యాష్ అలవెన్స్ కింద ఇస్తుంటాయి.లేదా గిఫ్ట్ రూపంలోనూ ఇవ్వవచ్చు.

                                        ఫిక్స్ డ్ మెడికల్ అలవెన్స్:
ఉద్యోగుల కుటుంబ సభ్యులు జబ్జున పడితే అయ్యే వ్యయాన్ని తట్టుకునేందుకు వీలుగా ఈ అలవెన్స్ ను మంజూరు చేస్తుంటారు.

                                                           పెర్క్స్:
అలాగే ఉద్యోగులకు ఇతరత్రా ఏవైనా ప్రయోజనాలు లేదా వసతులను ఉచితంగా లేదా కొంత తగ్గింపు ధరలకు కంపెనీలు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తుంటాయి.ఉదాహరణకు నివాస వసతి,కారు వసతి,గ్యాస్,ఎలక్ట్రిసిటీ,నీటి వ్యయాన్ని తిరిగి చెల్లించడం,క్లబ్ వసతి,వైద్య ఖర్చులను తిరిగి చెల్లించడం లేదా పాక్షికంగా భరించడం,వడ్డీ లేని రుణాలు లేదా తక్కువ వడ్డీకే రుణాలు,టెలిఫోన్,పేపర్ బిల్లులు చెల్లించడం వంటివి.ఇవి కాకుండా ఉద్యోగి బదిలీ అయిన సందర్భాల్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే అయ్యే రవాణా వ్యయాన్ని కూడా కొన్ని కంపెనీలు చెల్లిస్తుంటాయి. ఇంకా ఉద్యోగుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెక్షన్ 14(ఐ) ప్రకారం ప్రత్యేక అలవెన్స్ కూడా ఇస్తుంటారు.ఇవే అని కాదు కొన్ని కంపెనీలు,సంస్థలు ఉద్యోగులను సంతుష్టపరిచి మరింత ప్రతిఫలం రాబట్టుకునేందుకు వీలుగా ఎన్నో రకాల ప్రయోజనాలను స్వచ్చందంగా అందిస్తుంటాయి.

                                                          బోనస్:
ప్రతీ కంపెనీ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 ప్రకారం ఉద్యోగులకు తమ లాభాల్లో కొంత మొత్తాన్ని బోనస్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని మార్పులు కూడా చేసింది.దాని ప్రకారం 10వేల రూపాయల నుంచి 21వేల రూపాయల్లోపు వేతనం ఉన్న వారు బోనస్ అందుకునేందుకు అర్హులు.

                                                             గ్రాట్యుటీ:
ప్రతీ ఉద్యోగికి పదవీ విమరణ సమయంలో కంపెనీలు తప్పనిసరిగా అందించాల్సిన ప్రతిఫలం ఇది.ఆ ఉద్యోగి కంపెనీలో ఎన్ని సంవత్సరాలు సేవలు అందించారో ప్రతి ఏడాదికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీగా ఇవ్వాలని చట్టం చెబుతోంది.10 మంది అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఈ నిబంధన పరిధిలోకి వస్తాయి.

                                               ఈఎస్ఐ/ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ:
15వేల రూపాయల కంటే తక్కువ వేతనం అందుకునే ఉద్యోగులకు కంపెనీలు ఈఎస్ఐ సౌకర్యాన్ని అందించాల్సి ఉంటుంది. ఉద్యోగి,సంస్థ చెరి కొంత శాతాన్ని ఈఎస్ఐ సంస్థకు నెలనెలా చెల్లించాల్సి ఉంటుంది.తద్వారా తక్కువ వేతనం గల ఉద్యోగులకు ఈఎస్ఐ సంస్థ అన్ని రకాల వైద్య సౌకర్యాలను అందిస్తుంది. ఈఎస్ఐ పరిధిలో ఉన్న ఒక ఉద్యోగి అనారోగ్యం పాలైన సందర్భాల్లో ఎంత ఖరీదైన వైద్యాన్నైనా నయమయ్యే వరకు ఉచితంగా పొందవచ్చు.15వేల రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారికి కంపెనీలు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తుంటాయి.అందుకయ్యే ఖర్చును పూర్తిగా ఉద్యోగి వేతనం నుంచి మినహాయించడం,లేదా ఉచితంగా లేదా కొంత మొత్తాన్ని కంపెనీలు భరిస్తుంటాయి.అలాగే,పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ(వ్యక్తిగత ప్రమాద బీమా)ను కూడా అందిస్తుంటాయి.

                                                               పెన్షన్ పాలసీ:
సాధారణంగా పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ కొంత మొత్తాన్ని పెన్షన్ గా అందిస్తుంది.ఒకవేళ ఈపీఎఫ్ సౌకర్యం లేని ఇతర వర్గాలు, ఈపీఎఫ్ సదుపాయం ఉన్నప్పటికీ కొద్ది మొత్తం పెన్షన్ చాలదనుకున్న వారు అదనంగా ఓ పెన్షన్ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.

                           సెలవులు ఎన్ని రకాలు?:

ఉద్యోగం,వ్యక్తిగత జీవితం ఈ రెండూ ముఖ్యమే.ఉద్యోగంతో పాటు వ్యక్తిగత,కుటుంబ అవసరాలకు కూడా తగినంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది.అందుకోసమే ఉద్యోగులకు సెలవుల విధానాన్ని అమలు చేసేది.

                             జాతీయ సెలవు దినాలు:
జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2. ఇవి అందరికీ ఉండే సాధారణ సెలవు దినాలు.

                           వారాంతపు సెలవు:
వారంలో ఏడు రోజులకు గాను ఒకటి లేదా రెండు రోజులు సెలవుగా ఇస్తుంటారు.కంపెనీ పాలసీని బట్టి ఒకటా రెండా అన్నది ఆధారపడి ఉంటుంది.ఎక్కువ శాతం ఒక్కరోజే సెలవుగా ఉంటుంది.

                            పండుగ దినాలు:
వివిధ మతాలకు సంబంధించి ముఖ్యమైన పండుగ రోజుల్లోనూ సెలువులు ఉంటాయి.

ఎర్న్ డ్ లీవ్ లేదా ప్రివిలేజ్ లీవ్ EL: ప్రతీ ఉద్యోగికి ఏడాదిలో ఇన్ని రోజులంటూ ఈఎల్ ఉంటాయి.గడచిన ఏడాదిలో ఎన్ని పనిదినాల పాటు సదరు ఉద్యోగి పనిచేశాడన్న దానిపై ఆధారపడి ఈ సెలవులు ఉంటాయి.ఈఎల్స్ ను వాడుకోనట్టయితే దాని కింద అదనపు వేతనాన్ని పొందవచ్చు.తీసుకుంటే ఆ రోజుల్లోనూ వేతనాన్ని (మూలవేతనం ప్రకారం) యథావిధిగా పొందవచ్చు.అయితే,సెలవులే తీసుకోవాలా? లేక పనిచేసి వేతనాన్ని పొందాలా? అన్నది కంపెనీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

                                                క్యాజువల్ లీవ్:
నెలలో ఇన్ని రోజుల పాటు క్యాజువల్ లీవ్ అని ఇస్తుంటారు.గరిష్ఠంగా మూడు రోజుల వరకు ఉంటుంది.కొన్ని సంస్థల్లో నెలకు ఒక్కటే క్యాజువల్ లీవ్ కూడా అప్లయ్ అవుతుంది.ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, 1988 ప్రకారం ఏడాదిలో 12 రోజుల పాటు ఈ లీవ్ ఇవ్వాల్సి ఉంటుంది.

                                     సిక్ లీవ్ లేదా మెడికల్ లీవ్: 
కార్యాలయానికి రాలేని అనారోగ్యానికి గురైన పరిస్థితులలో వాడుకునేందుకు వీలుగా ఈ లీవ్.తక్కువలో తక్కువ నెలకు ఒక్క రోజైనా సిక్ లీవ్ ఉంటుంది.ఒక నెలలో వాడుకోకపోతే అవసరం ఏర్పడినప్పుడు ఒకటికి మించి వాడుకోవచ్చు.

ఎన్ని రోజులు సెలవులుగా ఇవ్వాలన్న విషయాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, 1988 ప్రకారం ఏడాదిలో 12 రోజుల వరకు సిక్ లీవ్ ఇవ్వాల్సి ఉంటుంది.కనీసం ఏడాదిలో ఏడు రోజులను జాతీయ సెలవు,పర్వ దినాల కింద ఇవ్వాలని చెబుతున్నాయి.వాటిలో గణతంత్ర దినం,స్వాతంత్ర్యదినం,గాంధీ జయంతి తప్పనిసరిగా ఇవ్వాల్సినవి.

                                           కాంపెన్సేటరీ ఆఫ్/ సీఆఫ్:
సెలవు రోజుల్లో కూడా వచ్చి పని చేసినట్టయితే అందుకు గాను వేతనం చెల్లిస్తారు.లేదా మరో రోజు సెలవు కింద ఇస్తారు.

                                            మెటర్నిటీలీవ్:
మహిళా ఉద్యోగులు సంతాన అవసరాల కోసం (గర్భ ధారణ నుంచి డెలివరీ వరకు లేదా మరికొంత కాలం) మేటర్నిటీ లీవ్ ను ఇస్తుంటారు.ఎంత కాలం అన్నది కంపెనీలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని ప్రైవేటు కంపెనీలలో వేతనం లేకుండా ఈ లీవ్ ను మంజూరు చేస్తుంటారు. గర్భస్రావం అయిన వారికి కూడా ఈ లీవ్ ఇస్తుంటారు.కాకపోతే తక్కువ రోజుల పాటు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, 1988 ప్రకారం డెలివరీకి ముందు ఆరు వారాలు డెలివరీ తర్వాత ఆరు వారాలు కనీసం మేటర్నిటీ లీవ్ ఇవ్వాలి.

                                                        పేటర్నిటీ లీవ్:
పైన చెప్పుకున్న తరహాలో ఉద్యోగుల భార్యలు డెలివరీ అయిన సందర్భాల్లో వారి అవసరాలు చూసుకునేందుకు వీలుగా కొన్ని రోజుల పాటు ఉద్యోగులకు ఈ సెలవు ఇస్తుంటారు.

                                                  క్వారంటైన్ లీవ్:
ఇన్ఫెక్షన్ ఆధారిత వ్యాధికి లోనై ఆ వ్యాధి కంపెనీలోని ఉద్యోగులకు కూడా వచ్చే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో సదరు ఉద్యోగిని ఈ సెలవుపై పంపిస్తారు.

                                                హాఫ్ పే లీవ్:
ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ లీవ్ అందుబాటులో ఉంది.ఏడాది కాలం సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత ఈ లీవ్ మంజూరు అవుతుంది.ఈ లీవ్ పై విధులకు రాకపోయినా ప్రతి రోజూ వేతనంలో సగం మేర చెల్లిస్తారు.

                                              స్టడీ లీవ్:

ఉద్యోగి ఉన్నత చదువులు, వృత్తి పరమైన నాలెడ్జ్ పెంచుకునేందుకు వీలుగా ఈ సెలవు ఇస్తుంటారు. ఈ సెలవు కాలంలో వేతనం ఉండదు. అంటే ఉద్యోగం విడిచి పెట్టకుండా కొంత కాలం పాటు సెలవు తీసుకుని చదువుకోవచ్చు. ఇవే కాకుండా వివిధ రంగాలు, కంపెనీలను బట్టి చైల్డ్ కేర్ లీవ్, హాస్పిటల్ లీవ్, స్పెషల్ డిజేబిలిటీ లీవ్, చైల్డ్ అడాప్షన్ లీవ్, కమ్యూటెడ్ లీవ్, లీవ్ వితవుట్ పే /లాస్ ఆఫ్ పే (వేతనం లేకుండా తీసుకునే సెలవు) ఇలా భిన్న రకాల సెలవులు కూడా ఉన్నాయి.

        Leave management నందు సెలవులు ఎంటర్ చేయించుకొనుట కొరకు               

ప్రసూతి సెలవు: ( 180 రోజులు):

G.O.Ms.No.152 Fin తేది: 04.05.2010

పిత్రుత్వపు సెలవు: (15 రోజులు):

G.O.Ms.No.231 Fin తేది:16.09.2005

అబార్షన్ సెలవు: (42 రోజులు):

G.O.Ms.No.762 M&H తేది:11.08.1976

కుటుంబ నియంత్రణ సెలవులు:(పురుషులకు-6 రోజులు), (స్త్రీలకు-14 రోజులు)

G.O.Ms.No.1415 M&H 8.10.06.1968

సెలవులు: (07 రోజులు)కుటుంబ నియంత్రణ-భర్తకు

G.O.Ms.No.802 M&H తేది: 21.04.1972

హిస్టరెక్టమి సెలవులు: (45 రోజులు)

G.O.Ms.No.52 Fin తేది: 01.04.2011)

చైల్డ్ కేర్ లీవ్: (180రోజులు)

రక్తదానం సెలవు: (01 రోజు)

G.O.Ms.No.137 M&H తేది:23.02.1984

రీకానలైజేషన్ :

21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే అది

G.O.Ms.No.102 M&H తేది: 19.02.1981

క్యాజువల్ లీవ్స్: (15 రోజులు):

G.O.Ms.No.52 తేది: 04.02.1981

స్పెషల్ క్యాజువల్ లీవ్: (07 రోజులు)

G.O.Ms.No.47 Fin తేది: 19.02.1965

మహిళలకు ప్రత్యేక సి.ఎల్స్ (05 రోజులు)

G.O.Ms.No.374 Edn 8:16.03.1996

సంఘాల బాధ్యులకు స్పెషల్ సి.ఎల్స్ (21 రోజులు)

G.O.Ms.No.470 GAD 38:16.09.1994

సంపాదిత సెలవులు: (06 రోజులు సంవత్సరానికి)

G.O.Ms.No.317 Edn 8:15.09.1994

అర్ధవేతన సెలవులు:

(సం || కి 20 రోజులు) Rule 13(a) of 1933 Leave Rules

 

                       అర్ధవేతన సెలవులు  (Half Pay Leave)

           HALF PAY LEAVES

 ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.

 సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.
సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు.
*(G.O.Ms.No.165 Dt:17-08-1967)*

 

 ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు

.

 అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.

 అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.
1 వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)
2
 స్వంత వ్యవహారాలపై (Private Affairs)

 సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.

ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.

 

వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను *కమ్యూటెడ్ సెలవు* అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.
*{APLR 15(B) & 18(B}*

 

 కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచనైనది.
*(G.O.Ms.No.186 Dt:23-07-1975)*

 సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు *{Rule 15(B}*

 

 ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.

 వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.

 

 వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో 
వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.
*(Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)*
*(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)*

 

 అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడ వు.

 

 క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.
*(G.O.Ms.No.386 Dt:06-09-1996)*
*(G.O.Ms.No.449 Dt:19-10-1976)*

 

 వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు.
*(G.O.Ms.No.29 Dt:09-03-2011)*

 

 ఎట్టి పరిస్థితులలోనూ *కమ్యూటెడ్ సెలవును* HPL గా మార్చుకొనుటకు వీలులేదు.
*(G.O.Ms.No.143 Dt:01-06-1968)*

 

 ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.

 

 సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.
*(G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)

 

 డిపార్ట్ మెంటల్ టెస్ట్ - ఆన్ లైన్ పరీక్షా విధానము

*అభ్యర్ధి గంట ముందుగా పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలి*

*పరీక్షా సమయానికి ౩౦ నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి*

*రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాతఏ అభ్యర్ధిని లోపలికి అనుమతించరు*

*మీకు కేటాయించబడిన సిస్టమ్ నందు పరీక్షల లింక్ "లాగిన్ స్క్రీన్ " అందుబాటులో ఉంటుంది ..ఒకవేళ అలా లేకపోతే అక్కడి పర్యవేక్షకుడికి తెలియజేయాలి*

*10 నిమిషాల ముందు మీరు "లాగిన్ " అవ్వాల్సి ఉంటుంది*

*లాగిన్ ఐడి = రోల్ నంబర్*

*పాస్ వర్డ్ = పరీక్ష రోజు ఇవ్వబడుతుంది*

*ఇన్విజిలేటర్ పాస్ వర్డ్ ను ఉదయం పరీక్షకు అయితే 8.50 నిమిషాలకు, మద్యాహ్నం అయితే 1.50 నిమిషాలకు ప్రకటిస్తాడు.*

*ప్రశ్నలను , మరియు ఆప్షన్స్ ను కాపి చేయటం కాని నోట్ చేయటం కాని చేయకూడదు. అలా చేసినచో తీవ్రమైన చర్యలు తీసుకోబడును*

*లాగిన్ అయిన తరువాత తెరపై ఫ్రొపైల్ ఇన్ పర్ మేషన్ లో మీ వివరాలు చెక్ చేసుకొని Confirm పై క్లిక్ చేయాలి.*

*Detailed Exam Instructions వాటిని అర్ధం చేసుకొన్న తరువాత I AM READY TO BEGEN పై క్లిక్ చేయాలి.*

*ప్రశ్నల యొక్క జవాబులు గుర్తించటానికి మౌస్ ను మాత్రమే వాడాలి*

*ఈ ఆన్ లైన్ పరీక్ష నందు టైమర్ కనపడుతూ ఉంటుంది .ఇంకా ఎంత టైముందో అది సూచిస్తుంది.*

*మీ యొక్క ప్రతిస్పందనలను బట్టి ప్రశ్నల రంగు మారుతూ ఉంటుంది*

*White (Square) - మీరు ప్రయత్నించని ప్రశ్నలు*

*Red(Inverted Pentagon) -మీరు జవాబు ఇవ్వని*
*ప్రశ్నలు*

*Green (Pentagon) - మీరు జావాబులు పూర్తి చేసిన ప్రశ్నలు*

*Violet (Circle) - ఆ ప్రశ్న చూసారు అయితే జవాబు తరువాత గుర్తిస్తారు* *( marked for Review)*

*Violet ( Circle with a Tick mark) - ఆ ప్రశ్నకు జవాబు గుర్తించారు. కాని Review కొరకు మార్క్ చేశారు*

*ప్రశ్నకు జవాబు గుర్తించిన తరువాత SAVE AND NEXT బటన్ పై క్లిక్ చేయాలి.ఆ సమాదానం SAVE చేయబడి తరువాత ప్రశ్న వస్తుంది.*

*Review & Next బటన్ నొక్కిన ఆప్రశ్న పరిశీలనకు ఉంచబడి తరువాత ప్రశ్న వస్తుంది*

*ఒక ప్రశ్నకు జవాబు తేసేయాలని అనుకుంటే CLEAR RESPONSE బటన్ పై నొక్కాలి*

*SECTION NAME పై కర్సర్ ను ఉంచిన ఆ సెక్షన్ నందు జవాబు గుర్తించినవి , ఇంకా జవాబు గుర్తించాల్సినవి, తరువాత పరిశీలనకు ఉంచినవి సూచిస్తుంది.*

*ఒక వేళ మీరు అక్షరములు పెద్దవిగా చూడాలనుకుంటే.. ఇన్విజిలేటర్ అనుమతితో పైన ఉన్న ఫాంట్ సైజ్ ఎంపిక ఛేసుకొని పెద్దవిగా చూడవచ్చు.*

*PWD అభ్యర్ధులకు 120 నిమిషముల తరువాత కూడా అదనంగా ఇంకో 20 నిమిషాలు SUBMIT బటన్ అందుబాటులో ఉంటుంది*

*ఏ విధంగానైనా system log out అయినా మనం ఇచ్చిన జవాబులన్నీ save అయి ఉంటాయి. ఏ టైమ్ లో పరీక్ష ఆగిపొయిందో ఆ టైమ్ నుండి మరలా మొదలవుతుంది.*

*పరీక్షా సమయంలో రఫ్ వర్క్ కొరకు ఒక షీట్ ఇవ్వబడుతుంది దానిపై లాగిన్ ఐడి ,పాస్ వర్డ్ రాయాలి.*

*ఎట్టి పరిస్థితిలో key board ముట్టుకో రాదు .ముట్టుకుంటే ID lock అవుతుంది . అప్పుడు మీ ఇన్విజిలేటర్ సహాయం తీసుకోండి.*

*ఈ విధంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించిన తరువాత కుడి వైపున వున్న ప్రశ్నల బటన్స్ అన్ని Green colour లోకి మారినాయో లేదో తీసుకోండి.*

*పరీక్ష సమయంలో ఎప్పుడైనా మనం గుర్తించిన సమాధానాలు మార్చుకోవచ్చును.*

*Review కోసం గుర్తించిన ప్రశ్నలు సమాధానాలు గుర్తించబడని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు గుర్తించిన తరువాత మాత్రమే SUUBMIT option ను క్లిక్ చేయండి.*


*తరువాత Feedback page ఓపెన్ అవుతుంది.*
*ఈ ఆన్లైన్ పరీక్ష పై మన అభిప్రాయాలను తెలిపి క్రింద వున్న బటన్ ను క్లిక్ చేయాలి.*

*YOU HAVE SUCCESSFULLY COMPLETED THE EXAM అని స్ర్కీన్ పై కనిపిస్తుంది.*

                  ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం

*పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు జులై 31 లోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది.*

*ఫిబ్రవరి మాసంలో సమర్పించిన ఫారం 16 ఆధారంగా రిటర్న్ దాఖలు చేయాలి.*

*దాఖలు చేయవలసిన విధానం:*

*వేతనం లేదా పింఛను ద్వారా ఆదాయం పొందుచున్న వారుపెట్టుబడులపై వడ్డీ ఆదాయం పోన్స్య్ వారూఒకే గృహం ద్వారా ఆదాయం ఉన్న వారు ITR-1(సహజ్) ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయాలి.*

*ఆన్ లైన్ ద్వారా "ఇ- రిటర్న్" ను సులభంగా దాఖలు చేయ వచ్చు. దాఖలు చేసే విధానాన్ని పరిశీలిద్దాం.*

*పేరు రిజిస్టర్ చేసుకొనుట:*

*incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి Register your self అను ఆప్సన్ ను ఎంచుకొనవలెను. దానిలో పాస్ వర్డ్ తదితర వివరములను పూర్తిచేసిన తదుపరి మెయిల్ కు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తర్వాత మొబైల్ కి వచ్చిన పిన్ నంబర్ ను నమోదు చేస్తే రెజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే. మీ పాస్ వర్డ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.*

*ఫారం 26 AS:*

*ఇ- ఫైలింగ్ చేసేందుకు ఫారం 26 AS ను పరిశీలించుకోవాలి. పైన తెలిపిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తదుపరి 'VIEW FORM 26 AS' ను ఎంచు కోవాలి. దానిలో యూజర్ IDఅంటే పాన్ నంబర్రిజిస్ట్రేషన్ లో మనం ఎంచుకొన్న పాస్ వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 AS ను క్లిక్ చేసి ఎసెస్మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు అయినదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఫారం లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ- రిటర్న్ చేయాలి.*

*ఫారం 26 AS లో నమోదుల పరిశీలన:*

*ఫారం 26 AS లో మనం పరిశీలన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు కానట్లయితే DDO కు తెలియజేయాలి. సక్రమంగా నమోదు కాక పోవడానికి కారణాలు DDO త్రై మాసిక రిటర్న్(Q1, Q2, Q3, Q4) లను సమర్పించక పోవడం లేదా సమర్పించిన వానిలో పొరబాటు జరగడం అయివుండ వచ్చు. త్రైమాసిక రిటర్న్ దాఖలు చేయవలసిన బాధ్యత DDO లదే కాబట్టి వారే దాఖలు చేయడం లేదా తప్పులను సవరించడం చేయవలసి ఉంటుంది.*
,
*ఇ- ఫైలింగ్ చేయడం:*

*ఫారం 26 AS లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నట్లు సంతృప్తి చెందిన తరువాత ఇ- ఫైలింగ్ చేయడం ప్రారంభించాలి. ముందు చెప్పిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత'Quick e file ITR- 4S' ఎంపిక చేసుకోవాలి.*

*PAN నంబర్పాస్ వర్డ్పుట్టిన తేదీతడితర వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.*

*లాగిన్ అయిన వెంటనే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇష్టం అయితే నమోదు చేయవచ్చు లేదా తదుపరి అని పేర్కొన వచ్చు.*

*అనంతరం పాన్ నంబర్, ITR పేరు(ITR-1) అసెస్ మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసు కోవాలి.*

*తరువాత ఇవ్వబడిన ఆప్షన్ లు 1) పాన్ ఆధారంగా 2) గతంలో దాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3) నూతన చిరునామా లలో ఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి.*

*తదుపరి వచ్చే ఫారం లో వ్యక్తిగత వివరాలుఆదాయం వివరాలుపన్ను వివరాలు,పన్ను చెల్లింపు వివరాలు, 80 G వివరాలు నమోదు చేయాలి. నమోదులు ఎప్పటి కప్పుడు సేవ్ చేసుకొంటే మంచిది. అన్ని నమోదులు పూర్తి అయిన తరువాత సబ్ మిట్ చేయాలి.26 AS లో నమోదు అయిన పన్నుఇ- ఫైలింగ్ లో పన్ను ఒకే విధంగా ఉండాలి. లేనట్లయితే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.*

*ఎకనాలెడ్జ్మెంట్:*

*ITR- 1 సబ్ మిట్ చేసిన తరువాత ఎకనాలెడ్జ్మెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఎకనాలెడ్జ్మెంట్ సీపిసి బెంగుళూరుకు పంప వలసినదీలేనిదీ ఎకనాలెడ్జ్మెంట్ క్రింది భాగంలో పేర్కొన బడుతుంది. పంప వలసి వస్తే సంతకం చేసి నెలల లోపు పంపాలి.*

                  ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషనల్ రూల్స్-1966

*(ANDHRA PRADESH INTIGRATED EDUCATIONAL RULES-1966):*

*పాఠశాల నిర్వహణ-కొన్ని ముఖ్య విషయాలు:*

*A.E.R Rule-46(A):*
ప్రవేశ సం॥లో ఆగస్టు-31 నాటికి 5సం॥(5+) వయస్సు కలిగియున్న విద్యార్ధులను ఒకటో తరగతిలో చేర్చుకోవాలి.

*A.E.R-46(B):*
అనుబంధం 10 ప్రవేశ దరఖాస్తు ద్వారా పాఠశాలలో విద్యార్ధులను చేర్చుకోవాలి.

*A.E.R Rule 42(C):*
ఒక విద్యా సం॥లో పాఠశాల ఖచ్చితంగా 220 పనిదినాలు కలిగియుండాలి.

*A.E.R.-46(J):*
పాఠశాలను విడిచి వేరొక పాఠశాలకు పోవునపుడు,వేరొక పాఠశాల నుండి ఈ పాఠశాలలో చేరినపుడు రికార్డు షీటు నిర్వహించాలి.

*A.E.R-45:*
ఒక నెలరోజులు దాటిననూ,సెలవు లేకుండా పాఠశాలకు హాజరుకాని విద్యార్ధులను పాఠశాల రోలు నుండి తొలగించవచ్చును.

*A.E.R-35:*
విద్యార్ధుల హాజరును,ఉదయము, మధ్యాహ్నం మొదటి పీరియడ్ ఆఖరున పుర్తిచేయాలి.

*A.E.R Rule123(B):*
ఉపాధ్యాయుల హాజరుపట్టిని అనుబంధం-4 ఫారాలున్న పేజీలనువాడాలి.

*A.E.R-33:*
ప్రధానోపాధ్యాయులు విద్యా సం॥ ప్రారంభంలోనే పాఠశాల సిబ్బంది యొక్క రోజువారీ కార్యక్రమాలను "జనరల్ టైం టేబుల్" ద్వారా తెలియజేయాలి.ఆఫీస్ రూంలోనూ,ప్రతి తరగతి గదులోనూ టైం టేబుల్ ను వ్రేలాడదీయాలి.

*Rc.No.527/E2/97,Dt:16-07-1997:*
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహోపాధ్యాయులు,ఇతర సిబ్బంది తప్పనిసరిగా అసెంబ్లీ(Prayer) కు హాజరుకావాలి.లేట్ పర్మిషన్లు ఉపాధ్యాయులకు వర్తించవు.

*A.E.R Rule 77:*
ప్రతి ఉపాధ్యాయునికి కనీసం 24 పీరియడ్లు కేటాయించాలి

 

                                        ఏకీకృత సర్వీసు నిబంధనలు

      రకమైన విద్యార్హతలు, ఒకే విధమైన నియామక విధానం,ఒకే శాఖ అజమాయిషీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఒకే సర్వీస్‌ నిబంధనలు కావాలని,పyదోన్నతులలో సమాన అవకాశాలు కల్పించాలని ఉపాధ్యాయ ఉద్యమం సాగించిన సుదీర్ఘపోరాటం ఫలించింది. ఏకీకృత సర్వీస్‌ నిబంధనల అమలుకు గల ఆటంకాలు తొలగిపోయాయి. 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లోని నాన్‌ గెజిటెడ్‌ ఉపాధ్యాయ పోస్టులను, ఎం.ఇ.ఓ, హైస్కూల్‌ హెడ్మాస్టర్‌, డైట్‌ లెక్చరర్‌ తదితర గెజిటెడ్‌ పోస్టులను ఏకీకృత లోకల్‌ క్యాడర్‌గా1998 నవంబర్‌ నుండి గుర్తిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులలో ప్రతిపాదించిన సవరణను కేంద్ర ప్రభుత్వం పంపిన వెంటనే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదించడం, వెన్వెంటనే కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రకటించడం ముదావహం. 
ఏకీకృత సర్వీస్‌ నిబంధనలు అమలు చేయడం ద్వారా విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులందరికీ పదోన్నతుల్లోనూ, బదిలీల్లోనూ సమన్యాయం జరుగుతుంది. పుష్కర కాలంగా నిలిచినపోయిన పర్యవేక్షణాధికారుల పోస్టులు భర్తీ అవుతాయి. పర్యవేక్షణా వ్యవస్థ పటిష్టమవుతుంది. అధ్యాపకుల కొరతతో కునారిల్లుతున్న ఉపాధ్యాయ విద్యా శిక్షణా సంస్థలకు నూతన జవసత్వాలు చేకూరుతాయి.విద్యాశాఖలో నెలకొన్న తీవ్రమైన సంక్షోభం సమసిపోతుంది. ప్రభుత్వ విద్యారంగం బలపడటానికి అవకాశాలు మెరుగవుతాయి. వేలాది మంది ఉపాధ్యాయులకు తక్షణమే పదోన్నతులు లభిస్తాయి. పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలలో శిక్షణ పొందిన నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉద్యోగాలు లభిస్తాయి. విద్యారంగంలో పలు సమస్యలకు కారణమైన సర్వీస్‌ రూల్స్‌ వివాదం ఈనాటిది కాదు. అదే విధంగా ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ కూడా ఏ ఒక్కరి వల్లనో, లేదా రాత్రికి రాత్రే అతీంద్రియ శక్తుల ద్వారానో వచ్చి పడినవీ కాదు. 1981నుంచి ఉపాధ్యాయ ఉద్యమం ఐక్యంగా సాగించిన పోరాటాలు,2015 సెప్టెంబర్‌ 30న సుప్రీంకోర్టు ఇచ్చిన విలక్షణమైన తీర్పు,రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ సంకల్పం కారణంగానే ఆలస్యంగానైనా ఉపాధ్యాయ ఉద్యమానికి ఇంతటి మహత్తర విజయం లభించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ వివాదం - ఉపాధ్యాయ సంఘాల కృషిని మననం చేసుకోవడం అవసరమని భావిస్తున్నాము. 

ఉమ్మడి సర్వీస్‌ రూల్సు- పూర్వాపరాలు 
తొలుత విద్యాశాఖలో జీవో నెం: 259, జీఎ (రూల్స్‌) డిపార్టుమెంటు, తేదీ: 9.02.62 ప్రకారం గెజిటెడ్‌ క్యాడర్లకు ఎ.పి. ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ రూల్స్‌, జీవో నెం: 78, జీఎ (రూల్‌) డిపార్టుమెంటు , తేదీ: 10.01.62 ప్రకారం నాన్‌ గెజిటెడ్‌ క్యాడర్లకు ఎ.పి. ఎడ్యుకేషన్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ ఉన్నాయి. కాలక్రమంలో విద్యాశాఖ పాఠశాల విద్య,ఇంటర్మీడియట్‌ విద్య, ఉన్నత విద్య, వయోజన విద్య శాఖలుగా విడిపోయింది. కొత్త క్యాడర్లు సృష్టించబడినాయి. పంచాయతీరాజ్‌ వ్యవస్థలోని జిల్లా పరిషత్‌, పంచాయతీ సమితిల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్వీసులు 1981మార్చి 20న జీవో 168 ద్వారా ప్రొవిన్షియలైజ్‌ చేయబడినవి. సదరు ఉద్యోగులను,ఉపాధ్యాయులను 'ప్రభుత్వ ఉద్యోగులు'గా గుర్తిస్తూ ''యాక్ట్‌ 20 ఆఫ్‌ 1981'' ద్వారా పంచాయతీ రాజ్‌ చట్టానికి తగు సవరణ చేస్తూ వారి సర్వీసుకు చట్టబద్ధత కల్పించబడింది.
అప్పటికే విద్యాశాఖ అజమాయిషీలో ఉన్న పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడిన తరువాత ఉభయులకు కలిపి ఉమ్మడి సర్వీసు రూల్సును ఇవ్వవలసి ఉంది. కాని అప్పటికే జీవో 78 జీఎ, తేదీ:10.01.62ద్వారా అమలులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసులను ఎ.పి. ఎడ్యుకేషన్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ యొక్క పార్టు-1గా పరిగణిస్తూ, పంచాయతీరాజ్‌ పాఠశాలల ఉపాధ్యాయుల సర్వీసులను పార్టు-2 గా చేరుస్తూ తేదీ, 20.06.83న జీవో 278ని విద్యాశాఖ విడుదల చేసింది.
ఈ పూర్వరంగంలో ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉభయులకు కలిపి ఉమ్మడి సర్వీస్‌ రూల్సు రూపొందించాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. కొత్త సర్వీసు రూల్స్‌ తయారు చేయుటకు గాను, జీవో 433 జి.ఎ.డి తేదీ 4.12. 86 ద్వారా వి. సుందరేశన్‌ను ఏక సభ్య కమిషన్‌ (ఓఎంసి)గా ప్రభుత్వం నియమించింది. ఓఎంసి చేసిన సిఫారసులకనుగుణంగా1992 ఫిబ్రవరి 7న జీవో 40 ద్వారా ఉమ్మడి సర్వీసు నిబంధనలు ఇవ్వబడినవి. అయితే తాము అప్పటి వరకు అనుభవిస్తున్న ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల పదోన్నతులు తమకే ఉండాలని భావించిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కొందరు ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను వ్యతిరేకిస్తూ ట్రిబ్యునల్‌లో కేసువేశారు. దానిపై జీవో 40ని రూపొందించడంలో దొర్లిన కొన్ని సాంకేతిక లోపాలను సవరించి మరలా కొత్త ఉత్తర్వులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ట్రిబ్యునల్‌ అంగీకరించింది.అయితే ప్రభుత్వం టిబ్యునల్‌కు ఇచ్చిన మాటను అమలు పరచకుండా సాచివేత వైఖరిని అవలంభించగా, అన్ని ఉపాధ్యాయ సంఘాలు''ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి'' (యుఎస్‌పిఎస్‌)ని ఏర్పాటు చేసుకుని భారీ ఎత్తున ఉద్యమించాయి. 1998నవంబర్‌లో సమ్మెకు పిలుపునివ్వగా ప్రభుత్వం స్పందించి యుఎస్‌పిఎస్‌తో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి పూనుకున్నది. ఫలితంగా 1998 నంబవర్‌ 16న పాఠశాల విద్యాశాఖలోని గెజిటెడ్‌ పోస్టులకు సంబంధించి 505 జీవో ద్వారాను, నవంబర్‌ 20న నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు సంబంధించి 538 జీవో ద్వారా ఉమ్మడి సర్వీసు నిబంధనలను విడుదల చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (జిటిఎ) తిరిగి ఆ జీవోలకు వ్యతిరేకంగా ఎపిఎటిలో సవాలు చేసింది. దానిపై ట్రిబ్యునల్‌ తేదీ: 4.05.2000 నాడు తీర్పు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది. అప్పటి నుంచి 2003 సెప్టెంబర్‌ వరకు ఈ జీవోలు అమలు జరిగాయి. అయితే ట్రిబ్యునల్‌ తీర్పుపై ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు 30.06.2000 నాడుహైకోర్టులో అప్పీలు వేశారు. హైకోర్టు స్టే ఇవ్వలేదు. కాని తుది తీర్పుకు లోబడి జీవోలు అమలు జరుపుకోవాలని పేర్కొన్నది. తదుపరి 18.09.2003 నాడు లోకలైజేషన్‌ జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు రూల్స్‌ చెల్లవంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే పంచాయతీరాజ్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా లోకల్‌ క్యాడర్‌ ఆర్గనైజేషన్‌ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది'' అని కూడా హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది.
సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పి
హైకోర్టు తీర్పు ఇచ్చి 6 మాసాలు గడిచినా తీర్పును అమలు జరిపి తమకు పదోన్నతులు ఇవ్వడం లేదని జిటిఎ వారు కొందరు హైకోర్టులో 'కంటెంప్ట్‌' కేసును వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి పట్టని విధంగా వ్యవహరించింది. ఈ స్థితిలో హైకోర్టులోని కంటెంప్ట్‌ కేసును అడ్డుకునే దానికి ఉపాధ్యాయ సంఘాల తరఫున యుటిఎఫ్‌ 2004 మార్చిలో సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పి) వేసింది. ఫలితంగా కంటెంప్ట్‌ కేసులను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తద్వారా హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిన పరిస్థితిని అధిగమించడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులను నిలబెట్టుకునే దాని కోసం ఉపాధ్యాయ సంఘాలతోపాటు రాష్ట్ర ఫ్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి వేయాలని ఒత్తిడి చేయగా చివరకు రాష్ట్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్‌లో ఎస్‌ఎల్‌పి వేసింది. సమాంతరంగా లోకల్‌ క్యాడర్‌ ఆర్గనైజేషన్‌ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపబడినాయి.హైకోర్టు తీర్పు కారణంగా 2003 సెప్టెంబర్‌ నుంచి ఉపాధ్యాయ నియామకాలు, పదోన్నతులు, బదిలీలు నిలిచిపోయాయి. డిఎస్‌సి 2003 ఫలితాలను 2004 జూన్‌11న ప్రకటించినా నియమకాలుచేయలేని పరిస్థితులు ఒకవైపు, అంతర్‌జిల్లా బదిలీలకై ఎంతో ఆవేదనతో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు రెండవ వైపు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వంలో తగిన స్పందన లేకపోయింది.
 

ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి- పోరాటాలు
సమస్య తీవ్రతను గుర్తించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో 2004 అక్టోబర్‌ 27న ఛలో సెక్రటేరియేట్‌ పేరుతో దాదాపు లక్ష మంది ఉపాధ్యాయులతో హైదరాబాద్‌లో అపూర్వమైన ర్యాలీ నిర్వహించబడినది. రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన పెరిగింది. కృషి మెరుగైంది. ఫలితంగా లోకల్‌ క్యాడర్‌ ప్రతిపాదనలు కేంద్ర హౌంశాఖ నుంచి రాష్ట్రపతికి వద్దకు 2004 డిసెంబర్‌లో వెళ్ల్లాయి. రాష్ట్రపతి కార్యాలయం కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ ఫైలును తిప్పిపంపింది.ఈలోగా ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2005లో ఆర్డినెన్స్‌ 12/2005 ద్వారా ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ కేడర్లను రద్దు చేసింది. తరువాత జూన్‌ 2005లో యాక్ట్‌27/2005 ద్వారా చట్టం చేసి జీవోలు 95, 96, తేదీ:25.07.05. ద్వారా ఏకీకృత సర్వీస్‌ నిబంధనలు రూపొందించింది. వీటిపైనా ప్రభుత్వ ఉపాధ్యాయులు 3కోర్టులలో కేసులు వేశారు. స్టే ఇవ్వనందున 2005లో ఆ జీవోలు అమలు జరిగాయి. తదుపరి 14.08.06న ట్రిబ్యునల్‌, 28.02.07న హైకోర్టు ఆ జీవోలను కొట్టివేసినవి. రాష్ట్రపతి ఆమోదం లేకుండా కేడర్లను రద్దు చేస్తూ ఇచ్చిన యాక్ట్‌ చెల్లదని ఆ తీర్పు సారాంశం. ఫిబ్రవరి 2007లో వచ్చిన హైకోర్టు తాజా తీర్పును రద్దు చేయుటకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో 17.05.2007న ఎస్‌ఎల్‌పి వేసింది. కానీ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకుండా విచారణను చేపట్టింది. తదనంతరం జిటిఎ వారు హైకోర్టులో వేసిన కంటెప్ట్‌ కేసులపై యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విరామాన్ని ఉపయోగించకుని రాష్ట్రప్రభుత్వం మరోసారి ప్రభుత్వ,పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల క్యాడర్లను ఏకీకృతం చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు ప్రతిపాదనలు పంపగా సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి పెండింగ్‌లో ఉన్నందున ఈ దశలో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యంకాదని పేర్కొంటూ రాష్ట్రపతి కార్యాలయం ప్రతిపాదనలను తిప్పిపంపింది.
 
నష్ట నివారణకు తాత్కాలిక సర్వీసు నిబంధనలు 

2005 నుంచి అన్ని రకాల పదోన్నతులు నిలిచిపోయి ఉపాధ్యాయులకు తీవ్రమైన నష్టం జరుగుతున్నది. అర్హతలుండీ పదోన్నతి పొందకుండానే పలువురు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. నష్ట నివారణ కోసం ఏకీకృత నిబంధనల సాధనకు ఆటంకం కాకుండా 2009 జనవరి23న విద్యాశాఖ తాత్కాలిక సర్వీసు నిబంధనలు (హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుల) జీవో నెం: 9 (ప్రభుత్వ),జీవో. నెం. 10 (జిల్లా పరిషత్‌) మరియు విద్యాశాఖ సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలు జీవో నెం.11 (ప్రభుత్వ),జీవో నెం.12 (జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌)లు విడుదలైనాయి. 2009 జనవరి/ఫిబ్రవరిలో వేలాది మందికి ప్రధానోపాధ్యాయులుగా,స్కూల్‌ అసిస్టెంట్స్‌గా పదోన్నతులు లభించాయి. తదనంతరం నెలవారీ పదోన్నతులు కూడా అమలు జరిగాయి. అయినా ఎంఇఓ, డిప్యూటీ ఇఓ, డైట్‌ లెక్చరర్‌ తదితర పోస్టులు భర్తీకాకపోవడం చేత పాఠశాల విద్యారంగంలో పర్యవేక్షణ కొరవడింది. ప్రమాణాలు,ఎన్‌రోల్‌మెంట్‌పై ప్రభావం పడింది.
కొత్త రాష్ట్రంలో సరికొత్త సర్వీస్‌ రూల్స్‌
 
రాష్ట్ర విభజన అనంతరం ''కొత్త రాష్ట్రంలో సరికొత్త సర్వీసు రూల్స్‌'' అనే నినాదం ముందుకు వచ్చింది. స్టేట్‌ రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 97 ప్రకారం 371 (డి)ని రాష్ట్రానికి అన్వయించుకునే సందర్భంలో క్యాడర్లను కొత్తగా నిర్వచించవచ్చునని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి సూచించాయి.రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు. ప్రభుత్వం నుంచి జీతం పొందే వారందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులేనని, ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ తయారు చేసుకుందామని'' భరోసానిచ్చారు. కానీ ఆచరణలో అడుగు ముందుకు పడలేదు. 
జీవం పోసిన సుప్రీం తీర్పు 
2004లో సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన ఎస్‌ఎల్‌పిపై 2015సెప్టెంబర్‌ 30 నాడు భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రాష్ట్ర విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలికింది. రాష్ట్ర ఫ్రభుత్వ ఎస్‌ఎల్‌పిని అనుమతించలేదు, కాని స్థానిక సంస్థల్లో (పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌) నియామకాలు కూడా రాష్ట్రపతి ఉత్తర్వులలోని పేరా '8' (అన్ని రకాల రిజర్వేషన్లు పాటిస్తున్నందున)కి లోబడే నిర్వహించబడుతున్నందున,వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రస్తుతం ఉన్న స్థానిక క్యాడర్లతో సమీకృతం చేసేటందుకు ప్రతిపాదనలను రూపొందించి రాష్ట్రపతి ఆమోదం కొరకు కేంద్ర ప్రభుత్వానికి పంపించుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన సదరు ప్రతిపాదనలు అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదానికి చర్యలు తీసుకోవాలి. ఈలోగా సర్వీసు నిబంధనలు రూపొందించి ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు, ఇతర పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులకు కూడా సమంజసమైన పదోన్నతి అవకాశాలను కల్పించే విధంగా నిబంధనలు రూపొందించుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది''అని స్పష్టమైన మార్గదర్శకాలను న్యాయమూర్తులు జస్టిస్‌ జగదీష్‌సింగ్‌ ఖేహార్‌, జస్టిస్‌ ఆర్‌. భానుమతిలు కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలకు సూచించారు. 
ఆమేరకు 2016 మే 16న ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోరుతూ కేంద్రానికి లేఖ నెం:6245/ఎస్‌పిఎఫ్‌-ఎంసీ/2016-1 ద్వారా ప్రతిపాదనలు పంపారు. 13 నెలలుగా హౌంశాఖ వేసిన పలు కొర్రీలకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానాలు పంపించాయి. తెలంగాణ,ఎపి రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో కేంద్ర హౌంశాఖ సమావేశాలు నిర్వహించి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ వెనుకటి తేదీ (1998 నవంబర్‌) నుండి జరగాలనే అంశంపై ఏకాభిప్రాయాన్ని రాబట్టింది. 
విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య కేంద్ర హౌంశాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ఇరు రాష్ట్రాల విద్యా మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారాన్ని అభ్యర్థించారు. ఆయన మరియు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కేంద్ర హౌంశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన కారణంగా ఎట్టకేలకు హౌంశాఖ ఉమ్మడి సర్వీసు నిబంధనల ప్రతిపాదనలకు అంగీకారం తెల్పుతూ, రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ఫైల్‌ను ప్రధాన మంత్రికి పంపడం, రెండు రోజుల్లోనే ప్రధానమంత్రి సంతకం చేసి రాష్ట్రపతి కార్యాలయానికి పంపించడం,ఒక్కరోజులోనే రాష్ట్రపతి ఆమోదించడం, ఆ మరుసటి రోజే గెజిట్‌లో ప్రకటించడం వెన్వెంటనే జరిగిపోయాయి. నాలుగు దశాబ్దాల వివాదానికి తెరపడింది. ఇక అర్హతలు,సీనియారిటీ ప్రకారం అందరికీ సమాన అవకాశాలు లభించేలా సమగ్రమైన సర్వీసు నిబంధనలు రూపొందించుకోవాలి. అన్ని విధాలుగా ప్రభుత్వ పాఠశాలలుగా పరిగణింపబడుతున్న గిరిజన సంక్షేమ పాఠశాలలను కూడా విద్యాశాఖ అజమాయిషీలోకి తెచ్చి ఎంఇఓ, డిప్యూటీ ఇఓ, డైట్‌ లెక్చరర్‌ తదితర పర్యవేక్షణాధికారి పోస్టులలో వారికి కూడా అవకాశం కల్పించాలి. ఏకీకృత సర్వీసు నిబంధనల వలన కలిగే ప్రయోజనాలను వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, ప్రభుత్వ విద్యారంగం పట్ల ప్రజల్లో విశ్వాసం కల్గించేందు కు శక్తివంచన లేకుండా కృషిచేద్దాం

                                సెలవు మంజూరు అధికారం

G.O.Ms.No.58* విద్య తేది:22-04-2008 ద్వారా విద్యాశాఖలో వివిధ రకాల సెలవులు మంజూరు అధికారం,కాలపరిమితుల పై ఉత్తర్వులు ఇవ్వబడినవి,కాలక్రమేణ ఆ నియమాలను సవరిస్తూ *G.O.Ms.No.70* విద్య తేది:06-07-2009 ద్వారా ఏఏ అధికారి ఎన్ని రోజులు, ఏరకమైన సెలవులు మంజూరు చేయాలో తాజా మార్గదర్శకాలు జారీచేయబడినవి.

*ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు:*

ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు లేదా ప్రత్యేక ఆకస్మిక సెలవులు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంజూరు చేస్తారు.15 ఆకస్మిక సెలవులు,7 ప్రత్యేక ఆకస్మిక సెలవులు, ఒకేసారి ఆకస్మిక సెలవులు/ప్రత్యేక ఆకస్మిక సెలవులు 10 రోజులకు మించకుండా మంజూరు చేస్తారు.

*ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు:*

ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/ అర్ధవేతన/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు
4 నెలల వరకు మంజూరు చేస్తారు

*ప్రసూతి సెలవు(Maternity Leave):*

మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల మంజూరు విషయంలో 180 రోజుల వరకు సెలవు మంజూరు చేసే అధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,మండల విద్యాధికారులకు G.O.Ms.No.84 తేది:17-09-2012 ద్వారా కల్పించబడింది.

*మండల విద్యాధికారులు:*

తన పరిధిలోని ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు
ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,
అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు/అర్ధవేతన సెలవులు/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు నెలల వరకు మంజూరు చేస్తారు.

*ఉప విద్యాధికారి:*

తన పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలలప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథ మిక/ప్రాథమికోన్నత /ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు

అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత/ అర్ధవేతన/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు నెలల పైబడి ఆరు నెలల వరకు మంజూరుచేస్తారు.

*జిల్లా విద్యాధికారి:*

జిల్లాలోని ఉపవిద్యాధికారులకుమండల విద్యాధికారులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/అర్ధవేతనకమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 1సం॥ వరకు మంజూరు చేయవచ్చును. జిల్లాలోని అన్ని ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు 6నెలలనుండి సం॥ వరకు అన్ని రకాల సెలవులు మంజూరు చేస్తారు.

*డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్:*

మండలవిద్యాధికారులకు
/ఉన్నత/ ప్రాథమికోన్నత/ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను సం॥ నుండి సం॥ వరకు సెలవు మంజూరు చేస్తారు.

*కొన్ని ముఖ్యాంశాలు:*

సెలవు పై వెళ్ళిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా అదే పాఠశాలలో చేరవలసిన ఉంటుంది.

సెలవు నిర్ణీత గడువు ముగిసిన పిదప 15 రోజులలో వీధుల్లో చేరకపోతే జిల్లా విద్యాధాఖాధికారికి రిపోర్ట్ చేయాలి.

నిర్ణీత సమయానికి మా మించి అనుమతి లేకుండా సెలవు వినియోగించుకుంటే రీపోస్టింగ్ సందర్భంలో 4వ కేటగిరీకి బదిలీచేస్తారు.

అధికంగా వాడుకున్న సెలవును FR-18 ప్రకారం అనధికార గైర్హాజరుగా భావించి *డైస్ నాన్* గా ప్రకటిస్తారు.

 

Compensatory casual leave ( ప్రత్యామ్నాయ సెలవులు)

          15 రోజులకు మించని స్వల్పకాలిక విరామం (Short Term Vacation) లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేసిన కాలానికి ప్రత్యామ్నాయంగా మరొక పని దినాన్ని సెలవుగా వినియోగించుకోవడాన్ని సీసీఎల్ (Compensatory casual leave) అంటారు.

::వివరణ:::

         విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు కొందరు కొన్ని ప్రత్యేక కారణాల వలన రెండవ శనివారము, ఆదివారము , దసరా మరియు సంక్రాంతి సెలవు దినాల్లో పని చేయడం జరుగుతుంది.  అలా సెలవు రోజుల్లో పనిచేసి ఉంటే అందుకు ప్రతిఫలంగా కోల్పోయిన సెలవులకు బదులుగా సిసియల్ ( Compensatory casual leave )మంజూరు చేయవచ్చునని ప్రభుత్వ ఉత్తర్వులు G.o.నెం.50 తేది: 1-2 - 1968 ,  మరియు Memo నెం.13112 , తేది. 1-3-1958 ద్వారా CCL's ను వినియోగించుకొనే సౌకర్యం ఉద్యోగులకు / ఉపాధ్యాయులకు పోరాటం ద్వారా సాధించబడింది.  కావున ఉపాధ్యాయులు సెలవు దినాల్లో పని చేస్తే సిసిఎల్ వినియోగించుకోవాలని కోరుతున్నాము

I) క్యాలెండర్ సంవత్సరంలో పది రోజులకు మించకుండా సీసీఎల్ (Compensatory casual leave) సెలవులను సి.యల్ (Casual​ leave) మంజూరు చేయు అధికారే మంజూరు చేస్తారు
అనగా ప్రాథమిక ,ప్రాథమికోన్నత పాఠశాలలకు మండల విద్యాశాఖ అధికారి గారు ,ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాశాఖాధికారి Compensatory casual leave మంజూరు చేస్తారు.

 

2) మంజూరు కాబడిన సిసిఎల్ ను ఆరు నెలల లోపల వినియోగించుకోవాలి.

 

3)సి.సి.ఎల్ ఖాతాను సపరేట్ గా మంజూరు చేయు అధికారి (H M / MEO) నిర్వహించాలి. సి.యల్( Casual Leave) ఖాతాతో కలిపి నిర్వహించరాదు.

 

4) సాధారణ సెలవులు (Casual Leave )ఉన్నప్పటికీ C.C.L 's Memo నెం.934/63 - 2, తేది. 26 - 4 - 1963 ద్వారా వాడుకొనవచ్చును.

    సాధించబడిన ఉత్తర్వులను అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై మరియు సంఘాలపై ఉంది. 
అంతేకాక మండల విద్యాశాఖ అధికారులు ,ప్రధానోపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులు సెలవు దినాల్లో పనిచేశారు కాబట్టి వారికి సీసీఎల్ (Compensatory casual leave) ఇవ్వాల్సిన బాధ్యత కూడా వుంటుంది 

VOLUNTARY RETIREMENT

1. VR తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?

Ans: VR తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి VR అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.

2.  VR ఏయే కారణాలపై తీసుకోవచ్చు?

Ans:  వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.

3 . ఒక టీచరుకు అక్టోబర్ 2018 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత VR తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?

Ans: 20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే VR కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.

4. ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక VR తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?

Ans:   క్వాలిఫయింగ్ సర్వీస్ కు  సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.

5 . Loss of Pay, Long Leave (medical grounds) లో ఉండి VR కి దరఖాస్తు చేయవచ్చా?
Ans: Yes.

6 .Medical Leave లో ఉండి, స్కూల్లో జాయిన్ అయ్యాకే VR కి అప్లై చేయాలా? సెలవులో ఉండి VR తీసుకోవడం ప్రయోజనమా?

Ans:  సెలవులో ఉండి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది.

196 . అక్టోబర్ 2018 నుంచి VR తీసుకుంటే కొత్త PRC వర్తిస్తుందా?

Ans: 11 వ PRC.... ఫస్ట్ జులై, 2018 నుంచి అమల్లోకి రావాల్సి వుంది. వస్తుందనే నమ్మకమూ నాకుంది. అయితే... నోషనలా? మానిటరీ బెనిఫిట్ ఉంటుందా? అనే విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం!

197 . VR తీసుకున్న తర్వాత GI కంటిన్యూ చేయవచ్చా? GI అమౌంట్ ఎంత వస్తుంది?
Ans: VR తవ్వాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.

198 . చివరగా ఒక ప్రశ్న. 20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ సర్వీస్ మధ్య VR తీసుకుంటే పెన్షన్ ఎంతెంత వస్తుంది?

Ans: వెయిటేజీతో కలుపుకొని 33 ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయితే.... చివరి Basic Pay లో 50 % పెన్షన్ గా నిర్ధారించబడుతుంది. అలా కాకుండా VR తీసుకుంటే....
నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ > పెన్షన్
 
20>37.87% (చివరి మూలవేతనంలో)
21>39.4%
22>40.9%
23>42.4%
24>43.93%
25>45.45%
26>46.97%
27>48.48%
28>50%
(ఈ టేబుల్ 58 ఏళ్ళ వయస్సు నిండి ఉద్యోగ విరమణ చేసే వారికీ వర్తిస్తుంది.)

 

    General Questions

1) స్థానికతను ఎలా నిర్ణయిస్తారు..?

జి..నెం:674,తేదీ: 20-10-1975,జి.ఓ నెం:168, తేదీ: 10- 03-1977 ప్రకారం ఒక వ్యక్తి 4

తరగతి నుండి 10 వరకు గల 7సంవత్సరాల కాలంలో ఏ జిల్లాలో ఎక్కువ చదివితే అది అతని స్థానిక జిల్లాగా గుర్తించాలి.

2 ) EOL పెట్టిన కారణంగా ఇంక్రిమెంట్ నెల మారితే తిరిగి పాత ఇంక్రిమెంట్ నెల ఎలా పొందవచ్చు..?

జి..నెం:43, తేదీ: 05-02- 1976 ప్రకారం వైద్య కారణాలతో EOL లో ఉన్నప్పటికీ సంబందిత వైద్య ధ్రువపత్రాలతో డీఈఓ గారి ద్వారా CSE కి ప్రపోసల్స్ పంపి అనుమతి పొందితే పాత ఇంక్రిమెంట్ నెల కొనసాగుతుంది. 180 రోజులకు మించిన EOL అయితే విద్యాశాఖ కార్యదర్శి నుండి అనుమతి పొందాలి.

3) EL's ను ఉద్యోగి ఖాతాలో ఎలా జమ చేస్తారు..?

01-01-1978 ముందు వరకు డ్యూటీ పీరియడ్ అయిన తరువాతే EL's జమ చేసేవారు. జి..నెం:384, తేదీ: 05-11-.1977 నుండి జనవరి 1 ఒకసారి, జులై 1న ఒకసారి అడ్వాన్స్ గా EL'S క్రెడిట్ చేస్తున్నారు. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 115, జులై 1న మరో 15 EL'S సర్వీస్ ఖాతాలో జమ చేయగా, వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 13, జులై 1న మరో 3 EL'S సర్వీస్ ఖాతాలో జమచేస్తారు

4) లీవ్ నాట్ డ్యూ అంటేఏమిటి..?

ఒక ఉద్యోగి లీవ్స్ ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL'S గానీ లేనపుడు ఉద్యోగికి కల్పించబడిన సౌకర్యమే లీవ్ నాట్ డ్యూ. ఒక ఉద్యోగికి అత్యవసరంగా లీవ్స్ అవసరం అయ్యి ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL'S గానీ లేనపుడు భవిష్యత్తులో ఉద్యోగికి వచ్చే హాఫ్ పే లీవ్స్ ను లెక్కించి 180 రోజుల వరకు వైద్య కారణాల నిమిత్తం లీవ్ నాట్ డ్యూ మంజూరు చేస్తారు. లీవ్ నాట్ డ్యూ గా మంజూరు చేసిన సెలవుల ను హాఫ్ పే లీవ్స్ ఉద్యోగి ఖాతాలో జమ కాగానే తగ్గిస్తారు.

5) ఆగష్టు-15,జనవరి-26 జెండా వందనానికి హాజరు కాకపోతే చర్యలు ఉంటాయా?

ఆగష్టు-15, జనవరి-26 తేదీలు జాతీయ సెలవు దినాలు కావున రిజిస్టర్ లో సంతకం అవసరం లేదు. అనారోగ్యం ఉంటే జెండా వందనానికి హాజరు కాకుండా ఉండవచ్చు. అయితే సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం తగిన కారణాలు లేకుండా జెండా వందనానికి హాజరు కాకపోతే పై అధికారులు చర్యలు తీసుకోవచ్చు.

6) CPS ge basic pay + DA లో 10%కు అదనంగా మినహాయించవచ్చా..?

ఉద్యోగి బేసిక్ పే + డి.ఏ లో 10% ను మాత్రమే సిపియస్ డిడక్షన్ చేయాలి. దీనికి సమానంగా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ జమ చేస్తుంది. వాలంటరీ గా కంట్రిబ్యూట్ చేసి టైర్-1 అకౌంట్లో అమౌంట్కు జత చేయవచ్చు. టాక్స్ మినహాయింపు పొందవచ్చు. వాలంటరీ కాంట్రిబ్యూషన్ కు మ్యాచింగ్ గ్రాంటు జతచేయబడదు

7) మెటర్నిటీ లీవ్స్ వేసవి సెలవులలో పెడితే కౌంట్ అవుతాయా..?

FR 101(a) ప్రకారం మెటర్నిటీ లీవ్ కు ముందు గానీ తరువాత గానీ వేసవి సెలవులు ఉంటే మొత్తం 180 రోజులను మెటర్నిటీ లీవ్ గానే భావించాలి.

8) రిటైర్మెంట్ తరువాత ఇంక్రిమెంట్ ఉంటే లెక్కిస్తారా..?

జి..నెం:235,తేదీ:27-10- 1998 ప్రకారం రిటైర్మెంట్ అయ్యిన మరుసటి రోజు ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే ఆ ఇంక్రి మెంట్ ను నోషనల్ గా సాంక్షన్ చేసి దానిని ఇంక్రిమెంట్ బెనిఫిట్స్ లెక్కింపులో పరిగణలోనికి తీసుకోవాలి.

9)  5 సంవత్సరాల 8 నెలలు పూర్తి చేసిన. ఉద్యోగికి ఎన్ని అర్ధ వేతన సెలవులు వస్తాయి..?

  డ్యూటీ పీరియడ్ ఒక సంవత్సరం పూర్తి అయిన తరువాతనే అర్ధవేతన సెలవులు ఉద్యోగి ఖాతాకు జమ చేయబడతాయి. సంవత్సరానికి 20 చొప్పున 5 సంవత్సరాలకు 100 అర్ధవేతన సెలవులు అర్ధవేతన సెలవుల ఖాతాకు జమ చేస్తారు

10)  ప్రభుత్వ సెలవు దినాలకు ముందు తరువాత కమ్యూటేడ్ లీవ్స్ పెట్టవచ్చా?

జి..నెం:319,తేదీ: 18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు గానీ తరువాత ఉన్న ప్రభుత్వ సెలవులను మినహాయించవచ్చు. కాబట్టి ప్రభుత్వ సెలవును కమ్యూ టెడ్ సెలవుగా పరిగణించకూడదు.అయితే ఎన్ని రోజులు కమ్యూటెడ్ - లీవ్స్ పెట్టుకుంటే అన్ని పనిదినాలకు మాత్రమే వైద్య ధ్రువ పత్రాలు సమర్పించాలి

 

  Roster Points in Promotion and Appointments for every 100 postd

 NOC OF PASSPORT&PERMISSION RELATED GOS & MEMOS

 CFMS నెం.ద్వారా మీ అకౌంట్ లో పడ్డ టోటల్ అమౌంట్ తెలుసుకొనుటకు     CLICK HERE

 పై లింక్ లో లభించిన  బిల్ నెం. ద్వారా మీ శాలరీ  డిటైల్స్ తెలుసుకొనుటకు 

                 Bill Status

                

 10 TH CLASS MARKS LIST DOWN LOAD

                                            

 

Search Today in History

 

 

 

 

Search Historical Events in History

Day   Month   Year   Type 

Keyword(s)